మెగా బ్రదర్ నాగబాబు రీసెంట్ గా N మీడియా ఎంటర్టైన్మెంట్స్ పేరుతో ఛానెల్స్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఎంటర్టైన్మెంట్ న్యూస్ తో పాటు భక్తి న్యూస్, హెల్త్ న్యూస్, వరకే పరిమితం అవ్వనున్నాయి N మీడియా ఛానెల్స్. అందులోను ఇంటర్వ్యూలు మాత్రమే ఇవ్వనున్నారు. ఇక భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని.. వీటి నుంచి పొలిటికల్ న్యూస్ కూడా రాబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతానికి యూట్యూబ్ ఛానల్స్ తో ఈ N మీడియా రన్ అవ్వనుంది. త్వరలో శాటిలైట్ ఛానెల్ గా తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.