అయితే సినిమా చివరి షెడ్యూల్ ఉంది. సెట్‌లో వెంకటేష్ హడావుడి చేశాడట. త్వరగా చేయండి, `త్రిమూర్తులు` సినిమా డబ్బింగ్ వర్క్ ఉందని, వెళ్లాలి అంటూ ఆత్రం చేశాడట . కానీ ఆ రోజు డేట్స్ `శ్రీనివాస కల్యాణం` మూవీకే ఉన్నాయి. ఈ మూవీ కాకుండా మరో చిత్రం డబ్బింగ్ చెప్పాలని చెప్పి షాట్ పెట్టకుండానే వెళ్లిపోయాడట వెంకీ. ఈ విషయం నిర్మాత కాంట్రగడ్డ మురారికి తెలిసింది.
దీంతో మళ్లీ వెంకటేష్‌పై షూటింగ్ చేయాల్సింది. నెక్ట్స్ డే షూటింగ్ క్యాన్సిల్ చేయించాడట నిర్మాత. ఆ తర్వాత రోజు పెట్టించాడట. వెంకటేష్ వస్తే కనీసం కుర్చీ కూడా వేయోద్దని, ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని యూనిట్‌కి చెప్పాడట. ఆయన మాటతో ఎవరూ వెంకటేష్‌తో మాట్లాడలేదట. దీంతో చాలా అవమానంగా ఫీలయ్యాడట వెంకటేష్.
ఇక సినిమా షూటింగ్ అయిపోయింది. రిలీజ్‌కి రెడీగా ఉంది. వెంకటేష్‌కి ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వలేదు. కేవలం అడ్వాన్స్ మాత్రమే ఇచ్చాడట నిర్మాత. పారితోషికం అడిగితే ఇవ్వనని చెప్పేశాడట. దీంతో వెంకీ సౌత్ ఇండియాలో ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ `పెప్సీ`లో సభ్యత్యం తీసుకొని మరీ ల్యాబ్‌కి నోటీసులు పంపించారట. కానీ దాన్ని లెక్కచేయలేదట నిర్మాత కాట్రగడ్డ మురారి. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయనే కాదు ప్రముఖ రైటర్, జర్నలిస్ట్ శ్రీకాంత్ కూడా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పంచుకున్నారు.
ఇందులో కొసమెరుపు ఏంటంటే వెంకటేష్ ఆసక్తి చూపించిన `త్రిమూర్తులు` మూవీ డిజాస్టర్‌గా నిలిస్తే, `శ్రీనివాస కల్యాణం` మూవీ మంచి విజయాన్ని సాధించింది. వెంకటేష్‌కి రిలీఫ్‌నివ్వడం విశేషం.