మరో కొరటాల శివ అయ్యే సత్తా ఉందా ? మహేష్ తో పాటు రామ్ పోతినేనికి కూడా పెద్ద పరీక్షే

Published : Nov 23, 2025, 08:27 PM IST

సందేశాత్మక చిత్రాలని కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అద్భుతంగా తెరకెక్కించడంలో కొరటాల శివకి మంచి పట్టు ఉంది. టాలీవుడ్ లో మరో కొరటాల శివ రాబోతున్నట్లు నిర్మాత రవిశంకర్ అన్నారు. 

PREV
15
రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలూకా'

యంగ్ హీరో రామ్ పోతినేని ఇటీవల కాలంలో సరైన హిట్ లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ పోతినేని నటించిన వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లాంటి చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా అనే వైవిధ్యమైన చిత్రంతో వస్తున్నాడు. ఈ చిత్రం నవంబర్ 27న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. సినీ హీరోలకు అభిమానులు వీరాభిమానులు ఉంటారు. హీరోలని ఆరాధ్య దైవంలా ఆరాధించే కల్చర్ టాలీవుడ్ లో కూడా ఉంది. 

25
మహేష్ బాబుపై కామెంట్స్ 

 ఇలాంటి కథాంశంతోనే దర్శకుడు మహేష్ బాబు పి.. ఆంధ్రా కింగ్ తాలూకా అనే చిత్రం తెరకెక్కించారు. ఇటీవల ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో నిర్వహించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాత రవిశంకర్ ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ దర్శకుడు మహేష్ బాబు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

35
కొరటాల తర్వాత ఇతడే 

ఇటీవల కాలంలో తాను చూసిన బెస్ట్ రైటర్ అండ్ డైరెక్టర్ మహేష్ బాబు అని రవిశంకర్ అన్నారు. ఒక సందేశాత్మక కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి అద్భుతంగా సినిమా తీయడంలో కొరటాల శివ ది బెస్ట్ అని చెప్పొచ్చు. శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ లాంటి సందేశాత్మక కథలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల శివ మ్యాజిక్ చేశారు. అలాంటి లక్షణాలు ఉన్న దర్శకుడు మహేష్ బాబు. ఈ యువ దర్శకుడు మరో కొరటాల శివ కావడం గ్యారెంటీ అని రవిశంకర్ తెలిపారు. 

45
నవంబర్ 27న రిలీజ్ 

మహేష్ బాబుకి రవిశంకర్ ఒక రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారు. నవంబర్ 27 మహేష్ తో పాటు రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే లకు పెద్ద పరీక్షే అని చెప్పాలి. మహేష్ బాబు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రంతో హిట్ కొట్టారు. ఇప్పుడు ఆంధ్రా కింగ్ తాలూకా చిత్రంతో సెకండ్ ఫిలిం జింక్స్ ని అధికమించాలి. 

55
ముగ్గురికీ పెద్ద పరీక్ష 

రామ్ పోతినేని తన వరుస పరాజయాలకు ఈ చిత్రంలో అడ్డుకట్ట వేయాలి. రామ్ పోతినేని నటుడిగా ఎప్పుడో గుర్తింపు పొందారు. కానీ సక్సెస్ మాత్రం ఇటీవల కాలంలో ఎక్కువగా దక్కడం లేదు. మరోవైపు భాగ్యశ్రీ బోర్సే యువతకు క్రష్ గా మారిపోయింది. ఆమె గ్లామర్ లుక్స్ కి యువత ఫిదా అవుతున్నప్పటికీ.. ఆమెకి సరైన సక్సెస్ మాత్రం పడడం లేదు. ఆమె నటించిన తొలి చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్.. ఆ తర్వాత వచ్చిన కింగ్డమ్ పర్వాలేదనిపించింది కానీ పూర్తి స్థాయిలో మెప్పించలేదు. ఇటీవల వచ్చిన కాంత కూడా ఆకట్టుకోలేకపోయింది. సో నవంబర్ 27న మహేష్ బాబు పి, రామ్ పోతినేని, భాగ్య శ్రీ ముగ్గురికీ పెద్ద పరీక్షే అని చెప్పొచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories