మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. భారీ బడ్జెట్ లో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం రూరల్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.