లైగర్ ఫ్లాప్ తర్వాత విజయేంద్ర ప్రసాద్ ఫోన్ చేశారు..షాకింగ్ మ్యాటర్ బయటపెట్టిన పూరి జగన్నాధ్

First Published | Aug 11, 2024, 10:45 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ అవుతుండడంతో నేడు వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్, ఎనెర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం డబుల్ ఇస్మార్ట్. సంజయ్ దత్ విలన్ రోల్ లో నటించిన చిత్రం ఇది. ఆగష్టు 15న గ్రాండ్ రిలీజ్ అవుతుండడంతో నేడు వరంగల్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. 

Double iSmart

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పూరి జగన్నాధ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబుల్ ఇస్మార్ట్ చిత్రంలో రామ్ పోతినేని ఎనేర్జి కనిపిస్తుంది అని అన్నారు. రామ్ ఒక కసితో ఈ చిత్రాన్ని చేసాడు అని పూరి అన్నారు. ఈ చిత్రంలో నటించిన, వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పూరి కృతజ్ఞతలు తెలిపారు. 


సాధారణంగా హిట్ సినిమా చేసినప్పుడు చాలా మంది ఫోన్ చేసి కంగ్రాట్స్ చెబుతుంటారు. ఫ్లాప్ అయితే పెద్దగా కాల్స్ రావు. నా చివరి చిత్రం లైగర్ ఫ్లాప్ అయిన తర్వాత ఒక ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఫోన్ చేసి నాకు ఒక సాయం చేస్తారా అని అడిగారు. 

ఆయన కొడుకు రాజమౌళి పెద్ద డైరెక్టర్.. నేను ఆయనకి సాయం చేయడం ఏంటి అనుకున్నా. సరే ఏం చేయాలి చెప్పండి సర్ అని అడిగా. మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడు చేస్తున్నారు. కథ రెడీ అయితే నాకు ఒకసారి కథ వినిపించండి అని అన్నారు. ఆయన ఎందుకు అలా అడిగారా నాకు అర్థం అయింది. ఆయన మాట్లాడుతూ మీ లాంటి డైరెక్టర్ ఫెయిల్ అయితే నేను తట్టుకోలేను. చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. కథ చెబితే అవి సరిచేసుకోవచ్చు అని చెప్పారు. ఆయన మాటలతో తాను ఎమోషనల్ అయిపోయినట్లు పూరి తెలిపారు. 

Latest Videos

click me!