Akhanda 2 Collections: బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన `అఖండ 2` మూవీ బాక్సాఫీసు వద్ద స్ట్రగుల్ అవుతుంది. వంద కోట్ల కలెక్షన్లు దాటినా కూడా ఈ మూవీ భారీగా నష్టాలను మిగిల్చబోతుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది డిసెంబర్లో `అఖండ 2`తో అలరించారు. ఇది నాలుగేళ్ల క్రితం వచ్చిన `అఖండ`కి సీక్వెల్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో హీరోయిన్ సంయుక్త, పూర్ణ, హర్సాలి ముఖ్య పాత్రలు పోషించారు. ఆది పినిశెట్టి విలన్ గా నటించాడు. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. బాలయ్య కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందింది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ డిసెంబర్ 12న రిలీజ్ అయ్యింది. ఫైనాన్స్ ఇష్యూస్ కారణంగా డిలే అయిన విషయం తెలిసిందే. ఇది సినిమాపై గట్టి ప్రభావం చూపించింది.
25
`అఖండ 2`కి డివైడ్ టాక్
ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందన రాబట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీని చూసి చాలా వరకు ఆడియెన్స్ డిజప్పాయింట్ అయ్యారు. బాలయ్య అభిమానులే పెదవి విరిచారు. వాళ్లు ఎక్స్ పెక్ట్ చేసింది ఒకటి, సినిమాలో చూపించింది మరోటి ఉండటంతో తీసుకోలేకపోయారు. దీంతో రెండో రోజు నుంచే ఈ మూవీ కలెక్షన్లు భారీగా పడిపోయాయి. అయితే దర్శకుడు బోయపాటి ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే పాన్ ఇండియా లెవల్లో విడుదల చేశారు. శివతత్వం ప్రధానంగా సాగే మూవీ కావడంతో నార్త్ ఇండియా ఆడియెన్స్ కి బాగా కానెక్ట్ అవుతుందని, కలెక్షన్ల పరంగా రికార్డులు క్రియేట్ చేస్తుందని భావించారు. కానీ బాక్సాఫీసు వద్ద వారి లెక్కలన్నీ తారుమారయ్యాయి.
35
అఖండ 2 తాండవం 22 రోజుల కలెక్షన్లు
`అఖండ 2 తాండవం` మూవీ థియేటర్లలో సత్తా చాటలేకపోయింది. దారుణంగా పడిపోయింది. ఇక సినిమా విడుదలై 22 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఇప్పటి వరకు ఎంత కలెక్షన్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ అయ్యిందా? ఇంకా ఎంత రావాలి అనేది చూస్తే. ఇప్పటి వరకు 22 రోజులకుగానూ ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.121కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఇది ఏకంగా రూ.95కోట్ల వసూళ్లని రాబట్టింది. ఇతర అన్ని స్టేట్స్ లో ఏడు కోట్లు రాబట్టగా, ఓవర్సీస్ లో ఐదు కోట్లు రాబట్టింది. ఈ లెక్కన ఈ మూవీ దాదాపు రూ.70కోట్ల షేర్‌ని రాబట్టింది.
`అఖండ 2`కి రిలీజ్‌కి ముందు అయిన థియేట్రికల్ బిజినెస్ రూ.103కోట్లు. అంటే రూ.104కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది. కానీ ఇప్పుడు సుమారు రూ.34కోట్ల దూరంలో ఉందీ మూవీ. ఇంకా అంత షేర్ రావాలంటే రూ.60కోట్లకుపైగా గ్రాస్ రావాలి. ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ క్లోజింగ్‌కి చేరుకుంటుంది. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోజుకి మూప్పై లక్షలు మాత్రమే వస్తోంది. ఇలా ఇంకా వంద రోజులు నడిచినా బ్రేక్ ఈవెన్ కాలేదు. దీంతో వంద కోట్ల కలెక్షన్లు దాటినా అది ఉపయోగం లేకుండాపోయిందని చెప్పొచ్చు.
55
అఖండ 2కి నష్టాలు
వచ్చే వారం ప్రభాస్ `ది రాజా సాబ్` రిలీజ్ కాబోతుంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ అవుతుంది. అన్ని థియేటర్లలో ఆ మూవీనే వేస్తారు. దీంతో `అఖండ 2`ని థియేటర్ల నుంచి ఎత్తేస్తారు. ఆటోమెటిక్‌గా బాక్సాఫీసు వసూళ్లు క్లోజ్ కాబోతున్నాయని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఈ మూవీకి సుమారు రూ.30కోట్లకుపైగా నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే నిర్మాతలు ముందుగానే సేఫ్ అయ్యారు. కానీ సినిమాని కొన్న బయ్యర్లు మాత్రం గట్టిగానే నష్టపోతారని చెప్పొచ్చు. మరి వారిని ఎలా ఆదుకుంటారో చూడాలి.