సురేష్ బాబు అక్కడ ఆ కామెంట్స్ ఏంటి? పద్దతేనా, విమర్శలు, ట్రోలింగ్

Published : Jul 11, 2024, 06:06 AM IST

వివాదాలకు దూరంగా ఉండే సురేష్ బాబు..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. 

PREV
111
 సురేష్ బాబు అక్కడ ఆ కామెంట్స్ ఏంటి?  పద్దతేనా, విమర్శలు, ట్రోలింగ్
suresh babu


సినిమా పరిశ్రమ ట్రెండ్స్ పై ఎప్పటికప్పుడు మాట్లాడుతూంటారు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు. ఆయన మాటల్లో లాజిక్ ఉంటుంది. వాస్తవ పరిస్దితులను మొహమాటం లేకుండా మొహం మీద కొట్టినట్లు చెప్తూంటారు. తాజాగా మరోసారి ఆయన ప్రస్తుతం నడుస్తున్న టిక్కెట్ రేట్ల పెంపు, వెసులుబాటుపై మాట్లాడారు. అయితే ఈ సారి ఆయన మాట్లాడిన మాటలు విమర్శలకు, ట్రోలింగ్ కు గురి అవుతున్నాయి. అందుకు కారణం సురేష్ బాబు చేసిన కామెంట్స్ కాదు..ఆయన మాట్లాడిన ప్రదేశం గురించి..వివరాల్లోకి వెళితే..

211
Suresh Babu


తిరుమల శ్రీవారిని బుధవారం పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. నిర్మాత సురేష్ బాబు, దర్శకుడు గోపీచంద్ మలినేని, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారి సేవలో వేర్వేరుగా పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా.. ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. 

311
Suresh babu

దర్శన  అనంతరం మీడియాతో మాట్లాడిన సురేష్ బాబు మాట్లాడుతూ.. శంకర్ దర్శకత్వం వహించిన భారతీయుడు 2 చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నామని అన్నారు. భారతీయుడు 2 సినిమా టికెట్ రేట్ల పెంపుపై పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. టికెట్ రేట్స్ గురించి ప్రభుత్వం పెద్ద సమస్య చేయటం లేదు. వాళ్లు ఏది కావాలంటే అది చేసేస్కోవచ్చు అని చెప్పారు. టిక్కెట్ రేట్ల విషయంలో ఏ సమస్యా ఉండదని చెప్పారు. దానికి  G.O కూడా సింపుల్ ఫై చేసి ఇస్తామని  మొన్న #PawanKalyan గారు చెప్పారు. 

411


అయితే టికెట్ రేట్స్ పెంచటం కన్నా ఫిల్మ్ వ్యూయింగ్  అనేది అందరికి మనం అందుబాటులో పెట్టాలి, ఎక్కువమంది వచ్చి సినిమా చూస్తుండాలి. ఆడియన్స్ థియేటర్స్ కు రావటం లేదు. మేము నిర్మాతలుగా ఎలాంటి సినిమాలు తీసుకొచ్చి వాళ్లని థియేటర్స్ కు తీసుకురావాలనేది ప్లాన్ చేస్తున్నాం అని చెప్పుకొచ్చారు.

511


అయితే సురేష్ బాబు మాటల్లో తప్పు పట్టే విషయం ఏమి లేదు . సినిమా టికెట్‌ రేట్ల పెంపు కన్నా.. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే ముఖ్యం అని ఆయన చెప్పటం అందరికీ నచ్చే విషయమే. ఆయన తిరుమల గుడి దగ్గరే ఆ విషయం మాట్లాడటం చాలా మందికి నచ్చలేదు. గుడి దగ్గర సినిమా విషయాలు చర్చ ఎందుకు పెట్టడం, తాము రిలీజ్ చేస్తున్న భారతీయుడు 2  సినిమా ప్రమోట్ చేసుకుంటున్నట్లుగా మాట్లాడటం కూడా భక్తులకు నచ్చలేదు.

611
Suresh babu


దాంతో సోషల్ మీడియాలో ఈ విషయమై పెద్ద చర్చ మొదలైంది.  గుడి ఆవరణలో కి విలేకరుల మైకులని ఎందుకు నిషేదించకూడదు?? అని డైరక్ట్ గా దేవస్దానం వారిని ప్రశ్నిస్తున్నారు. ప్రతీ చోట బిజినెస్ మాట్లాడటం పద్దతి కాదు. మనం ఎక్కడున్నాము అనేది చూసుకోకుండా సురేష్ బాబు సినిమాలు గురించి, బిజినెస్ గురించి మాట్లాడటం నచ్చలేదు. యాక్షన్ తీసుకోవాలి అంటున్నారు. 

711


ఇక భారతీయుడు 2 విషయం వస్తే  సినిమా టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.   ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా  సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు  వీలు కల్పించింది. సినిమా విడుదలకానున్న రోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 19 వరకు ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంపాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది.

811
Suresh babu


ఈ నేపధ్యంలో థియేటర్ కు వెళ్లి సినిమాలు చూసే వారు తగ్గారని,  ఫుట్ ఫాల్ పెరగటం లేదని చెప్పే సురేష్ బాబు ...ఎందుకు రేట్లు పెంచమని ప్రభుత్వాన్ని కోరారు అని ప్రశ్నిస్తున్నారు. ఓ డబ్బింగ్ సినిమాకు ఇలా రేట్లు పెంచితే చూద్దామనుకునేవాళ్లు సైతం వెనక్కి తగ్గుతారని ,ఇంత సింపుల్ లాజిక్ సురేష్ బాబు ఎలా మర్చిపోయారని సోషల్ మీడియా జనం ప్రశ్నిస్తున్నారు. 

911
suresh babu


గతంలో సురేష్ బాబు మాట్లాడుతూ...వారంలో టికెట్ ధరలు పెంచుకోవడం లేదా తగ్గించుకునే అవకాశం థియేటర్లకు కల్పించాలి. వారాంతంలో టికెట్ రేట్స్ రూ. 250 ఉంటే.. మిగతా రోజులలో రూ. 150కే అమ్ముకునే విధంగా ఉండాలి. ఆ విధంగా మాక్సిమమ్ రేట్ తో పాటు టికెట్ రేట్ తగ్గించే వీలు థియేటర్స్ కి కల్పించాలి. ఇటీవల థియేటర్స్ లో ఫుట్ ఫాల్(అక్యూపెన్సీ) పెరిగిందనే వార్తలలో నిజం లేదు. అదంతా భ్రమ మాత్రమే. కొన్ని మంచి సినిమాలకు మాత్రమే జనాలు వస్తున్నారు.” అని సురేష్ బాబు అన్నారు.

1011


సురేష్ బాబు కంటిన్యూ చేస్తూ .. “మేం ప్రతీ రోజు ఫుట్ ఫాల్ ని గమనిస్తున్నాం. ఎక్కడకూడా అక్యూపెన్సీ శాతం పెరిగినట్లు కనిపించలేదు. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్స్ లో ఆదరణ పొందుతున్నాయి. జనాలు చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడట్లేదు. కంటెంట్ ఉన్నదా లేనిదా అని మాత్రమే చూస్తున్నారు. అయితే.. స్టార్ హీరోల సినిమాలు చూడటం నాకు కూడా ఇష్టమే. అందులో అన్ని రిచ్ గా ఉంటాయి. సాంగ్స్, లొకేషన్ ఇలా ఆకట్టుకుంటాయి. స్టార్ అనేది అన్ని వేళలా వర్కౌట్ కాదు. 
 

1111

ఎందుకంటే.. రీసెంట్ రజినీకాంత్ జైలర్ సూపర్ హిట్. కానీ.. అంతకుముందు సినిమాలు ప్లాప్. ఆక్షయ్ కుమార్ OMG 2 పెద్ద హిట్. అంతకుముందు సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరోవైపు విరూపాక్ష, బేబీ లాంటి చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. ఇక్కడ సినిమా చిన్నది, పెద్దది కాదు.. కంటెంట్ ముఖ్యం” అంటున్నారు సురేష్ బాబు. ప్రస్తుతం సురేష్ బాబు మాటలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.  

click me!

Recommended Stories