Puri Jagannadh: పూరీ జగన్నాథ్ వరుస పరాజయాల్లో ఉన్నారు. ఆయన రూపొందించిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద డిజాప్పాయింట్ చేస్తున్నాయి. ఇటీవల కాలంలో ఆయనకు `ఇస్మార్ట్ శంకర్` మూవీ తప్ప మరేదీ ఆడలేదు. `లైగర్` డిజాస్టర్ అయ్యింది.
`డబుల్ ఇస్మార్ట్` సైతం డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు పూరీ జగన్నాథ్ ఎవరితో మూవీ చేస్తారనేది సస్పెన్స్ గా మారింది. నాగార్జున పేరు తెరపైకి వచ్చింది. ఆయనతోపాటు మరో ఒకరు ఇద్దరు హీరోల పేర్లు వినిపించాయి. కానీ అవి రూమర్లుగానీ మిగిలిపోయాయి.
తాజాగా పూరీ జగన్నాథ్ కి హీరో దొరికాడట. నాగార్జుననో మరో హీరో కాదు. విలన్‌తో సినిమా చేయబోతున్నారు పూరీ. విజయ్ సేతుపతి ఇటీవల కాలంలో హీరోగా కంటే విలన్‌గానే ఎక్కువ మూవీస్ చేస్తున్నారు.
ఆయన తెలుగులో `ఉప్పెన` సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. హీరోయిన్ తండ్రి పాత్రలో నటించి మెప్పించారు. ఆ తర్వాత కమల్ హాసన్ `విక్రమ్`లో విలన్‌గా చేసి మెస్మరైజ్ చేశాడు.
తాజాగా పూరీ జగన్నాథ్.. విజయ్ సేతుపతితో సినిమా చేయబోతున్నారట. స్క్రిప్ట్ ఓకే అయ్యిందని, పూరీ జగన్నాథ్ నెరేషన్ విని విజయ్ సేతుపతి ఫుల్ ఎగ్జైట్ అయ్యారట. మరో ఆలోచన లేకుండానే ఓకే చేశారట.
అంతేకాదు తాను చేయాల్సిన ఇతర కమిట్ మెంట్స్ ని పక్కన పెట్టి ఇప్పుడు పూరీ జగన్నాథ్‌తో మూవీ ఫస్ట్ చేయడానికి ఓకే చేశారట. ప్రస్తుతం ఈ వార్త ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేస్తుంది.
ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్.. తన పూరీ కనెక్ట్ బ్యానర్‌లో సినిమాలు చేసేవారు. చాలా కాలంగా ఇదే జరుగుతుంది. ఛార్మి సారథ్యంలో రన్ అవుతున్న పూరీ కనెక్ట్స్, పూరీ టూరింగ్ టాకీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించేవి.
అయితే ఇటీవల చాలా సినిమాలు వీరి బ్యానర్‌లో చేశారు. బోల్తా కొట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రొడక్షన్ మార్చారు పూరీ. సౌత్ టాప్ ప్రొడక్షన్ హౌజ్ కేవీఎన్ నిర్మాణ సంస్థ దీన్ని నిర్మిస్తుందట.
దీంతో ఛార్మి ని ఈ సారి పూరీ దూరం పెట్టినట్టు తెలుస్తుంది. అయితే వరుస పరాజయాల నేపథ్యంలో ఛార్మి వద్ద కూడా డబ్బులు లేవని తెలుస్తుంది. అందుకే బయటి ప్రొడక్షన్‌లో చేస్తున్నారని అంటున్నారు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్, ఛార్మీకి మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే కలిసి సినిమా చేయడం లేదని టాక్. మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది.
also read: అల్లు అర్జున్ అతి నమ్మకమే దెబ్బ కొట్టింది.. `వరుడు` డిజాస్టర్‌కి అసలు కారణం ఇదే!