మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ కు మరోసారి ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే పలుమార్లు కోర్టు మెట్లు తొక్కిన ఈ బాలీవుడ్ బ్యూటీ కి మారోసారి నోటీసుుల వచ్చినట్టు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సినిమాలకంటే ఎక్కువగా పర్సనల్ లైఫ్ లోనే కాంట్రవర్సి అవుతోంది. వరుసగా వార్తల్లో నిలుస్తోంది. మరీ ముఖ్యంగా మనీలాండరింగ్ కేసు ఆమెకు నిద్రలేకుండా చేస్తోంది. ఆర్ధిక నేరగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో జాక్వెలిన్ స్నేహం వివాదాస్పదమైంది. సుకేష్‌కు సంబంధించిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) టార్గెట్‌గా మిగిలిపోయింది.
26
ఇప్పటికే పలు మార్లు ఈ కేసులో నోటీసులు అందుకున్న జాక్వెలిన్ కు.. తాజాగా ఈ కేసులో ఈడీ మళ్లీ సమన్లు పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జాక్వెలిన్‌ను ఈడీ మరోసారి విచారించనున్నట్లు తెలుస్తుంది. గతంలో గ్యాంగ్‌స్టర్ సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించి 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కోర్టు విచారణకు హాజరయ్యింది బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్. మనీలాండరింగ్ కేసులో పటియాల హౌస్ కోర్టు దగ్గర హడావిడి చేసింది జాక్వెలిన్. ఆతరువాత విచారణ నెమ్మదిగా సాగడంతో ఆమె తన పని తాను చేసుకుంటూ ఉంది.
36
ఈక్రమంలో రీసెంట్ గా మనీలాండరింగ్ కేసు ప్రధాన నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్ బాంబే హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. కాని అతనిపై నమోదైన ఇతర కేసులను దృష్ట్యా ప్రస్తుతానికి అతన్ని జైలులోనే ఉంచారు. సుకేష్ ను తీహార్ జైల్లో ఉంచారు. ఈ కేసు విషయంలో రెండు మూడేళ్లుగా జాక్వెలిన్ ED కార్యాలయం, కోర్టు చుట్టూ తిరుగుతోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్‌కు సమన్లు పంపినట్లు హిందీ మీడియాలో వార్త హైలెట్ అయ్యింది.
46
Jacqueline Fernandez,
సుకేష్ నుంచి ఈ హీరోయిన్ కు చాలా సార్లు విలువైనర బహుమతులు అందినట్టు ఈడీ గుర్తించింది. అంతే కాదు వీరిద్దరు కలిసి బాగా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఈ కేసులో ఆమె పాత్రపై పలు ఆరోపణలు, సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. అయితే ఇప్పటి వరకూ తనపై వచ్చిన ఆరోపణలను జాక్వెలిన్ ఖండించింది
56
ఈ కేసులో తనను కావాలని ఇరికించారని అంటోంది. అంతే కాదు తనలైఫ్ ను నాశనం చేయాలని చూస్తున్నారంటూ ఆరోపణలు చేస్తోంది జాక్వెలిన్. సుకేశ్ హోంశాఖలో అధికారిగా పరిచయం చేసుకుని.. తనను తప్పుదారి పట్టించాడని తెలిపింది.
66
జైలులో ఉండి కూడా తనతో ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే వాడని, కానీ జైల్లో విషయాన్ని మాత్రం తనకు తెలియనివ్వలేదని వెల్లడించింది. ఈ కేసుతో తనకు ఏమాత్రం సంబంధం లేదని అంటోంది బాలీవుడ్ వ్యూటీ. ఇక ఈ కేసులో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ కూడా ఇరుక్కుని ఉన్నారు...