నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రం విషయంలో జరిగిన ఒక సంఘటనని ఎమ్మెస్ రాజు ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ చిత్రానికి హీరోగా సిద్దార్థ్, త్రిషని సెలెక్ట్ చేసింది నేనే. సిద్దార్థ్ హీరో అని చెప్పగానే చాలా మంది వద్దు అన్నారు. పరుచూరి బ్రదర్స్ అయితే.. ఏందయ్యా అమ్మాయిలా ఉన్నాడు, ఆ జుట్టేంటి.. వీడిని హీరోగా తెచ్చావు ఏంటి అని అన్నారు.