కచ్చితంగా చూడాల్సిన పునీత్‌ రాజ్‌ కుమార్‌ 9 సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Published : Jan 20, 2025, 07:55 PM IST

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్. అందులోనూ ఈ 9 సినిమాలు ఏ తరం వాళ్ళు చూసినా ఇష్టపడతారు. మరి అవేంటో చూద్దాం. 

PREV
19
కచ్చితంగా చూడాల్సిన పునీత్‌ రాజ్‌ కుమార్‌  9 సూపర్ హిట్ సినిమాలు ఇవే!
అప్పు

పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మొదటి సినిమా `అప్పు`. 2002లో విడుదలైన ఈ సినిమా ప్రజల మెప్పు పొందింది. కాలేజీ యువతీ యువకులు ప్రేమలో పడినప్పుడు కుటుంబాన్ని ఎలా ఎదుర్కొంటారు, సవాళ్లను ఎలా స్వీకరిస్తారనేది కథ. ఇది తెలుగులో రవితేజ నటించిన `ఇడియట్‌`కి రీమేక్‌. ఈ మూవీ టైటిల్‌తోనే అభిమానులు ముద్దుగా పునీత్‌ని `అప్పు` అని పిలుచుకుంటారు. 

29
అభి

పునీత్ రాజ్‌కుమార్, రమ్య జంటగా నటించిన సినిమా `అభి`. 2003లో విడుదలైన ఈ చిత్రాన్ని పార్వతమ్మ రాజ్‌కుమార్ నిర్మించారు. ఇది కూడా పక్కా ప్రేమకథ. ఇది తెలుగులో కళ్యాణ్‌ హీరోగా `అభిమాన్యు` పేరుతో రీమేక్‌ అయ్యింది. ఇక్కడ కూడా మంచి ఆదరణ పొందింది. 

39
అరసు

2007లో విడుదలైన `అరసు` సినిమాలో పునీత్ రాజ్‌కుమార్‌ని విభిన్న కోణంలో చూడొచ్చు. సినిమా ప్రారంభంలో ధనవంతుడిగా, తర్వాత మధ్యతరగతి జీవితాన్ని కూడా చూపించారు. అప్పుతో పాటు రమ్య, మీరా జాస్మిన్ నటించారు. 

49
మిలన

2007లో విడుదలైన ఈ సినిమాలో పార్వతి మేనన్ జంటగా నటించారు. విడాకులు తీసుకున్న జంట చివరికి కలిసిపోవడం ఈ సినిమా కథ. సినిమా పాటలు ఇప్పటికీ సూపర్ హిట్. పూజా గాంధీ ప్రత్యేక పాత్రలో కనిపించారు.

59
పరమాత్మ

2011లో విడుదలైన ఈ సినిమా అప్పటివరకు పునీత్ నటించిన సినిమాలకు భిన్నమైనది. దీపా సన్నీధి, ఐంద్రిత రాయ్ నటించారు. సినిమాలో రంగాయణ రాఘు పాత్ర హైలైట్. రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రంతో పునీత్‌ యూత్‌కి మరింతగా కనెక్ట్ అయ్యారు. 

69
జాకీ

2010లో విడుదలైన `జాకీ` సినిమాలో పునీత్ రాజ్‌కుమార్ మాస్ లుక్‌లో కనిపిస్తారు. భావన మేనన్ జంటగా నటించిన ఈ సినిమా బడ్జెట్ 7 కోట్లు. ముప్పై కోట్లు వసూలు చేసింది. కన్నడనాట ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. ఈ మూవీతో తిరుగులేని స్టార్‌ అయ్యారు పునీత్‌. 

79
హుడుగారు

2011లో `అప్పు` మరో సూపర్ హిట్ సినిమా ఇచ్చారు, అదే `హుడుగారు`. శ్రీనగర్ కిట్టి, యోగేష్‌ స్నేహితులుగా కనిపించారు. రాధిక పండిట్ కథానాయిక. ఇది కూడా మంచి విజయం సాధించింది. 

89
పృథ్వి

మళ్ళీ పార్వతితో కలిసి అప్పు నటించిన సినిమా `పృథ్వి`. ఐఏఎస్ అధికారిగా అప్పు కనిపించారు. ఈ సినిమా చూసి చాలామంది ఐఏఎస్ కావాలని కలలు కన్నారు. అంతగా యువతని ప్రభావితం చూపించిందీ మూవీ. 

99
రాజకుమార

2017లో విడుదలైన `రాజకుమార` సినిమా ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఉంది. అప్పు పాట అంటే అందరికీ గుర్తొచ్చేది నీనే రాజకుమార పాటే. కుటుంబ ప్రాముఖ్యత, పెద్దలను గౌరవించడం వంటివి ఈ సినిమా ద్వారా నేర్చుకోవచ్చు.

;పునీత్‌ రాజ్‌ కుమార్‌ నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణించినా అభిమానులు ఆయన్ని ఆరాధిస్తూనే ఉన్నారు. ఇప్పటికీ ఆయనపై అదే ప్రేమని కలిగిఉండటం విశేషం. అందుకు ఆయన సినిమాల్లో హీరోగానే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ హీరోగా నిలిచారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. 

read  more: విజయ్‌ ఫ్యాన్స్ కి గుడ్‌ న్యూస్‌, దళపతి69 చివరి సినిమా కాదు, మరో మూవీకి కమిట్‌ అయిన స్టార్‌ హీరో

also read: ప్రముఖ విలన్‌ విజయ రంగరాజు కన్నుమూత, విష్ణువర్థన్‌పై కామెంట్స్ తో సంచలనం

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories