ప్రొడ్యూసర్ ని నెల నెలా ఖర్చులకు ఇస్తే చాలు అన్న పవన్ కళ్యాణ్

కాకపోతే సినిమా అయ్యేవరకు నెలనెల ఖర్చులకు కొంత అమౌంట్ మాత్రం ఇవ్వండి అని అడిగాడు పవన్, ఓకే చెప్పాను. 

పవన్ కల్యాణ్ కెరీర్ ప్రారంభం నుంచి నిర్మాతల హీరో అనే పేరు తెచ్చుకున్నారు. తనదైన ఇన్ ఫుట్స్ సినిమాలకు ఇచ్చి సూపర్ హిట్స్ ఇవ్వటానికి ఎలా సహకరించేవాడే అదే విధంగా నిర్మాత బాగుండాలి, అతను ఉంటేనే ఇండస్ట్రీ బ్రతికి ఉంటుందని నమ్మిన హీరో పవన్.

అయితే ఏ హీరో అయినా కెరీర్ ప్రారంభంలో డబ్బులు సంపాదించేయాలి. త్వరగా సెటిల్ అయ్యిపోవాలి అనుకుంటారు. కానీ పవన్ అలా ఆలోచించేవారు కాదు అంటారు ఆయనతో పనిచేసిన నిర్మాతలు. అలాంటివారిలో ఒకరు జీవిజి రాజు. ఆయన నిర్మించిన సూపర్ హిట్ తొలి ప్రేమ.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , కీర్తి రెడ్డి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం తొలి ప్రేమ. తమిళ దర్శకుడు కరుణాకరన్ తెరకెక్కించిన ఈ సినిమా 1998 లో విడుదల అయి మార్నింగ్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది..ఈ క్లాసిక్ లవ్ స్టోరీ  అప్పట్లో ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా కనపడితే అలా కనెక్ట్ అయ్యిపోతారు అభిమానులు.
 

Pawan Kalyan

 
ఈ సినిమా విడుదలై దాదాపు 25 సంవత్సరాలు పూర్తి అయినా ఇప్పటికి ఈ సినిమా విశేషాలు అభిమానులు చెప్పుకుంటూంటారు.ఈ సినిమాని రీసెంట్ గా  రీ రిలీజ్ చేసారు నిర్మాతలు . రీరిలీజ్ లో కూడా ఓ రేంజిలో రెస్పాన్స్ వచ్చింది.

ఈ సినిమా SSC ఆర్ట్స్ బ్యానర్ పై GVG రాజు నిర్మించారు. తొలిప్రేమ రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో GVG రాజు ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ గురించి మాట్లాడారు. 

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau



పవన కళ్యాణ్ ప్రస్తుతం సినిమాకి 50 కోట్లు పైగా  తీసుకుంటున్న సంగతి అందరికి తెలిసిందే. ఆయనే స్వయంగా గతంలో తెలిపారు. అయితే తొలిప్రేమ సమయంలో ఎంత తీసుకున్నారు అనే దానిగురించి GVG రాజు మాట్లాడారు.  ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకున్న పారితోషకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు దాదాపు 50 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం.తొలిప్రేమ సినిమా కోసం పవన్ కళ్యాణ్ లక్షలలోనే తీసుకున్నారని నిర్మాత జి.వి.జి రాజు చెప్పుకొచ్చారు.అయితే మేము ఆయనకీ ఎన్ని లక్షలు ఇచ్చాము అనే విషయాన్ని తాను చెప్పనని ఆయన తెలిపారు. 
 

pawan Kalyan, chiranjeevi, gabbar singh, nagabau

GVG రాజు మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమా ఓకే అయ్యాక రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతూ నేను ఇంత ఇవ్వగలను, మీకు ఎలా కావలి? మొత్తం ఒకేసారి, లేదా కొంచెం కొంచెం ఇవ్వాలా అని అడిగాను పవన్ గారిని, ఆయన మీ ఇష్టం అన్నారు. అయితే ముందు అడ్వాన్స్ గా కొంచెం ఇస్తాను. మిగిలినదంతా ఒకేసారి సినిమా రిలిజ్ తర్వాత ఇస్తాను అని చెప్తే ఏమి మాట్లాడకుండా ఓకే అన్నారు.

కాకపోతే సినిమా అయ్యేవరకు నెలనెల ఖర్చులకు కొంత అమౌంట్ మాత్రం ఇవ్వండి అని అడిగాడు, ఓకే చెప్పాను. చెప్పినట్టే సినిమా రిలీజయినా రెండు రోజులకి మొత్తం రెమ్యునరేషన్ తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో పెట్టాను అని తెలిపారు.
 

Latest Videos

click me!