కంటెస్టెంట్స్ కి ఊహించని షాక్, డోర్స్ ఓపెన్ చేసి వెళ్లిపొమ్మన్న బిగ్ బాస్!

First Published | Sep 20, 2024, 12:38 PM IST

ఇంటి సభ్యులలో కొందరు హద్దులు మీరి ప్రవర్తిస్తున్న తరుణంలో బిగ్ బాస్ ఫైర్ అయ్యాడు. బిగ్ బాస్ ఇంట్లో... బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వెళ్లిపోండని మెయిన్ డోర్ ఓపెన్ చేశాడు. 

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మూడో వారంలో అడుగుపెట్టింది. ఇప్పుడిప్పుడే షో రసవత్తరంగా మారుతుంది. నిఖిల్-అభయ్ నవీన్ క్లాన్స్ మధ్య గుడ్లను సేకరించే టాస్క్ హోరాహోరీగా సాగింది. అభయ్ నవీన్ టీమ్ సభ్యులు ప్రేరణ, యష్మి గట్టిగా పోరాడారు. వీరిద్దరి గేమ్ అగ్రెసివ్ గా ఉంది. 


నాగ మణికంఠ, ఆదిత్య ఓం సైతం గుడ్లను సేకరించేందుకు ప్రత్యర్థి టీమ్ తో తలపడ్డారు. చీఫ్ గా ఉన్న అభయ్ నవీన్ చేతులెత్తేయడం టీమ్ కి మైనస్ అయ్యింది. ప్రత్యర్థి చీఫ్ నిఖిల్ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టాడు. తనను అడ్డుకునేందుకు చూసిన కంటెస్టెంట్స్ తో దురుసుగా ప్రవర్తించాడు. ప్రేరణ చేతిలో ఉన్న బుట్టను విష్ణుప్రియ కాలితో తన్నడం వివాదాస్పదమైంది. 

ఈ టాస్క్ లో విష్ణుప్రియ ప్రవర్తన పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో ప్రేరణ విష్ణుప్రియను మాటలతో రెచ్చగొట్టిందనే వాదన వినిపిస్తోంది. బిగ్ బాస్ రూల్స్ పై కంటెస్టెంట్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అభయ్ నవీన్ ఘాటైన విమర్శలు చేశాడు. బిగ్ బాస్ కి బుర్ర ఉందా? ఈ రూల్స్ పెట్టేవారు అసలు మనుషులేనా? అని కోప్పడ్డాడు. 


Bigg Boss Telugu 8

కంటెస్టెంట్స్ వంట చేసుకోవడానికి 14 గంటల నిర్ణీత సమయం ఇచ్చిన బిగ్ బాస్, ఒక క్లాన్ సభ్యుల నుండి ముగ్గురు మాత్రమే వంట చేయాలని నిమయం పెట్టాడు. ముగ్గురు ఇంత మందికి ఫుడ్ ఎలా ప్రిపేర్ చేస్తారని అభయ్ నవీన్ ఫైర్ అయ్యాడు. గేమ్ రూల్స్ పై కూడా అభయ్ నవీన్ అసహనం ప్రకటించారు. 

ఈ క్రమంలో అభయ్ నవీన్ తో పాటు మిగతా ఇంటి సభ్యులకు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నారు. ఇక్కడ బిగ్ బాస్ నియమాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. కాదని, మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే ఎక్కువ అనుకుంటే బటయకు వెళ్లిపోవచ్చని, మెయిన్ డోర్ తెరిచారు. దాంతో కంటెస్టెంట్స్ షాక్ అయ్యారు. 

Bigg Boss Telugu 8

ఇకపై బిగ్ బాస్ రూల్స్ అతిక్రమించకుండా పాటించాలని కంటెస్టెంట్స్ కి సందేశం వెళ్ళింది. మరోవైపు...  మూడవ వారానికి గాను విష్ణుప్రియ, సీత, ప్రేరణ, యష్మి, నైనిక, అభయ్, నాగ మణికంఠ, పృథ్విరాజ్ నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు ఇంటిని వీడాల్సి ఉంది. 

ఓటింగ్ చివరి దశలో ఉంది. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవుతాయి. కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా.. ఎలిమినేట్ అయ్యేది ఎవరనే ఉత్కంఠ నెలకొంది. బిగ్ బాస్ అధికారిక ఓటింగ్ చాలా సీక్రెట్. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనేది, బయటపెట్టరు. 
 

అయితే పలు మీడియా సంస్థలు అనధికారిక పోల్స్ నిర్వహిస్తాయి. మెజారిటీ పోల్స్ ఫలితాల ఆధారంగా మనం ఒక నిర్ణయానికి రావచ్చు. ఈ అనధికారిక పోల్స్ సమాచారం ప్రకారం... విష్ణుప్రియకు అత్యధికంగా ఓట్లు పోల్ అవుతున్నాయట. విష్ణుప్రియకు ఉన్న ఫేమ్ ఆమెకు ఓట్లు తెచ్చిపెడుతుంది. 

గేమ్ పరంగా విష్ణుప్రియ అంత స్ట్రాంగ్ గా లేదు. గుడ్లు సేకరించే టాస్క్ లో ఆమె రూడ్ గా బిహేవ్ చేసింది. సోషల్ మీడియాలో ఒకింత వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. నాగ మణికంఠ, యష్మి గౌడ, ప్రేరణలు కూడా ఓటింగ్ లో ముందంజలో ఉన్నారని సమాచారం. 
 

Abhai Naveen Bigg bos8

చివరి నాలుగు స్థానాల్లో నైనిక, సీత, అభయ్, పృథ్విరాజ్ ఉన్నారట. నైనిక సేఫ్ అంటున్నారు. ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అభయ్, పృథ్విరాజ్ ల కంటే సీత మెరుగైన ఓట్లు రాబట్టిందట. తాజా సమాచారం ప్రకారం.. పృథ్విరాజ్, అభయ్ డేంజర్ జోన్లో ఉన్నారట. ఈ వారం అభయ్ ఎలిమినేట్ కానున్నాడని గట్టిగా వినిపిస్తుంది.

బిగ్ బాస్ హౌజ్ నుంచి మూడో వారం ఎగ్జిట్ అయ్యేది ఎవరు?

Latest Videos

click me!