నేనేదో సరదాగా అంటే మావాడినే ప్రేమించింది... లావణ్య త్రిపాఠిపై అల్లు అరవింద్ కామెంట్స్ 

Published : Jul 14, 2023, 01:30 PM ISTUpdated : Jul 14, 2023, 01:46 PM IST

లావణ్య త్రిపాఠిని ఉద్దేశిస్తూ నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నేనేదో సరదా అంటే ఆమె నిజంగానే మావాడిని ప్రేమించిందని అన్నారు.   

PREV
16
నేనేదో సరదాగా అంటే మావాడినే ప్రేమించింది... లావణ్య త్రిపాఠిపై అల్లు అరవింద్ కామెంట్స్ 


చావు కబురు చల్లగా మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరైన అల్లు అరవింద్ ఓ కామెంట్ చేశారు. వేదిక మీద పక్కనే ఉన్న లావణ్యను ఉద్దేశిస్తూ... ఎక్కడో నార్త్ లో పుట్టి తెలుగు నేర్చుకొని చక్కగా మాట్లాడేస్తున్నావ్, ఇక్కడే ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో, అన్నాడు. దానికి లావణ్య గట్టిగా నవ్వేసింది. 
 

26


కట్ చేస్తే రెండేళ్లలో వరుణ్ తేజ్ తో నిశ్చితార్థం చేసుకుంది. బేబీ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరైన అల్లు అరవింద్ ని ఇదే విషయం అడగం జరిగింది. దానికి అల్లు అరవింద్... లావణ్య మంచి అమ్మాయి. తనంటే నాకు ఇష్టం. నా బ్యానర్ లో మూడు సినిమాలు చేసింది. 

36
Allu Aravind

ఆ చనువుతో ఇక్కడే ఓ అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో అని సరదాగా అన్నాను. కానీ ఆమె సీరియస్ గా తీసుకుని మావాడినే ప్రేమించిందని సరదాగా తన మాటలు గుర్తు చేసుకున్నారు. అయితే ఫ్యామిలీ మెంబర్ గా అల్లు అరవింద్ కి వారి ప్రేమ విషయం అప్పటికే తెలుసా ఉండొచ్చని కొందరి అభిప్రాయం. 
 

46


కాగా హైదరాబాద్ లోని నాగబాబు నివాసంలో జూన్ 9న వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ వేడుకకు మెగా కుటుంబ సభ్యులు అందరూ హాజరయ్యారు.చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్ సతీసమేతంగా హాజరయ్యారు. అలాగే సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఎంగేజ్మెంట్ వేడుకలో పాల్గొన్నారు. కేవలం కుటుంబ సభ్యులను మాత్రమే ఆహ్వానించారు. చిత్ర ప్రముఖులకు ఎలాంటి పిలుపు లేదు. పెళ్లి మాత్రం చిత్ర ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించనున్నారట. 
 

56

 గత ఐదేళ్లకు పైగా వరుణ్, లావణ్య డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది.  రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వార్తలను లావణ్య ఖండించడం విశేషం. దాంతో ఎక్కడో ఓ మూలన సందేహాలు ఏర్పడ్డాయి. 
 

66

ఎట్టకేలకు నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివర్లో వరుణ్-లావణ్య పెళ్లి పీటలు ఎక్కనున్నారనే ప్రచారం జరుగుతుంది. సగం పెళ్ళైపోగా కొత్త జంట విదేశాల్లో విహరిస్తున్నారు. తమ టూర్ డైరీస్ ఫ్యాన్స్ తో షేర్ చేస్తున్నారు. 
 

click me!

Recommended Stories