ప్రముఖ నిర్మాత నాగవంశీ వరుస చిత్రాలు నిర్మిస్తూ టాలీవుడ్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా ఎదుగుతున్నారు. ఆయన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తరచుగా ఏదో ఒక చిత్రం రిలీజ్ అవుతూనే ఉంది. త్వరలో జూలై 31న ఈ బ్యానర్ నుంచి విజయ్ దేవరకొండ కింగ్డమ్ చిత్రం భారీ అంచనాలతో రిలీజ్ కి రెడీ అవుతోంది.
25
కింగ్డమ్ మూవీపై కామెంట్స్
ఇటీవల చిత్ర యూనిట్ తిరుపతిలో కింగ్డమ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నాగవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని చిత్రాలుగా విజయ్ దేవరకొండ నుంచి అసలైన రౌడీ బాయ్ ని ఫ్యాన్స్ మిస్ అవుతున్నారు. ఆ తప్పు ఈ చిత్రంలో జరగకుండా నేను, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఎక్కువగా జాగ్రత్త పడ్డాం అని నాగవంశీ తెలిపారు.
35
ఇండస్ట్రీ పరిస్థితి బాగలేదు
ఇటీవల ఇండస్ట్రీ పరిస్థితి ఏమీ బాగాలేదు. మీరంతా థియేటర్స్ కి వచ్చి సినిమాని ఆదరిస్తేనే మంచి క్వాలిటీ సినిమాలు అందించడానికి వీలు అవుతుంది అని నాగవంశీ ప్రేక్షకులని కోరారు. హైదరాబాద్ తర్వాత తనకి సెకండ్ కింగ్డమ్ తిరుపతే అని అన్నారు.
యాంకర్ సుమ నాగవంశీని ప్రశ్నిస్తూ.. మీరే కనుక హీరో అయితే హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారు అని అడిగారు. దీనికి నాగవంశీ ఇచ్చిన సమాధానం తెగ వైరల్ అవుతోంది. నేను హీరో అయితే ఎవరూ సినిమా చూడరు. కానీ ఈ చిత్రంలో హీరోయిన్ ని ఎంపిక చేసింది నేనే. భాగ్యశ్రీ నాకు నచ్చింది. అందుకే హీరోని కానీ, దర్శకుడిని కానీ అడగకుండా ఆమెని నేనే హీరోయిన్ గా తీసుకున్నాను అంటూ క్రేజీ కామెంట్స్ చేశారు.
55
స్పై యాక్షన్ డ్రామాగా కింగ్డమ్
కింగ్డమ్ చిత్రం స్పై యాక్షన్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కింది. ట్రైలర్ కి ఆల్రెడీ మంచి రెస్పాన్స్ దక్కింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సోదరుడి పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు.