ప్రముఖ నిర్మాత నాగవంశీ 2026లో విజయాలు అందుకునేందుకు పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. సంక్రాంతికి విడుదలయ్యే అనగనగా ఒకరాజు సినిమాతో నాగవంశీ నిర్మించే సినిమాల సందడి మొదలు కానుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ప్రముఖ నిర్మాతల్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ ఒకరు. నాగవంశీ నిర్మాతగా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నారు. అయితే ఈ ఏడాది నాగవంశీ స్పీడుకు కొన్ని బ్రేకులు పడ్డాయి. నిర్మాతగానే కాక డిస్ట్రిబ్యూటర్ గా కూడా నాగవంశీ దెబ్బతిన్నారు. 2026లో నాగవంశీ నుంచి ఏకంగా 10 చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటిలో ముందుగా సంక్రాంతికి అనగనగా ఒక రాజు చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది.
25
వార్ 2 తో నష్టాలు
అయితే ఈ ఏడాది నాగవంశీ నిర్మించిన కింగ్డమ్, మాస్ జాతర లాంటి సినిమాలు నిరాశపరిచాయి. డిస్ట్రిబ్యూటర్ గా కొన్న వార్ 2 చిత్రం దారుణంగా నష్టాలు మిగిల్చింది. డాకు మహారాజ్ చిత్రం హిట్ అయినప్పటికీ ఓవర్ బడ్జెట్ అయింది అనే కామెంట్స్ వినిపించాయి. అలాంటి తప్పులు వచ్చే ఏడాది జరగకుండా జాగ్రత్త పడుతున్నట్లు నాగవంశీ తెలిపారు.
35
తరచుగా దుబాయ్ కి ఎందుకంటే
ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ తన వ్యక్తిగత విషయాలు కూడా బయటపెట్టారు. నాగవంశీ తరచుగా దుబాయ్ వెళుతుంటారు అనే రూమర్స్ ఇండస్ట్రీలో ఉన్నాయి. తాను దుబాయ్ వెళ్లడం నిజమే అని నాగవంశీ తెలిపారు. దుబాయ్ కి ఎందుకు వెళతానో అని చాలా మంది ఏదేదో ఊహించుకునేస్తుంటారు. కానీ నేను దుబాయ్ వెళ్ళేది షాపింగ్ కోసమే. నాకు మందు, సిగరెట్ అలవాటు లేదు. నేను ఒత్తిడి తగ్గించుకునేందుకు చేసే ఒకే ఒక్క పని షాపింగ్.
అందుకే దుబాయ్ వెళుతుంటాను అని నాగవంశీ అన్నారు. ఫిజిక్ మైంటైన్ చేయడం కోసం ఇటీవల పిక్ బాల్ ఆడుతున్నట్లు తెలిపారు. హీరోయిన్లతో, హీరోలతో చర్చలకు కూర్చున్నపుడు నేను కూడా బాగా కనిపించాలి కదా అందుకే ఫిజిక్ మైంటైన్ చేస్తున్నట్లు నాగవంశీ తెలిపారు.
55
ఆ హీరోయిన్ అంటే క్రష్
హీరోయిన్లతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న రూమర్స్ ని నాగవంశీ ఖండించారు. ఏ హీరోయిన్ అంటే క్రష్ ఉంది అని ప్రశ్నించగా.. తనకు పూజా హెగ్డే అంటే ఇష్టం అని తెలిపారు. అయితే తనకు మృణాల్ ఠాకూర్ అంటే క్రష్ ఉందని నాగవంశీ అన్నారు.