25 కోట్ల భూకబ్జా. న్యాయం కోసం కోర్టుకు హాజరైన గౌతమి

First Published | Aug 13, 2024, 6:18 AM IST

 తన నుంచి కొట్టేసిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. 


సీనియర్‌ నటి గౌతమి కి చెందిన భూమిని కబ్జా చేసిన సంగతి తెలిసిందే. ఆ విషయమై ఆమె గత కొంతకాలంగా పోరాడుతున్నారు.  పోలీసులను సైతం  ఆశ్రయించింది. రూ.25 కోట్ల విలువైన స్థలం కబ్జా చేశారని.. అదేంటని ప్రశ్నించినందుకు తనను, తన కూతురిని చంపుతామని బెదిరిస్తున్నారంటూ చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో గతంలో ఫిర్యాదు చేసింది. ఇప్పుడా కేసు కోర్టుకు వెళ్లింది. 

Property fraud complaint by actress Gautami goes to court jsp


 వివరాల్లోకి వెళితే.. గౌతమికి శ్రీపెరుంబూర్‌ సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో రూ.46 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. తన అనారోగ్యం కారణంగా కొన్ని ఆస్తులు అమ్మేయాలనుకుంది. ఈ పనిని అలగప్పన్‌ అనే ఏజెంట్‌కు అప్పజెప్పింది.  కారైక్కుడికి చెందిన అళగప్పన్‌ రామనాథపురం జిల్లా కడలాడి సమీపంలో గౌతమికి చెందిన స్థలం కొనుగోలు చేస్తానని చెప్పి రూ.3 కోట్లు తీసుకుని మోసానికి పాల్పడ్డాడు.  



 ఆ ఆస్తిపై కన్నేసిన అలగప్పన్‌ ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాల సాయంతో దాన్ని తన సొంతం చేసుకున్నాడు. ఇదేంటని గౌతమి ప్రశ్నించగా.. రాజకీయ అండతో నటిని, ఆమె కూతురిని చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ సమస్యల వల్ల తన కూతురి చదువు కూడా డిస్టర్బ్‌ అవుతోందని ఫిర్యాదులో పేర్కొంది గౌతమంది. తన నుంచి కొట్టేసిన రూ.25 కోట్ల విలువైన స్థలాన్ని తిరిగి తనకు అప్పజెప్పాలని అభ్యర్థించింది. తనపై బెదిరింపులకు పాల్పడుతున్న అళగప్పన్‌పై చర్యలు చేపట్టాలని కోరింది. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Actress Gautami


ఇందుకు సంబంధించి గౌతమి రామనాథపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అరెస్టు అయిన అళగప్పన్, ఆయన భార్య నాచ్చియార్‌ తదితరులు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా గౌతమి తరఫున హాజరైన న్యాయవాది.. వారికి బెయిల్‌ ఇవ్వకూడదని అభ్యంతరం వ్యక్తం చేశారు.  భూకబ్జా కేసులో తనకు న్యాయం దక్కేవరకు పోరాడుతానని గౌతమి తెలిపారు.
 


ఇక  గౌతమి ప్రముఖ వ్యాపారవేత్త సందీప్‌ భాటియాను పెళ్లి చేసుకుంది. వీరికి సుబ్బలక్ష్మి అనే కూతురు పుట్టింది. కొంతకాలానికే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో భర్తకు విడాకులు ఇచ్చేసింది. అప్పటినుంచి సుబ్బలక్ష్మి.. గౌతమి వద్దే ఉంటోంది. కాగా కొన్నేళ్లపాటు కమల్‌ హాసన్‌తోనూ కలిసి ఉన్న ఆమె 2016లో అతడితో విడిపోయింది.

Latest Videos

click me!