పచ్చని చెట్ల మధ్య మెస్మరైజ్‌ చేసే మెహరీన్‌ అందాలు.. టాప్‌కి, ప్యాంట్‌కి మధ్య గాపిచ్చి రచ్చలేపుతున్న ఎఫ్‌3 భామ

Published : Jul 14, 2023, 01:20 PM IST

ఫారెన్‌ కోడిలా బబ్లీ అందాలతో ఆకట్టుకునే మెహరీన్‌ స్లిమ్‌గా మారి షాకిస్తుంది. ఆమె స్లిమ్‌ లుక్‌లో కనిపిస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఇప్పుడు వెకేషన్‌లో పండగ చేసుకుంటూ ఫోటోలతో ఆకట్టుకుంటుంది. 

PREV
17
పచ్చని చెట్ల మధ్య మెస్మరైజ్‌ చేసే మెహరీన్‌ అందాలు.. టాప్‌కి, ప్యాంట్‌కి మధ్య గాపిచ్చి రచ్చలేపుతున్న ఎఫ్‌3 భామ

మెహరీన్‌.. నాని సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. `కృష్ణగాడి వీర ప్రేమ గాథ` అంటూ తెలుగు తెరకి పరిచయం అయ్యిందీ అందాల భామ. తొలి చిత్రంతో కుర్రాళ్ల హృదయాలను దోచుకుంది. అందంతో కట్టిపడేస్తుంది. బబ్లీ అందాలతో మంత్రముగ్దుల్ని చేసింది. సినిమా హిట్‌ కావడంతో మెహరీన్‌ ఫిర్జాదా కి అవకాశాలు క్యూ కట్టాయి. 
 

27

అనతి కాలంలోనే టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌ అయిపోయింది మెహరీన్‌. అందం ఆమెకి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. తెలుగు కమర్షియల్‌ సినిమాలకు కావాల్సినట్టుగా ఉంటే చాలు ఇక్కడ అవకాశాలు వెంటపడతాయి. ఇక సక్సెస్‌ ఉందంటే వారికి ఛాన్స్ లు క్యూ కడతాయి. మొదట్లో మెహరీన్‌ పరిస్థితి కూడా అంతేకాదు. ఈ బ్యూటీని ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. 
 

37

శర్వానంద్‌తో కలిసి `మహానుభావుడు` చిత్రంలో నటించింది. ఇందులో ఆమె పాత్రకి మంచి ప్రయారిటీనే దక్కింది. లవ్‌ స్టోరీ కావడం అది మెహరీన్‌కి కలిసొచ్చింది. ఆ తర్వాత మాస్‌ మహారాజా రవితేజతో `రాజా ది గ్రేట్‌`లో ఛాన్స్ కొట్టేసింది. బ్యాక్‌ టూ బ్యాక్‌ హిట్లతో హ్యాట్రిక్‌ హిట్‌ పడటంతో ఈ బ్యూటీ రేంజ్‌ మారిపోయింది. 

47

కానీ అక్కడే పప్పులో కాలేసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే పనిలో స్క్రిప్ట్ ల సెలెక్షన్‌లో పొరపాట్లు చేసింది. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుసగా ఫ్లాప్‌లు పడ్డాయి. `ఎఫ్‌2` వరకు హిట్‌ లేదు. వరుసగా `కేరాఫ్‌ సూర్య`, `జవాన్‌`, `పంతం`, `నోటా`, `కవచం` చిత్రాలో ఫ్లాప్‌ అయ్యారు. `ఎఫ్‌2` పెద్ద బూస్ట్ ఇచ్చింది. ఆ తర్వాత `ఎఫ్‌3` వరకు హిట్‌ లేదు. 
 

57

`చాణక్య`, `ఎంత మంచివాడవురా`, `పటాస్‌`(తమిళం`, `అశ్వథ్థామ`, `మంచి రోజులొచ్చాయ్‌` చిత్రాలు పెద్దగా ఆడలేదు. `ఎఫ్‌3` కూడా యావరేజ్‌గానే ఆడింది. ఇప్పుడు `స్పార్క్` చిత్రంలో నటిస్తుంది. కన్నడలో `నీ సిగూవేరుగు` చిత్రంలో నటిస్తుంది. సినిమాలు పెద్దగా లేకపోవడంతో చాలా వరకు ఖాళీగానే ఉంటుందీ అందాల భామ. అందుకే అందాలను నమ్ముకుంటుంది. 

67

ఓ వైపు వెకేషన్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. మరోవైపు అందాల ఆరబోతతో నెటిజన్లని ఆకర్షిస్తూ ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అదే సమయంలో గ్లామర్‌ డోస్‌ పెంచుతూ మేకర్స్ కి ఎరవేస్తుంది. అవకాశాల కోసం అందాలను నమ్ముకుంది. అందులో భాగంగానే ఇప్పుడు వెకేషన్‌లో ఎంజాయ్‌ చేస్తుంది. వైట్‌ డ్రెస్‌లో మెరిసింది. ప్రకృతిలో సేద తీరుతుంది. అయితే టాప్‌కి, ప్యాంట్‌కి మధ్య గ్యాప్‌ ఇస్తూ నడుము చూపిస్తూ రచ్చకి తెరలేపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 
 

77

అయితే మెహరీన్‌ రెండేళ్ల క్రితం పెళ్లికి సిద్ధపడింది. హర్యానా మాజీ సీఎం భజన్‌ లాల్‌ మనవడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. పెళ్లికి కూడా రెడీ అయ్యింది. కానీ అంతలోనే ఆ ఎంగేజ్‌మెంట్‌ని క్యాన్సిల్‌ చేసుకుంది. అందుకు కారణాలు తెలియాల్సి ఉంది. భజన్‌ లాల్‌ది రాయల్‌ ఫ్యామిలీ. వారి సంబంధం క్యాన్సిల్‌ కావడంతో మెహరీన్‌ చాలా డిజప్పాయింట్‌ అయినట్టు సమాచారం. హీరోయిన్‌ పెళ్లి చేసుకుంటుందంటే కామన్‌గా సినిమా అవకాశాలు తగ్గిపోతాయి. మెహరీన్‌ విషయంలో అదే జరిగింది. ఇప్పుడిప్పుడే మళ్లీ అవకాశాలను అందుకునే పనిలో బిజీగా ఉందీ హాట్‌ హీరోయిన్‌. అందుకోసం గ్లామర్‌ ట్రీట్‌తో ఆకర్షిస్తుందీ సెక్సీ బ్యూటీ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories