చిరంజీవికి దారుణమైన ఫ్లాప్.. డైరెక్టర్ తప్పు లేదు అంటూ నిర్మాత కామెంట్స్, ఏం జరిగిందంటే..

First Published | Aug 16, 2024, 4:12 PM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు.భారీ బడ్జెట్ లో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవితో అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాతల్లో కెఎస్ రామారావు ఒకరు.

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్నారు.భారీ బడ్జెట్ లో ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. చిరంజీవితో అత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాతల్లో కెఎస్ రామారావు ఒకరు. చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కేఎస్ రామారావు అభిలాష, ఛాలెంజ్, రాక్షసుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. 

చాలా ఏళ్లుగా వీరి కాంబినేషన్ లో సినిమా పడలేదు. అయితే ఒక చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా ఉండేందుకు కెఎస్ రామారావు ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. అది చిరంజీవి కెరీర్ లో దారుణమైన ఫ్లాపుల్లో ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ చిత్రం గత ఏడాది విడుదలై నిరాశ పరిచింది. 


ఈ చిత్రంపై ట్రోలింగ్ కూడా జరిగింది. తమిళంలో హిట్ అయిన వేదాళంకి రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాగా ప్రెజెంట్ చేయగలిగితే తమిళంలో కంటే తెలుగు పెద్ద హిట్ అవుతుందని మెహర్ రమేష్ నమ్మారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ అనిల్ సుంకరకి కూడా మెహర్ ఐడియా నచ్చింది అని కెఎస్ రామారావు అన్నారు. అనిల్ సుంకర నాకు స్నేహితుడు. 

చిరంజీవి గారు నన్ను పిలిచి అనిల్ సుంకర నీ స్నేహితుడే కదా.. ఇద్దరూ కలసి ఈ చిత్రం నిర్మించండి అని చెప్పారు. చిరంజీవితో సినిమా కాబట్టి నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యా. భోళా శంకర్ చిత్రంతో కొన్ని రోజులు ట్రావెల్ అయ్యా. ఈ క్రమంలో చాలా మార్పులు జరిగాయి. ప్రేక్షకుల అభిరుచి కూడా మారిపోయింది. 

షూటింగ్ ముగిసే సమయానికి నేను కూడా ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. అయితే ఈ మూవీ డిజాస్టర్ కావడం వెనుక డైరెక్టర్ మెహర్ రమేష్ ని తప్పు పట్టలేం. ఎందుకంటే ఆ కథలో ఇప్పటి ఆడియన్స్ ని మెప్పించేంత దమ్ము లేదు. మెహర్ రమేష్ ఏమేం చేయాలో అందంతా ట్రై చేశాడు. 

ఆ కథలో ఉన్న దమ్ము అంతవరకే పరిమితం.. అందుకే ఆ చిత్రం ఆడలేదు అని కెఎస్ రామారావు అన్నారు. తప్పకుండా చిరంజీవితో భవిష్యత్తులో సినిమా చేస్తాను అని కెఎస్ రామారావు అన్నారు. ఎందుకంటే చిరంజీవి నా మెగాస్టార్ అని అన్నారు. 

Latest Videos

click me!