Puri Jagannadh: ఆ హీరోయిన్ తో పూరి జగన్నాధ్ కి 6 ఫ్లాపులు.. ఆమెపై ఊహించని కామెంట్స్ వైరల్

Published : Jan 02, 2026, 05:11 PM IST

పూరి జగన్నాధ్ ఇటీవల కాలంలో వరుస పరాజయాలు ఎదుర్కొంటున్నారు. నిర్మాతగా కూడా ఫెయిల్ అవుతున్నారు. పూరి జగన్నాధ్, ఛార్మితో కలిసి సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

PREV
15
పూరి జగన్నాధ్ ఫ్లాపులు 

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ సాలిడ్ హిట్ అందుకుని చాలా కాలం అవుతోంది. ఇటీవల కాలంలో పూరి జగన్నాధ్ కి ఎక్కువగా ఫ్లాపులే ఉన్నాయి. ఆ మధ్యన ఇస్మార్ట్ శంకర్ ఒక్కటి మాత్రమే హిట్ అయింది. తర్వాత మళ్ళీ ఫ్లాపులు మొదలయ్యాయి. కొన్నేళ్లుగా పూరి జగన్నాధ్ దర్శకత్వం మాత్రమే కాకుండా పూరి కనెక్ట్స్ పేరుతో బ్యానర్ స్థాపించి సినిమాలు నిర్మిస్తున్నారు. 

25
పూరితో కలిసి సినిమాలు

నిర్మిస్తున్న ఛార్మి  పూరి జగన్నాధ్ ప్రొడక్షన్ లో క్రేజీ హీరోయిన్ ఛార్మి భాగస్వామిగా ఉన్నారు. జ్యోతి జ్యోతి లక్ష్మి మూవీ నుంచి పూరి జగన్నాధ్ ఛార్మితో కలసి సినిమాలు నిర్మిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నిర్మించిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ మాత్రమే విజయం సాధించింది. జ్యోతి లక్ష్మి మూవీ పర్వాలేదనిపించింది. 

35
6 ఫ్లాప్ సినిమాలు ఇవే 

రోగ్, పైసా వసూల్, మెహబూబా, రొమాంటిక్, లైగర్, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. వీటిలో పైసా వసూల్ మూవీ బాలయ్యతో తెరకెక్కించింది. విజయ్ దేవరకొండ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన డిజాస్టర్ అయింది. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ కూడా ఫ్లాప్ అయింది. 

45
ఛార్మితో జర్నీ 

 బాలయ్యతో అన్ స్టాపబుల్ షోకి గతంలో పూరి జగన్నాధ్ అతిథిగా హాజరయ్యారు. తన ఫ్లాపు సినిమాల గురించి మాట్లాడారు. అన్ని సినిమాలు బావుంటాయనే తీస్తానని.. కానీ అన్ని సినిమాలు హిట్ కావు అని పూరి తెలిపారు. తనకి సినిమా నిర్మాణం విషయంలో ఛార్మిని కలిసిన తర్వాతే ధైర్యం వచ్చింది ని పూరి తెలిపారు. 

55
ఛార్మిపై పూరి కామెంట్స్ 

ప్రొడక్షన్ పనులు మొత్తం ఛార్మి మాత్రమే మేనేజ్ చేస్తుంది అని పూరి తెలిపారు. తమ కాంబినేషన్ లో వరుస ఫ్లాపులు ఎదురవుతున్నా పూరి మాత్రం ఛార్మి గురించి ఇలా మాట్లాడడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.  

Read more Photos on
click me!

Recommended Stories