11ఏళ్ల కాపురం, రెండు సార్లు అబార్షన్‌.. రాజ్‌ తరుణ్‌ బండారం బయటపెట్టిన లాయర్‌.. సంచలన ఆరోపణలు..

Published : Jul 10, 2024, 11:41 PM IST

హీరో రాజ్‌ తరుణ్‌, లావణ్యల వివాదం మరింత ముదురుతుంది. ఇండస్ట్రీలో పెద్ద దుమారం రేపుతుంది. తాజాగా లావణ్య తరఫు లాయర్ చేసిన ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి.   

PREV
15
11ఏళ్ల కాపురం, రెండు సార్లు అబార్షన్‌.. రాజ్‌ తరుణ్‌ బండారం బయటపెట్టిన లాయర్‌.. సంచలన ఆరోపణలు..
Raj Tarun

హీరో రాజ్‌ తరుణ్‌.. లావణ్య అనే అమ్మాయి విషయంలో వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. రాజ్‌ తరుణ్‌, లావణ్య పెళ్లిచేసుకున్నారని, కలిసి కాపురం చేశారని చెబుతుంటే, తాము రిలేషన్‌లో ఉన్నామని, కానీ ఆమె ప్రవర్తనలో మార్పు చూసి దూరం పెట్టానని రాజ్‌ తరుణ్‌ చెబుతున్నాడు. ఈ క్రమంలో ఒకరి జాతకాలు మరొకరు లీక్‌ చేస్తున్నారు. ఇటీవల లావణ్య ఫోన్‌లో ఎలాంటి బుతులు మాట్లాడిందో, మస్తాన్‌ సాయితో ఆమె ఎలాంటి రిలేషన్‌ పెట్టుకుందో అని చెబుతూ ఓ ఆడియో రికార్డు ని విడుదల చేశాడు రాజ్‌ తరుణ్‌. తాజాగా లావణ్య లాయర్‌ కళ్యాణ్‌ దిలీప్‌ సుంకర సంచలన విషయాలను బయటపెట్టాడు. 

25

రాజ్‌ తరుణ్‌, లావణ్య పెళ్లి చేసుకున్నారని, 11ఏళ్లు కలిసి కాపురం చేసినట్టు తెలిపారు. ఈ క్రమంలో రెండుసార్లు ఆమెని కడుపు చేశాడని, ఒకసారి మిస్‌ క్యారీ అయ్యిందని, మరోసారి అబార్షన్‌ చేశాడని చెప్పాడు లాయర్. అంతేకాదు సుమారు 700 ఆధారాలను కోర్ట్ కి సబ్మిట్‌ చేశామని, ఆధారాలను వెరిఫై చేసుకున్నాకే రాజ్‌తరుణ్‌పై కేసు ఫైల్‌ చేశారని తెలిపారు. ఈ క్రమంలో ఆయనపై 420, 493, 506 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. ఇందులో భాగంగా లాయర్‌ దిలీప్‌ సుంకర క్యూబ్‌ టీవీతో మాట్లాడుతూ, సంచలన ఆరోపణలు చేశారు. 

35

లావణ్యకి రెండు సార్లు అబార్షన్‌ కావడం వల్ల గర్భాశయం కూడా దెబ్బతిన్నదని, భవిష్యత్‌లో పిల్లలు పుడతారో, పుట్టరో కూడా తెలియని దారుణ పరిస్థితిలో లావణ్య ఉందన్నారు. అంతేకాదు, లావణ్య.. రాజ్‌ తరుణ్‌ని కోరుకుంటుందని, ఆయనపై ఆమెకేసు పెట్టలేదని చెప్పింది. మాల్వి మల్హోత్రా అనే అమ్మాయి గతంలో తనని జైలుకు పంపించిందని, మళ్లీ ఇప్పుడు నా అంతు చూస్తానంటోంది, ఆమె నుంచి తనకు రక్షణ కల్పించాలని పోలీస్‌ కంప్లెయింట్‌ ఇవ్వడానికి పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లిందని, ఆ కేసులో ఆ మాల్వీ ఎవరు అని పోలీసులు విచారిస్తే రాజ్‌ తరుణ్‌ డొంక కదిలిందని చెప్పాడు లాయర్‌. అంతేకాని రాజ్‌ తరుణ్‌ని బెదిరించాలని, బ్లాక్‌ మెయిల్‌ చేయాలని లావణ్య ఉద్దేశ్యం కాదని చెప్పారు లాయర్‌. 
 

45

ఈ సందర్భంగా రాజ్‌ తరుణ్‌ కొట్టినట్టు కొన్ని ఫోటోలు చూపించాడు లాయర్‌. లావణ్యని ఎలా హింసపెట్టాడో అంటూ సెల్‌ ఫోన్‌లో ఫోటోలు చూపించాడు. అలాగే అబార్షన్‌ ఫోటోలను కూడా చూపించడం గమనార్హం. రాజ్‌ తరుణ్‌.. గత కొంత కాలంగా లావణ్యకి దూరంగా ఉంటున్నాడని, తన అపార్ట్ మెంట్‌కి రావడం లేదని, మరో హీరోయిన్‌తో ఉండటం వల్లే లావణ్యకి దూరమయ్యాడని ఆయన ఆరోపించాడు. ఈ క్రమంలో ఈ అపార్ట్ మెంట్‌ ఆమెకే ఇచ్చేస్తానని కూడా చెప్పాడని లాయర్‌ అన్నారు. అయితే లావణ్య తనకు రాజ్‌ తరుణ్‌ కావాలని అంటుందని, అంతేకానీ ఆయనపై కక్ష్య సాధించే ఉద్దేశ్యం లేదని చెప్పాడు. 
 

55

ఈ క్రమంలో మరికొన్ని సంచలన విషయాలు వెల్లడించారు లాయర్‌. వారి పర్సనల్‌ ఛాటింగ్‌కి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని, ఫోటోలు, వీడియోలతో సహా ఉన్నాయని, రాజ్‌ తరుణ్‌ ఎలాంటి మనిషో తెలియజేస్తామని, ఆ వీడియోలు, ఫోటోలు మీడియాకి, కోర్ట్ కి సబ్మిట్‌ చేస్తామని ఆయన వెల్లడించారు. మస్తాన్‌ సాయితో ఎందుకు అక్రమ సంబంధం అంటగట్టాడో కూడా తేలుతుందన్నారు. అలాగే విడాకుల పేపర్‌ మీద సైన్ పెట్టాలని ఒత్తిడి తెచ్చాడో లేదో చెప్పమనండి? అమెరికాలో ఉన్న లావణ్యని ఇండియాకి పిలిపించి డ్రగ్స్ కేసులో ఇరికించాడో లేదో చెప్పమనండి అంటూ లాయర్‌ షాకిచ్చాడు. ఇప్పుడు లావణ్య తరఫు లాయర్‌ దిలీప్‌ సుంకర చేసిన కామెంట్లు పెద్ద దుమారం రేపుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories