‘ఫ్యామిలీ స్టార్’ నష్టాలు ...బయ్యర్లకు సెటిల్మెంట్, విజయ దేవరకొండ సైతం....?

First Published Apr 21, 2024, 11:11 AM IST

 ఈ నష్టాలు కాంపన్సేట్ చేయాల్సిన విషయం చెప్పి..వారి రెమ్యునేషన్ లో కొంత వెనక్కి ఇవ్వమని అడిగినట్లు చెప్పుకుంటున్నారు. అందుకు వారు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. 

the family star


సినిమా ఫెయిలైతే ఇంతకు ముందు రోజుల్లాగా కొద్దో గొప్పో ఉండటం లేదు..భారీ మొత్తం నష్టాలు వస్తున్నాయి. దాంతో ఖచ్చితంగా నిర్మాత ఆ నష్టాలను  కాంపన్సేట్ చేయాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అవుతోంది. లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ నుంచి,బయ్యర్లు నుంచి ఒత్తిడి ఎదురౌతోంది. ఇప్పుడు ఆ సిట్యువేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ‘ది ఫ్యామిలీ స్టార్'(The Family Star) చిత్రానికి ఎదురైందని తెలుస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ పూర్తి అయిన నాటి నుంచి కలెక్షన్స్ పూర్తి స్దాయిలో డ్రాప్ అవుతూ వచ్చాయి. వీక్ లో పికప్ కాలేదు.  సమ్మర్, ఉగాది, ఈద్ ,  శ్రీరామ నవమి ఇలా ఏదీ కూడా పెద్దగా కలిసి రాలేదు.


ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్స్ భారీ రేట్లు పెట్టి కొనుక్కున్నారు. అదే నిష్పత్తిలో నష్టపోవటం జరిగింది.  ఈ క్రమంలో రీసెంట్ గా డిస్ట్రిబ్యూటర్స్ ..నిర్మాత దిల్ రాజుని కలిసి తమకు కాంపన్సేట్ చేయమని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దాంతో ఆ నష్టాలు తాను క్లియర్ చేస్తానని నిర్మాత దిల్ రాజు వారికి మాట ఇచ్చారని ట్రేడ్ సర్కిల్స్ లో తెలుస్తోంది. అయితే భారీ మొత్తాలు ఇవ్వాల్సి రావటంతో నిర్మతగా దిల్ రాజు మరో స్టెప్ తీసుకున్నాడంటున్నారు.
 

Family Star


అదేమిటంటే...దర్శకుడు పరశరామ్ ని, హీరో విజయ్ దేవరకొండను కలిసి ఈ నష్టాలు కాంపన్సేట్ చేయాల్సిన విషయం చెప్పి..వారి రెమ్యునేషన్ లో కొంత వెనక్కి ఇవ్వమని అడిగినట్లు చెప్పుకుంటున్నారు. అందుకు వారు కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది. వారు ఇచ్చే ఎమౌంట్ కు మిగతా ఎమౌంట్ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కలిపి ఇవ్వాలని ఆలోచన. విజయ్ దేవరకొండ ఇప్పటికే తన షేర్ ఎమౌంట్ ఇచ్చారని, పరుశరామ్ షేర్ విషయమే క్లారిటీ రావాల్సి ఉందంటున్నారు.

Family Star Review


నిర్మాత దిల్ రాజు (Dil Raju)ప్రమోషన్స్ తో  మొదటి నుండి సినిమా పై మంచి బజ్ ఏర్పడింది. కానీ ఏప్రిల్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. సో సో ఓపెనింగ్స్ మాత్రమే నమోదయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం బడ్జెట్ ఎంత, ఎంత కలెక్ట్ చేసింది. ఎంత నష్టం వచ్చిందనేది హాట్ టాపిక్ గా మారింది. ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాకు రూ.41.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.41.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.16.98 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా రూ 24.52 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ అది జరగలేదు.
 

Family Star Review


ట్రేడ్ టాక్ ప్రకారం అన్ని  లెక్కలు వేసుకుంటే పది కోట్లకు పైగా నష్టం వచ్చిందని చెప్పుకుంటున్నారు. నిర్మాత  దిల్ రాజు సైతం ప్రమోషన్స్ ని ఆపేసారు.  దాంతో  శ్రీరామనవమితో పాటు  లాంగ్ వీకెండ్ వచ్చిన్నా ఎగ్జిబిటర్లు ఈ సినిమాపై హోప్ పెట్టుకోలేదు. ఈ సినిమాకన్నా ముందు రిలీజైన టిల్లు స్క్వేర్ వసూళ్లు మెరుగ్గా ఉండటం ఇక్కడ గమనించదగ్గ విషయం.  


 విజయ్ దేవరకొండ కు ఈ మధ్యకాలంలో సరైన హిట్ పడలేదు. ఖుషీ తో ఒడ్డునపడతాడుకుంటే అదీ మొహం చాటేసింది. ఆ తర్వాత రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీస్టార్ పై నమ్మకం పెట్టుకుంటే అదీ చీదేసింది. లైగర్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈ నేఫధ్యంలో విజయ్ దేవరకొండకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ లు చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ కలెక్షన్స్ ని,లైగర్ కలెక్షన్స్ ని పోల్చి చూపుతూ వేకప్ కాల్ వచ్చినట్లే జాగ్రత్త పడాల్సిన టైమ్ వచ్చిందంటున్నారు.
   

Family Star Review


 
ఈ నేపధ్యంలో గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాగైనా హిట్ కొట్టాల్సిన సిట్యువేషన్ లో విజయ్ ఒకటికి నాలుగు సార్లు స్క్రిప్టు చెక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. జూన్ నుంచి గౌతమ్ తిన్ననూరి సినిమాను స్టార్ట్ చేస్తాడు విజయ్.

Family Star Review


 పీరియాడిక్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు విజయ్. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను శ్రీలంకలో ప్లాన్ చేశారు. దాదాపు 40శాతం షూటింగ్ ను అక్కడే పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. లైగర్ తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఆ తర్వాత ఖుషీ సినిమాతో కొంత తేరుకున్నప్పటికీ, అతడు ఆశించిన విజయాన్ని మాత్రం ఖుషీ అందించలేకపోయింది. అందుకే ఫ్యామిలీ స్టార్, గౌతమ్ తిన్ననూరి సినిమాలపై ఆశలు పెట్టుకున్నాడు విజయ్. ఫ్యామిలీస్టార్ కూడా దెబ్బ కొట్టడంతో గౌతమ్ మీదే పూర్తి డిపెండ్ అయ్యారు. 
 
 

click me!