జాతీయ అవార్డుల్లో తెలుగుకి బిగ్‌ హ్యాండ్‌.. ఇంతటి అన్యాయానికి అసలు కారణం ఇదే?

First Published | Aug 16, 2024, 4:00 PM IST

70వ జాతీయ అవార్డుల ప్రకటన వచ్చింది. తెలుగులో కేవలం `కార్తికేయ 2`కి మాత్రమే అవార్డు దక్కింది. మరి ఈ సారి మొండిచేయి చూపించడానికి కారణమేంటనేది చూస్తే పెద్ద స్ట్రాటజీనే ఉంది.

జాతీయ అవార్డుల పండగ వచ్చింది. 2022 ఏడాదికి గానూ ఈ నేషనల్‌ అవార్డులను కేంద్ర సమాచార ప్రసారాల శాఖ ఎంపిక చేసిన జ్యూరీ ఈ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగుకి కేవలం ఒకే ఒక అవార్డు ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది. నిఖిల్‌ హీరోగా నటించిన చందూమొండేటి రూపొందించిన `కార్తికేయ 2` సినిమాకి ఉత్తమ ప్రాంతీయ సినిమాగా జాతీయ అవార్డుని ఇచ్చారు. అలాగే తమిళ సినిమాకిగానూ జానీ మాస్టర్‌కి కొరియోగ్రఫీ విభాగంలో షేరింగ్‌ విభాగంలో జాతీయ అవార్డు వచ్చింది. ఇది తప్పితే తెలుగుకి అవార్డులు రాలేదు.  
 

గతేడాది ఏకంగా పది జాతీయ అవార్డులను ఇచ్చింది కేంద్రం. `ఆర్‌ఆర్‌ఆర్‌`, `పుష్ప` సినిమాలే అవార్డులను కొల్లగొట్టాయి. పాట విభాగంలో `కొండపొలం` సినిమా(చంద్రబోస్‌)కి జాతీయ అవార్డు దక్కింది. జాతీయ అవార్డుల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా పది అవార్డులు రావడం అందరిని ఆశ్చర్యపరిచాయి. కానీ ఇప్పుడు కేవలం ఒకే అవార్డుని ఇచ్చింది కేంద్రం. హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల చిత్రాలకు అవార్డులు వచ్చాయి. ఒక్కో భాషలో మూడు, నాలుగు అవార్డులను కేటాయించారు.
 

Latest Videos


మరి తెలుగుకి ఈ సారి మొండిచేయి చూపించడానికి, ఆయా భాషలకు ఎక్కువ అవార్డులను ఇవ్వడానికి కారణమేంటనేది చూస్తే.. దానికి పెద్ద రీజనే ఉంది. పెద్ద స్ట్రాటజీనే ఉంది. అదేంటనేది తీస్తే కారణం ఎన్నికలు. గతేడాది మనకు అవార్డులు ఇవ్వడానికి తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపీ ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు ఇక్కడి ప్రజల మద్దతు పొందేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా ఆ ప్లాన్‌ చేసిందని అర్థమవుతుంది. అందుకే మనకు ఎక్కువ అవార్డులు ఇచ్చారు. 
 

వాళ్ల ప్లాన్‌ వర్కౌట్‌ అయ్యింది. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలతో కేంద్రానికి పని అయిపోయింది. కొత్త పనేం లేదు. ఈ క్రమంలో కొత్త రాష్ట్రాల్లో పాగా వేసేందుకు ప్లాన్‌ చేస్తుంది. ఈ ఏడాదిలోనే మహారాష్ట్రలో ఎన్నికలున్నాయి. అందుకే అక్కడ ఎక్కువ అవార్డులు ఇచ్చినట్టు తెలుస్తుంది. అలాగే మరో ఏడాది, రెండేళ్లలో తమిళనాడు, కేరళాలో ఎన్నికలున్నాయి. దీంతో ఆయా భాషల చిత్రాలకు కూడా బాగానే అవార్డులు దక్కాయని చెప్పొచ్చు. నెమ్మదిగా అక్కడ తమ ప్రభావం పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఇదంతా చేసినట్టు తెలుస్తుంది. 

అయితే గతేడాది ఏకంగా పది జాతీయ అవార్డులు రాగా, ఈ సారి మాత్రం కేవలం ఒకే అవార్డుకి పరిమితం చేయడం ఆశ్చర్యంగా మారింది. ఇది సినీ వర్గాలను షాక్‌కి గురి చేస్తుంది. ఇప్పుడు తెలుగు మూవీ `కార్తికేయ 2` కూడా కృష్ణుడు గురించిన కథ కావడం, హిందుత్వం యాంగిల్‌లోనే ఈ అవార్డు దక్కిందని క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. `కాంతార`, `పొన్నియిన్‌ సెల్వన్‌ 1`, `బ్రహ్మాస్త్ర` చిత్రాలకు అవార్డులు రావడం వెనుక కారణం అదే అని టాక్‌.  ఇలా కారణాలేమైనా తెలుగుకి అన్యాయం జరిగింది.  మరి ఈ అన్యాయంపై మన టాలీవుడ్‌ మేకర్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. 
 

click me!