తండ్రీకొడుకులు దళపతి విజయ్, జాసన్ సంజయ్ మధ్య గ్యాప్ వచ్చిందా? తండ్రి సాయం లేకుండానే సంజయ్ ఎందుకు కష్టపడుతున్నాడు? నిర్మాత పీ.టీ. సెల్వకుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు, వివాదాల పూర్తి వివరాలు.
తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధినేత విజయ్, నటి త్రిషను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు ఇప్పుడు రాజకీయ, సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారనే వార్తలతో పాటు త్రిష పేరును కూడా ముడిపెట్టడం వివాదాన్ని మరింత పెద్దది చేసింది.
25
త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు
ఇటీవల చెన్నై, ముంబైలో జరిగిన పెళ్లి వేడుకలకు విజయ్, త్రిష ఇద్దరూ కలిసి హాజరైన ఫోటోలు, త్రిష ఇన్‌స్టాగ్రామ్ పోస్టులు వారి బంధంపై రకరకాల ఊహాగానాలకు దారితీశాయి. రాజకీయంగానూ ఈ వ్యవహారం వేడెక్కింది. బీజేపీ నేత నైనార్ నాగేంద్రన్ లాంటి వాళ్లు విజయ్ రాజకీయ అనుభవాన్ని ప్రశ్నిస్తూ త్రిషను ప్రస్తావించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
35
వ్యక్తిగత జీవితంపై విమర్శలు
దీనిపై స్పందించిన త్రిష, ఇలాంటి గౌరవప్రదంగా లేని విమర్శలను ఎప్పటికీ అంగీకరించబోనని తన లాయర్ ద్వారా స్పష్టం చేశారు. తనకు ఏ రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదని, తాను ఎప్పుడూ తటస్థంగానే ఉంటానని పేర్కొన్నారు. టీవీకే అధినేత విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకే, ఆయన వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేస్తున్నారని ఆయన సపోర్టర్స్ ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, విజయ్ తన కొడుకు నాలుగేళ్లుగా కష్టపడుతున్నాడని ఆయన మాజీ మేనేజర్ పీ.టీ. సెల్వకుమార్ అన్నారు. 'డైరెక్టర్ అవ్వాలనే ఆశతో జాసన్ సంజయ్ విదేశాల్లో సినిమా కోర్సు పూర్తి చేశాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో 'సిగ్మా' అనే సినిమాను డైరెక్ట్ చేశాడు. కానీ ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. నాలుగేళ్లు గడిచిపోయాయి' అని సెల్వకుమార్ తెలిపారు.
55
సెల్వకుమార్ తీవ్రంగా
“తన కొడుకును పిలిచి, ఏంటి సమస్య, ఏం సాయం కావాలి అని విజయ్ అడగాల్సింది కదా? కానీ ఆయన అలా చేయలేదు. ఒకవేళ ఆ రోజు ఎస్.ఏ. చంద్రశేఖర్ కూడా 'నా కొడుకు సొంతంగా ఎదుగుతాడులే' అని సైలెంట్‌గా ఉండుంటే, ఈ రోజు విజయ్ ఇంత పెద్ద స్టార్ అయ్యేవాడా? ఓ తండ్రిగా విజయ్ ఫెయిల్ అయ్యారు” అంటూ సెల్వకుమార్ తీవ్రంగా విమర్శించారు.