Rajasekhar: డబ్బింగ్‌ సినిమాతో తమిళంలో రజనీకాంత్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన రాజశేఖర్‌ మూవీ ఏంటో తెలుసా?

Published : Mar 31, 2026, 08:30 PM IST

రాజశేఖర్‌ నటించిన తెలుగు సినిమా తమిళంలో దుమ్ములేపింది. డబ్‌ చేసి రిలీజ్‌ చేస్తే సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రికార్డులను బ్రేక్‌ చేసింది. మరి ఆ సినిమా ఏంటి? ఆ కథేంటో చూద్దాం. 

PREV
16
`బైకర్‌` చిత్రంతో రాబోతున్న రాజశేఖర్‌

రాజశేఖర్‌ సెకండ్‌ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. `బైకర్‌` మూవీతో బౌన్స్ బ్యాక్‌ అయ్యేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. శర్వానంద్‌ హీరోగా నటించిన చిత్రమిది. బైక్ రేసింగ్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఏప్రిల్‌ 3న విడుదల కానుంది. ఇందులో రాజశేఖర్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు.  ఈ సందర్భంగా రాజశేఖర్‌ సినిమా విశేషాలను పంచుకున్నారు. ప్రమోషన్స్ లో యాక్టివ్‌గా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయన పలు ఆసక్తికర విషయాలను షేర్‌ చేసుకున్నారు. తన తెలుగు సినిమాని తమిళంలో డబ్‌ చేసి రజనీకాంత్‌ మూవీ రికార్డులను బ్రేక్‌ చేశారట. ఆ విషయాలను తాజాగా రాజశేఖర్‌ వెల్లడించారు.

26
90లో సూపర్‌ స్టార్‌గా రాణించిన రాజశేఖర్

డాక్టర్‌ గా రాణించే రాజశేఖర్‌.. 1984లో తమిళంలో `పుదుమై పెన్‌` అనే చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత `ప్రతిఘటన` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. `వందేమాతరం`, `తలంబ్రాలు` చిత్రాలతో విజయాలు అందుకున్నాడు. `ఆహుతి` కమర్షియల్‌ బ్రేక్‌ ని ఇచ్చింది. ఆ తర్వాత `అంకుశం`తో స్టార్ అయిపోయారు రాజశేఖర్‌. యాంగ్రి యంగ్‌మేన్‌ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకున్నారు. వరుసగా కమర్షియల్‌ హిట్స్ తో, యాక్షన్‌ చిత్రాలతో సూపర్‌ స్టార్‌గా రాణించారు. చిరంజీవి, బాలయ్య, వెంకటేష్‌, నాగార్జున వంటి వారికి పోటీ ఇచ్చారు.

36
అంకుశంతో తమిళంలో రికార్డులు క్రియేట్‌ చేసిన రాజశేఖర్‌

అయితే తనకు కమర్షియల్‌గా సూపర్‌ స్టార్‌ని చేసిన `అంకుశం` సినిమాకి సంబంధించిన ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు రాజశేఖర్‌. ఈ మూవీకి కోడి రామకృష్ణ దర్శకుడు. శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నిర్మించారు. ఇందులో రాజశేఖర్, జీవిత జంటగా నటించారు. ఇది తెలుగులో బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఆ ఏడాది ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అయితే ఈ మూవీ తమిళంలోనూ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్‌ చేయడం విశేషం. అదెలా అంటే. ఈ సినిమా తెలుగులో షూటింగ్‌ చేస్తున్నప్పుడే కంటెంట్‌ బాగా వస్తున్న నేపథ్యంలో రాజశేఖర్‌ తమిళ డబ్బింగ్‌ రైట్స్ తీసుకున్నారట.

46
`అంకుశం` తమిళ డబ్బింగ్‌ రైట్స్ తీసుకున్న రాజశేఖర్‌

తమిళంలో రాజశేఖర్‌ కి మంచి ఇమేజ్‌ ఉంది. దీంతో దీన్ని తమిళంలో రిలీజ్‌ చేస్తే వర్కౌట్‌ అవుతుందని భావించి ముందుగానే నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి నుంచి తమిళ డబ్బింగ్‌ రైట్స్ తీసుకున్నారు. రెండు కోట్లకు కొనుగోలు చేశారట. తెలుగులో రిలీజ్‌ అయి సూపర్‌ హిట్‌ అయ్యింది. దీంతో తమిళం నుంచి నిర్మాతలు క్యూ కట్టారట. దాదాపు మూడు లక్షలు, తర్వాత ఐదు లక్షలు, పది లక్షలు, ఇలా 25 లక్షల వరకు ఆఫర్‌ చేశారట. అయినా వారికి రైట్స్ ఇవ్వలేదు రాజశేఖర్‌. తనే తమిళంలో రిలీజ్‌ చేశాడు.

56
రజనీకాంత్‌ రికార్డులు బ్రేక్‌ చేసిన `అంకుశం`

దీంతో తమిళంలోనూ ఈ సినిమా సంచలన విజయం సాధించింది. అప్పట్లో ఇది కలెక్షన్ల పరంగా దుమ్మురేపింది. రజనీకాంత్‌ పేరుతో ఉన్న రికార్డులను బ్రేక్‌ చేసిందట. ఈ విషయాన్ని రాజశేకర్‌ వెల్లడించారు. `బైకర్‌` చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని వెల్లడించారు రాజశేఖర్‌. అయితే ఈ చిత్రాన్ని కన్నడలో రీమేక్‌ చేయగా, అక్కడ విజయం సాధించింది. హిందీలో ఏకంగా చిరంజీవి నటించారు. అక్కడ `ప్రతిబంద్‌` పేరుతో రీమేక్‌ చేయగా, అక్కడ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. చిరంజీవికి మంచి బాలీవుడ్‌ ఎంట్రీని అందించింది.

66
బైకర్‌ సినిమా ఎలా ఉందబోతుందంటే?

ఇక `బైకర్‌` సినిమా గురించి రాజశేఖర్‌ మాట్లాడుతూ, `నేను బాగా ఇష్టపడి చేసిన సినిమా బైకర్. ఎప్పుడు ఏప్రిల్ 3 వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఆడియన్స్ ఎంతలా మెచ్చుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నేను ఏ క్యారెక్టర్ చేసిన అది బాగుండాలి, నాకు నచ్చాలి. అప్పుడే నేను చేయగలుగుతాను. అలాగే క్యారెక్టర్ బాగుంటే సరిపోదు. సినిమా కూడా అద్భుతంగా ఆడాలి. కథ బాగుండాలి. నేను కథ విన్నప్పుడు నా క్యారెక్టర్, కథ రెండు నచ్చే ఈ సినిమా చేశాను. బుల్లెట్‌ సునీల్‌గా కనిపిస్తాను. కథ పరంగా సూపర్ గా హిట్ అవుతుంది. నాకు పర్సనల్‌గా బైక్స్ అంటే ఇష్టం. మా అమ్మమ్మగారింట్లో ఒక బుల్లెట్ బండి ఉండేది. నేను సెలవుల్లో అక్కడికి వెళ్ళిన ప్రతిసారి ఆ ఊరు మొత్తం బుల్లెట్లో తిరిగేవాడిని. ఆ తర్వాత బైక్స్ మీద ఆసక్తి పెరుగుతూ వచ్చింది. శేషు సినిమా సమయంలో స్వయంగా నేనే యమహా సిక్స్ ఫిఫ్టీ సిసి బండి కొనుక్కొని ఆ షూటింగ్ లో వాడాను. నేను నడిపే విధానం చూసి 'మీరు చాలా రిస్క్ తో నడుపుతున్నారని నాకు తెలియకుండానే జీవిత ఆ బైక్ అమ్మేశారు (నవ్వుతూ)` అని తెలిపారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories