Singer Ramana : ‘పల్సర్ బైక్’ రమణ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్.. వధువు ఎవరంటే?

Published : Jan 04, 2024, 07:19 PM ISTUpdated : Jan 04, 2024, 07:21 PM IST

‘పల్సర్ బైక్’ రమణ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈరోజు గ్రాండ్ గా ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. 

PREV
16
Singer Ramana :  ‘పల్సర్ బైక్’ రమణ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్.. వధువు ఎవరంటే?

‘పల్సర్ బైక్’ (Pulsar Bike Song)తో సింగర్ రమణ (Singer Ramana)  ఫేమ్ అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ అతని ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అలాగే బుల్లితెరపైనా ఆయా షోల్లో మెరిసి అవకాశం దక్కింది. 

26

ఒక్కసాంగ్ తోనే తను సెలబ్రెటీగా మారిపోయారు. ‘జబర్దస్త్’, ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ వంటి షోల్లోనూ పెర్ఫామ్ చేశాడు. దాంతో టీవీ ఆడియెన్స్ కు మరింతగా దగ్గరయ్యాడు. గతంలో జానపద గేయాలు పాడి అలరించారు. 

36

అయితే, ‘పల్సర్ బైక్’ రమణ తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు. జీవితంలో తను మరో అడుగు ముందుకు వేశారు. వివాహా బంధంలో అడుగుపెడుతున్నట్టు చెప్పుకొచ్చారు. తాజాగా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఆ వీడియోను పంచుకున్నారు. 

46

తాను కట్టుకోబోయే అమ్మాయి పేరు కందన శ్రీ. పేరు కు తగ్గట్టుగానే రమణ కాబోయే భర్త చూడముచ్చటగా ఉంది. వీరి ఇద్దరి జోడీ చక్కగా ఉంది. ఇక నిశ్చితార్థం పూర్తవ్వడంతో అభిమానులు విషెస్ తెలుపుతున్నారు. 

56

గతంలో  రమణకు పెద్ద బ్రేకప్ స్టోరీ కూడా ఉంది. దానిపై ‘బేబీ2’ అనే షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు. అలాంటి రమణ మొత్తానికి పెళ్లి చేసుకోబోతుండటంతో అందరూ సంతోషిస్తున్నారు. శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

66

ఇక రమణ తన ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన వీడియోను తాజాగా పంచుకున్నారు కానీ.. డిసెంబర్ లోనే జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి గ్రాండ్ గా కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. ఫొటోషూట్, ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అదిరిపోయేలా చేశారు. త్వరలో పెళ్లిపైనా అప్డేట్ అందించనున్నారు. 

click me!

Recommended Stories