Court Movie Review: `కోర్ట్` మూవీ రివ్యూ, రేటింగ్‌

Published : Mar 13, 2025, 01:23 AM IST

నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ `కోర్ట్`. రోషన్‌, ప్రియదర్శి, సాయికుమార్‌, శివాజీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం  నెల 14న విడుదల కానుంది. అయితే ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.   

PREV
16
Court Movie Review: `కోర్ట్` మూవీ రివ్యూ, రేటింగ్‌
court movie review

Court Movie Review: నాని హీరోగా సినిమాలు చేయడమేకాదు, కంటెంట్‌ ఉన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. `అ` సినిమాతో ప్రశాంత్‌ వర్మ అనే డైరెక్టర్‌ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఇలా తాను పరిచయం చేసిన దర్శకులు చాలా మందే ఉన్నారు. వారిలో చాలా మంది ఇప్పుడు పాన్‌ ఇండియా డైరెక్టర్లుగా రాణిస్తున్నారు.

అలానే తన వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై మరో కొత్త టాలెంట్‌ని పరిచయం చేస్తూ `కోర్ట్` అనే చిత్రాన్ని నిర్మించారు. రామ్‌ జగదీష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ మూవీలో రోషన్‌, శ్రీదేవి జంటగా నటించారు. ప్రియదర్శి, శివాజీ, సాయికుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రానికి దీప్తి గంటా సహ నిర్మాత.

ఈ మూవీ ఈ నెల 14న విడుదల కాబోతుంది. ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉంది? ఇటీవల నాని `కోర్ట్ ` నచ్చకపోతే తన `హిట్‌3` మూవీ చూడకండి అంటూ సవాల్‌ విసిరాడు. ఆ ఛాలెంజ్‌ తగ్గట్టుగానే ఉందా? ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా? `కోర్ట్`లో అసలు ఏం చూపించారనేది రివ్యూలో తెలుసుకుందాం. 

26
court movie review

కథః 
చందు(రోషన్‌) ఇంటర్మీడియట్‌ మధ్యలోనే ఆపేశాడు. తండి వాచ్‌మెన్‌, తల్లి ఐరన్‌ షాప్‌ నిర్వహిస్తుంటుంది. చదువు మానేసి రోజుకో పని చేస్తుంటాడు. ఈ క్రమంలో అతనికి జాబిలి(శ్రీదేవి) అనే అమ్మాయి పరిచయం అవుతుంది. ఒక ఫోన్‌ కాల్‌ వీరిమధ్య పరిచయాన్ని పెంచుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరు ప్రేమని వ్యక్తం చేయడమే కాదు, కలిసి తిరగడం జరిగిపోతుంది. జాబిలి.. చందు ఇంటికి కూడా వస్తూ పోతుంది.

అయితే ఈ విషయం జాబిలి బావ మంగపతి(శివాజీ)కి తెలుస్తుంది. దీంతో చందుని పోక్సో కేసులో ఇరికిస్తాడు. మంగపతి పరువు ప్రతిష్ట పెద్ద కులం అనే ఆహాంకారంతో ఉంటాడు. శ్రీదేవి ఫ్యామిలీని మంగపతినే శాషిస్తుంటాడు. ఇంట్లో ఆయన చెప్పిందే వేదం. దీంతో జాబిలితోపాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ కేసు విషయంలో నోరు మెదపలేకపోతారు. చందుపై పోక్సోతోపాటు అనేక తప్పుడు కేసులు పెట్టి శిక్ష పడేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తారు.

అందులో భాగంగా పోలీస్‌ స్టేషన్‌ తోపాటు లాయర్‌, ఇలా అందరిని డబ్బులతో మ్యానేజ్‌ చేస్తారు. దీంతో ఎవరూ ఈ కేసుని వాధించేందుకు ఒప్పుకోరు. ఒప్పుకున్న లాయర్‌ కూడా అమ్ముడుపోతాడు. చందు నేరస్థుడు అని తేలిపోయే టైమ్‌ వచ్చింది. సోమవారం ఫైనల్‌ తీర్పు ఉంటుంది. ఆ సమయంలోనే పేరుమోసిన లాయర్‌ మోహన్‌ రావు(సాయికుమార్‌) గురించి చందు ఫ్రెండ్స్ కి తెలుస్తుంది.

ఆఖరు ప్రయత్నంగా మోహన్‌రావుని కలుద్దామని  చందు ఫ్యామిలీ తరఫున ఫ్రెండ్స్ వెళ్తారు. అక్కడ జూ లాయర్‌ తేజ(ప్రియదర్శి)ని కలుస్తారు. కేసుని చదివిన మోహన్‌ రావు కూడా రిజెక్ట్ చేస్తాడు. అంతా అయిపోయింది? ఇక చందుకి శిక్ష తప్పదు అనే పరిస్థితిలో ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి?.

ఈ కేసులోకి తేజ ఎలా వచ్చాడు? ఎందుకు వచ్చాడు?  ఆయన కేసు ఒప్పుకోవడంతో కథలో చోటు చేసుకున్న ట్విస్ట్ లేంటి? ఎలాంటి వాదనలు జరిగాయి? ప్రత్యర్థి లాయర్లని తేజ ఎలా ఆడుకున్నాడు? ఈ కేసులో ఆయన బయటకు తీసిన నిజాలేంటి? అంతిమంగా కేసు రిజల్ట్ ఏంటి? కోర్ట్ వాదోపవాదనలు ఎలా జరిగాయనేది మిగిలిన కథ.
 

36
court movie review

విశ్లేషణః 

కోర్ట్ రూమ్ డ్రామా నేపథ్యంలో ఇటీవల అడపాదడపా చాలానే సినిమాలు వచ్చాయి. `వకీల్‌ సాబ్‌` తర్వాత నుంచి బాగా ఊపందుకున్నాయని చెప్పొచ్చు. అల్లరి నరేష్‌ `నాంది` కూడా కోర్ట్ రూమ్‌ డ్రామా కథతో వచ్చి పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు అదే కోవాలో `కోర్ట్` చిత్రం వచ్చింది. ఇది పోక్సో కేసు ప్రధానంగా తెరకెక్కింది. అయితే ఇది కేవలం కోర్ట్ రూమ్‌ డ్రామా మాత్రమే కాదు, లవ్‌ ఉంది, దాని వెనకాలు ఎమోషన్‌ ఉంది.

వీటితోపాటు ఆలోచింప చేసే అంశాలున్నాయి. పోక్సో కేసులో ఉన్న పాజిటివ్‌లు, నెగటివ్‌ లు ఏంటనేది చర్చించిన సినిమా కూడా. ఈ చట్టం గురించి నేటి యువతకి తెలియాల్సిన ఆవశ్యకత గురించి చెప్పే మూవీ అవుతుంది. అదే సమయంలో తప్పుడు కేసులు పెట్టి అమాయకులను ఎలా బలిపశువులను చేస్తున్నారో చెప్పే మూవీ అవుతుంది.

సినిమా కథగా చూసినప్పుడు ఫస్టాఫ్‌ కాస్త నెమ్మదిగానే సాగుతుంది. పాత్రలను ఎస్టాబ్లిష్‌ చేయడానికి కాస్త టైమ్‌ పట్టింది. అయితే చందుకి ఫైనల్‌ తీర్పు ఇవ్వాల్సిన సన్నివేశం నుంచి కథ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లి, అసలు చందు, జాబిలి జర్నీ ఎలా స్టార్ట్ అయ్యిందనేది? ఎలా ప్రేమించుకున్నారనేది చూపించారు.

ఆ లవ్‌ కాస్త రెగ్యూలరే అయినా తెరపై కొత్త ఫీలింగ్‌నిస్తుంది. ఈ కేసులో చందుని నిర్ధోషిగా నిరూపించేందుకు ఫ్యామిలీ మెంబర్స్ చేసే ప్రయత్నాలు, లాయర్‌గా ప్రియదర్శి కథ మొత్తం తెలుసుకోవడం కోసం ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్లడం వంటివి ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. కథని సీరియస్‌గా మారుస్తాయి. ఆద్యంతం ఎంగేజింగ్‌గా సాగుతుంది. కొంత ఫన్‌, లవ్‌, సరదా సన్నివేశాలో ఫస్టాఫ్‌ సాగుతుంది. 
 

46
court movie review

కేసుని ప్రియదర్శి తీసుకోవడం నుంచి కథ ఊపందుకుంటుంది. నెక్ట్స్ ఏం జరగబోతుందనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. సెకండాఫ్‌ మొత్తం కోర్ట్ రూమ్‌ డ్రామాగానే సాగుతుంది. కోర్ట్ లో వాదోపవాదనలు జరుగుతూనే ఉంటాయి. వాయిదాలు పడుతూనే ఉంటాయి. ప్రియదర్శి కేసులు వాదించే విధానం, ఆయన ఇచ్చే ట్విస్ట్ లు, వేసే డైలాగ్‌లు అదిరిపోయేలా ఉంటాయి. విజిల్స్ వేసేలా ఉంటాయి.

ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఇంతలోనే ట్విస్ట్ లతో సర్‌ప్రైజ్‌ చేస్తుంటుంది. కోర్ట్ లో వాదోపవాదనలే సినిమాలో చాలా కీలకం. ఆడియెన్స్ ని హుక్‌ చేసే పాయింట్‌ కూడా అవే. కోర్ట్ లో వాదనలు ఇలా కూడా జరుగుతాయా? ఎలా ప్రశ్నించాలని? ఎలా కౌంటర్‌ ఇన్వెస్టిగేట్‌ చేయాలనేది చూపించిన తీరు అదిరిపోయింది.

చాలా చోట్ల గూస్‌ బంమ్స్ ఫీలింగ్‌ కలుగుతుంది. ఆడియెన్స్ చేత విజిల్స్ వేయిస్తుంది. క్లైమాక్స్ కి వచ్చే కొద్ది అది పీక్‌లోకి వెళ్తుంది. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ అదిరిపోయేలా ఉంటుంది. క్లైమాక్స్ లో ఇలాంటి పోక్సో కేసుల గురించి ప్రియదర్శి చెప్పిన తీరు, ప్రశ్నించిన తీరు వాహ్‌ అనిపిస్తుంది. అది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన పాయింట్‌ కూడా.

రియల్‌ లైఫ్‌లో ఇలాంటి కేసులపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత, ఆవశ్యకత గురించి చెప్పిన విధానం బాగుంది. చదువు అందరికి చెప్పకపోయినా, చట్టం గురించి మాత్రం అందరికి చెప్పాలని చెప్పే డైలాగ్‌ అదిరిపోయింది.  
 

56
court movie review

నటీనటులుః
సినిమాలో చందు పాత్రలో రోషన్‌ నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్న ఈ అబ్బాయి ఈ మూవీతో ఆల్మోస్ట్ హీరోగా పరిచయం అయ్యాడనే చెప్పొచ్చు. చాలా బాగా చేశాడు. నేచురల్‌గా చేశాడు. పాత్రలో జీవించాడు. ఇక జాబిలి పాత్రలోకొత్త అమ్మాయి శ్రీదేవి కూడా అంతే బాగా చేసింది. రియాలిటీకి దగ్గరగా ఆ అమ్మాయి ఉంది.

అలానే యాక్ట్ చేసి మెప్పించింది. లాయర్‌ తేజగా ప్రియదర్శి తనకు సూట్‌ అయ్యే పాత్రలో ఒదిగిపోయాడు. సెకండాఫ్‌ ని తనవైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అందరి అటెన్షన్‌ తనవైపుకి తిప్పుకున్నాడు, ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా సింపుల్‌గా వాహ్‌ అనిపించాడు. లాయర్‌ మోహన్‌ రావుగా సాయికుమార్‌ ఒదిగిపోయాడు. ఉన్నంత సేపు అదరగొట్టాడు.

మరోవైపు మంగపతి పాత్రలో శివాజీ తనలోని మరో యాంగిల్‌ని చూపించాడు విలనిజం చూపిస్తూ రెచ్చిపోయాడు. పరువు కోసం ఏమైనా చేస్తాడనే పాత్రలో అదరగొట్టాడు. డామినేటెడ్‌ అల్లుడిగా బాగా చేసి మెప్పించారు. రోహిణి, శుభలేఖ సుధాకర్‌, ఇతర పాత్రధారులు పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. 
 

66
court movie review

టెక్నీకల్‌గాః 
టెక్నీకల్‌గా సినిమా బాగుంది. విజయ్‌ బుల్గానన్‌ సంగీతం బాగుంది. పాటలతోపాటు ఆర్‌ఆర్‌ కూడా అదరగొట్టాడు. కెమెరా వర్క్ బాగుంది. విజువల్స్ కూడా కథ చెప్పేలా ఉన్నాయి. ఎడిటింగ్‌ పరంగా కొంత కేర్‌ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలకు కొదవ లేదు. ఇక దర్శకుడు రామ్‌ జగదీష్‌ ఎంచుకున్న పాయింట్‌ అదిరిపోయింది.

ఓ రకంగా సహసమనే చెప్పాలి. ఇలాంటి కేసుని డీల్‌ చేయడం సాహసమే. కానీ దాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పడం విశేషం. కేవలం సినిమా కోసమే కాదు, ఆడియెన్స్ లోనూ దీనిపై అవగాహన కల్పించే ప్రయత్నం అభినందనీయం. సినిమాలో ఆ పాయింట్‌ని డీల్‌ చేసిన విధానం సూపర్బ్. ఇది చూడ్డానికి చాలా సెన్సిటివ్‌ కేసు.

కానీ ఈ కేసు వెనక అమాయకులను ఎలా బలి చేస్తున్నారనేది చూపించిన తీరు బాగుంది. ప్రతి ఒక్కరిని ఆలోచింప చేసేలా ఉంటుంది. సినిమాలో కేవలం కోర్ట్ వాదనలే కాదు, దీని వెనకాల కదిలించే ఎమోషన్స్ ఉన్నాయి. వాటిని అంతే బాగా డీల్‌ చేసే విధానం అదిరిపోయింది. రామ్‌ జగదీష్‌ దర్శకుడిగా నిరూపించుకోవడమే కాదు, ఎంతో మందిని ఆలోచింప చేశాడు. ఇదే ఈ మూవీలో ఉన్న బ్యూటీ. హైలైట్‌ పాయింట్‌ కూడా.  

ఫైనల్‌గాః `కోర్ట్`.. నాని చెప్పినట్టు చూడాల్సిన సినిమా, తెలుసుకోవాల్సిన కథ. 

రేటింగ్‌ః 3
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories