‘సంక్రాంతికి వస్తున్నాం’ లాభాలు దిల్ రాజుకు అందవా?

Published : Jan 20, 2025, 06:35 PM IST

వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టి విజయం సాధించింది. అయితే, దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా పరాజయం కారణంగా ఈ లాభాలు ఆయనకు చేరకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

PREV
15
 ‘సంక్రాంతికి వస్తున్నాం’ లాభాలు దిల్ రాజుకు అందవా?
Sankranthiki Vasthunam, venkatesh, dil raju, game changer


ఇప్పుడు ఎక్కడ విన్నా ‘సంక్రాంతికి వస్తున్నాం’కబుర్లే.  వెంకటేష్‌, అనిల్‌ రావిపూడి కాంబోలో వచ్చిన ఈ సినిమా రూ.100 కోట్ల వసూళ్లు రాబట్టింది.  మొదటి వారం రోజులు సినిమా అత్యధిక ఆక్యుపెన్సీతో రన్‌ అయ్యింది. చాలా చోట్ల అదనపు షోలు యాడ్‌ చేశారు. బుక్ మై షో లో చాలా తక్కువ సమయంలో 2 మిలియన్‌ల టికెట్లు బుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ సినిమా రూ.100 కోట్ల షేర్‌ సినిమాల క్లబ్‌ లో చేరి అందరినీ ఆనందపరుస్తోంది. 

25


‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్ర యూనిట్‌ సభ్యులు అధికారికంగా రూ.100 కోట్ల పోస్టర్‌ను విడుదల చేశారు. కేవలం 6 రోజుల్లో సినిమా రూ.100 కోట్లకు మించి షేర్ రాబట్టింది అంటూ పోస్టర్‌లో పేర్కొన్నారు. ఈ వీక్‌ పెద్దగా సినిమాలు లేకపోవడంతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ఇంకా థియేటర్లలో సినిమాను చూడాలి అనుకుంటూ ఉన్న కారణంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా లాంగ్‌ రన్‌లో రూ.150 కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాల వారి అంచనా. అయితే ఇది దిల్ రాజుకు ఆనందం కలిగించే విషయమే అయినా ఆయనకు ఆ లాభాలు అందవు అంటున్నారు. అందుకు కారణం గేమ్ ఛేంజర్ ఇంపాక్ట్ అంటున్నారు. 
 

35


రాంచరణ్ (Ram Charan) హీరోగా  స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) తెరకెక్కించిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. దిల్ రాజు (Dil Raju)  కెరీర్లో 50వ సినిమాగా రూపొందింది కాబట్టి మొదటి నుండి మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. కానీ ఆ అంచనాలు ఈ సినిమా అందుకోలేక చతికిలపడింది. మొదటి షోతోనే సినిమా మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా ఇంపాక్ట్ చూపలేకపోయింది. మొత్తానికి సంక్రాంతి పూర్తైపోయింది. శెలవులు పూర్తై జనం ఎవరి పనుల్లో వారు పడ్డారు. ఈ నేపధ్యంలో గేమ్  ఛేంజర్..ఇంక పికప్ అయ్యే పరిస్దితి లేదని తేలిపోయింది. దాంతో ఈ సినిమా ఫ్లాఫ్ అని తేల్చేసారు.
 

45


ప్రొడ్యూసర్ దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందించారు. RRR లాంటి భారీ హిట్ అందుకున్న రామ్ చరణ్ సోలోహీరో మూవీ కావడం, సక్సెస్ పుల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రావడంతో గేమ్ ఛేంజర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ మొత్తంలో జరిగాయి. చాలా చోట్ల నష్టాలు రికవరీ ఇవ్వాల్సి ఉంటుందని అంచనా వేసారు. కానీ సంక్రాంతికి వస్తున్నం సినిమాని అదే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవటంతో లాభం,నష్టం లేకుండా సరిపెట్టేస్తారని అంటున్నారు.  దాంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమా  వల్ల లాభాలు వచ్చినా దిల్ రాజు దాకా అవి చేరుతాయనే నమ్మకం లేదంటున్నారు. 
 

55


సంక్రాంతి బరిలో మొట్ట మొదటగా దిగిన గేమ్ ఛేంజర్ కలెక్షన్స్ పరంగా రోజురోజుకు చతికిలపడినట్లు తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం, బాలయ్య డాకు మహారాజ్ లు గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్స్ ప్రభావం చూపుతున్నాయి. దీంతో గేమ్ ఛేంజర్ మూవీ కలెక్షన్లపై రోజురోజుకు తగ్గుతున్నాయి. గేమ్ ఛేంజర్ .. మూవీపై డాకుమహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు.. ఫైరసీ ఎఫెక్ట్ గేమ్ ఛేంజర్ కలెక్ష్లన్లపై ప్రభావం పడిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
 

Read more Photos on
click me!

Recommended Stories