వీడు పెద్ద సాంబార్‌ గాడు, ఏఎన్నార్‌ చేసిన పనికి అసహ్యించుకున్న హోటల్‌ వాడు, అయినా తగ్గని అక్కినేని

First Published | Sep 20, 2024, 12:52 PM IST

ఏఎన్నార్‌ మద్రాస్‌ ప్రారంభ అనుభవాలు వైరల్‌ అవుతున్నాయి. తినడానికి డబ్బుల్లేని పరిస్థితుల్లో ఆయన హోటల్‌ వాడిచేత తిట్టించుకున్న ఘటన బయటపెట్టారు. 
 

ఏఎన్నార్‌ సినిమాల్లో అలుపెరగని బాటసారిలా సాగిపోయారు. సుమారు ఏడు దశాబ్దాల పాటు సినిమా రంగంలో ఉన్నారు. నటుడిగా అలరించారు. 1941లో వచ్చిన `ధర్మపత్ని` సినిమా నుంచి  2014లో వచ్చిన `మనం` వరకు నటిస్తూనే ఉన్నారు. ఎన్నో రకాల పాత్రలు చేసి మెప్పించారు. పౌరాణికాలు, జనపదాలు, సాంఘీకాలు ఇలా అన్ని రకాల సినిమాలు చేశారు. దాదాపు 256 సినిమాలు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకి రెండు కళ్లలో ఒకరిగా నిలిచారు. మరో కన్ను ఏన్టీఆర్‌ని పిలుస్తారనే విషయం తెలిసిందే. 
బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఏఎన్నార్‌ నాటకాల నుంచి సినిమాల్లోకి వచ్చారు. ఆయన నాటకాలు బాగా ఆడేవాడు. ఓ సారి విజయవాడ రైల్వే స్టేషన్‌లో అక్కినేనిని దర్శక, నిర్మాత ఘంటసాల బలరామయ్య చూసి, బాగా యాక్ట్ చేస్తున్నాడు, సినిమాల్లో పనికొస్తాడని చెప్పి ఏఎన్నార్‌ని మద్రాస్‌కి తీసుకెళ్లాడు. సినిమాలకు పరిచయం చేశాడు. మొదటగా పి పుల్లయ్య దర్శకత్వం వహించిన `ధర్మపత్ని` చిత్రంలో బాలనటుడిగా తీసుకున్నారు.

సినిమా ఆఫర్ల కోసం వేచి చూస్తున్న సమయంలో ఘంటసాల బలరామయ్య తీసిన `సీతారామ జననం` చిత్రంలో మెయిన్‌ హీరోగా పరిచయం చేశాడు. ఇక అప్పట్నుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సి అవసరం రాలేదు. అప్పట్లో ఏఎన్టీఆర్‌, ఎస్వీఆర్‌ వంటి మెయిన్‌ స్ట్రీమ్‌ నటులు రాలేదు. దీంతో ప్రారంభంలో అక్కినేని మంచి నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 

Latest Videos


ఇదిలా ఉంటే సినిమాలకు వచ్చిన ప్రారంభంలో మద్రాస్‌లో తన అనుభవాలను పంచుకున్నారు ఏఎన్నార్‌. బాలరామయ్య పుణ్యామా అంటూ తనని బెజవాడ రైల్వే స్టేషన్‌ నుంచి మద్రాస్‌ తీసుకెళ్లాడని, అప్పుడు మొదట్లో 250 రూపాయల జీతం ఇచ్చేవారట. నెలకు ఆ మొత్తం ఇచ్చే వారని తెలిపారు ఏఎన్నార్‌. ఓ రూమ్‌ ఇచ్చి, భోజనం పెట్టి ఆ అమౌంట్‌ ఇచ్చేవారట.

దానితోనే దాచుకోవడం, మెయింటనెన్స్, ఏవైనా తినడానికి కొనుక్కోవాలంటే అందులో నుంచే ఖర్చు చేసేవాళ్లమని తెలిపాడు ఏఎన్నార్‌. అయితే అప్పుడు తినడానికి అవకాశం ఉండేది కాదు, అంత డబ్బు ఉండేది కాదని తెలిపారు. నెలకు యాభై రూపాయలు తినడానికి పెట్టుకునేవాడట. కాఫీ తాగడం, మురుకుల కొనుక్కోవడం, ఎప్పుడైనా టిఫిన్‌ తినడానికి వాటిని ఉపయోగించేవాడట. 

అయితే మద్రాస్‌లోని పాండీ బజార్‌లో ఓ హోటల్‌లో టిఫిన్‌ బాగుండేదట. సాంబార్‌ చాలా టేస్టీగా ఉండేదట. ఇడ్లీతోపాటు సాంబార్‌ పోల్తారు. అదిరి అదిరిపోయేది. ఇడ్లీ తిన్నాక సరిపోకపోవడంతో రెండో ప్లేట్‌ కొనాలంటే డబ్బులు ఉండేవి కావని, దీంతో కేవలం పంపుసాంబార్‌ పోసుకుని తాగేడవాడట. అలా రెండు మూడు రోజులు అదే చేశాడట.

ఇది గమనించిన హోటల్‌ వాడు, వీడు పెద్ద సాంబార్‌ బ్యాచ్‌ అని చెప్పి తిట్టేవాడట. అయినా అవేవీ పట్టించుకోకుండా ఆ సాంబార్‌ని నిర్మొహమాటంగా లాగించేవాడట ఏఎన్నార్‌. అదొక గొప్ప అనుభూతి అని తెలిపారు ఏఎన్నార్‌. ఈటీవీ సుఖీభవ కార్యక్రమంలో ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. తన హెల్త్ సీక్రెట్స్ చెబుతూ ఈ విషయం చెప్పారు. 

మొదటి 25ఏళ్లు తినడానికి డబ్బులు లేవని, పేద కుటుంబం కావడంతో డబ్బులు ఉండేవా కావని, 25 ఏళ్ల తర్వాత నటుడిగా పేరు, గుర్తుంపు వచ్చింది. నెమ్మదిగా స్టార్‌డమ్‌ కూడా వచ్చింది. దీంతో డబ్బులు బాగానే వచ్చాయి. అయితే అప్పుడు తినాలనిపించేది. కానీ హీరోగా ఫిట్‌ గా ఉండాలంటే ఫుడ్‌ ఎక్కువగా తినకూడదు, మితంగా తీసుకోవాలి.

అందుకే అప్పుడు కడుపు కట్టుకోవాల్సి వచ్చేది. ఏది తిన్నా కొద్ది కొద్దిగానే తినాల్సి వచ్చేదని తెలిపారు ఏఎన్నార్‌. ఇక యాభై ఏళ్లు నిండాయి ఇప్పుడైనా తిందామనుకుంటే ఆపరేషన్‌ అయ్యింది. డాక్టర్లు ఎక్కువగా తినకూడదు అన్నారు. అలా జీవితాంతం మితంగానే తినాల్సి వచ్చిందన్నారు ఏఎన్నార్‌. అందరికి మంచి ఫుడ్‌ తినడం సంతోషం, గొప్పతనం అంటుంటారు.

తాను తినకపోవడం గొప్పతనం అని, అలా తినకపోవడం వల్లే 83ఏళ్లు దాటినా ఇప్పటికీ కర్రలేకుండా నడవగలుతున్నాను అని తెలిపారు ఏఎన్నార్‌. నేడు ఎన్టీఆర్‌ శత జయంతి. ఈ సందర్భంగా ఈ రేర్ ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఏఎన్నార్‌ కొన్నాళ్లపాటు క్యాన్సర్‌తో పోరాడి 2014 జనవరి 22న కన్నుమూసిన విషయం తెలిసిందే. 
 

click me!