Bigg Boss Season 8: బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా లేడీ సూపర్ స్టార్..? నిజమెంత.?

First Published Aug 12, 2024, 9:21 PM IST

తమిళ బిగ్ నుంచి కమల్ హాసన్ తప్పుకోవడంతో.. ఈసీజన్ ను ఎవరు నడిపించబోతున్నారు అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ తమిళ్ బిగ్ బాస్ కు కొత్త హోస్ట్ ఎవరో తెలుసా..? తెలిస్తే షాక్ అవుతారు. 

బిగ్‌బాస్‌ సీజన్‌ 8 కి అంతా సిద్దం అయ్యింది. ఇటు తెలుగు.. అటు తమిళ సీజన్లు కొన్ని రోజులు తేడాతో స్టార్ట్ కాబోతున్నాయి. అయితే ఈసారి తెలుగు సీజన్ హోస్ట్ గా కింగ్ నాగార్జునే కంటీన్యూ అవుతుండగా..అటు తమిళ బిగ్ బాస్ ను మొదటినుంచీ నడిపిస్తున్న కమల్ హాసన్ మాత్రం ఈసారి సీజన్ నుంచి తప్పుకున్నారు. దాంతో ఈసారి తమిళ బిగ్ బాస్ కు హోస్ట్ ఎవరు అనేది హాట్ టాపిక్ గామారింది. 
 

bigg boss logo

దాదాపు అన్ని భాషల్లోనూ హిట్టయ్యింది బిగ్‌బాస్‌ రియాలిటీ షో.  ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది షో.  చాలా కాలంగా హిందీ, కన్నడ భాషల్లో బిగ్ బాస్ షో కోనసాగుతుండగా.. తెలుగు తమిళ భాషల్లో మాత్రం ఇప్పటి వరకూ 7 సీజన్లు సక్సెస్ ఫుల్ గా జరుపుకుంది. ఎప్పటికప్పుడు హౌస్ లోకి ఎవరు వెళ్తారు అనే విషయంలో ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచుతూనే ఉన్నారు బిగ్ బాస నిర్వహకులు.  తెలుగులో ఇప్పటికే చాలా మంది స్టార్స్ పేర్లు వినిపిస్తున్నాయి. 

Latest Videos


తెలుగుతో పాటు తమిళంలో కూడా ఎనిమిదో సీజన్‌ ప్రారంభం కాబోతున్నది. తమిళంలో బిగ్‌బాస్‌ బాగా సక్సెస్‌ అయ్యింది. అయితే  తమిళంలో మొదటి నుంచి బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తూ వస్తుున్న స్టార్ హీరో కమల్ హాసన్.. ఈసారి తాను చేయలేనని తప్పుకున్నారు. ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఉండటంతో.. ఆయన ఈ షోకు దూరం అయ్యారు. కాగా తమిళ బిగ్ బాస్ సీజన్ 8ను ఎవరు హోస్ట్ చేయబోతున్నారు అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఈక్రమంలోనే చాలామంది పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 

Kamal and Simbu

మరి ఇప్పుడు కమలహాసన్‌ ప్లేస్‌లో ఎవరు హోస్ట్ చేస్తారు? దీనిపై సోషల్‌ మీడియాలో ఎవరికి తోచిన పేరు వారు చెబుతున్నారు. అధికారికంగా నిర్వాహకులు ప్రకటన చేయకపోయినా స్టార్‌ హీరోల పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖంగా తమిళ రొమాంటిక్ హీరో శింబు పేరు ఎక్కువగా వినిపించింది. ఆయనే ఫిక్స్ అని అనుకున్నవారు కూడా ఉన్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బిగ్‌బాస్‌ సీజన్‌ 8ను ఓ  లేడి హోస్ట్‌ చేస్తున్నారని తెలిస్తోంది. 

ఇంతకీ ఆమె ఎవరో కాదు..లేడి సూపర్‌స్టార్‌ నయనతార. కోలీవుడ్‌లో ఈ మాట చెప్పుకుంటున్నారు. ఇప్పటికే నిర్వాహకులు నయనతారను సంప్రదించారట! ఆమె కూడా ఓకే చెప్పారట కూడా. 40 ఏళ్లకు అడుగు దూరంలో ఉన్న నయనతార..  సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్కుకున్నారు. ఆమె అయితే ఈ షోను పర్ఫెక్ట్ గా నడిపిస్తారని మేకర్స్ అనుకుంటున్నారు. అంతే కాదు ఆడియన్స్ అభిప్రాయం కూడా ఇదే అని తెలుస్తోంది. 
 

Simbu

ఇక ఈ షోకు హోస్ట్ గా ఉండాల్సిందని.. మక్కల్ సెల్వన్ విజయ్‌ సేతుపతిని కూడా బిగ్ బాస్ టీమ్ అడిగారట.  ఇంతకు ముందు సన్‌ టీవీలో మాస్టర్‌ చెఫ్‌, నమ్మ ఊర్‌ హీరో వంటి కార్యక్రమాలను విజయ్‌ సేతుపతి నిర్వహించారు. అందుకే బిగ్‌బాస్‌ 8కు కూడా ఆయననే అడిగారనే వార్త కూడా వినిపిస్తోంది. అలాగే హీరోలు సూర్య, శింబు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. మరి తమిళ్ బిగ్ బాస్ హోస్ట్ గా ఎవరు  చేయబోతున్నారు అనేది చూడాలి. 

click me!