HariHara VeeraMallu: పవన్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ `హరిహర వీరమల్లు`పై హైప్‌ ఇచ్చిన నిర్మాత, ఏం చెప్పాడంటే?

Published : Feb 04, 2025, 09:58 PM ISTUpdated : Feb 04, 2025, 11:00 PM IST

 HariHara VeeraMallu: పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న హిస్టారికల్‌ మూవీ `హరిహర వీరమల్లు` గురించి నిర్మాత ఏ ఎం రత్నం ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్ చేశారు. భారీ హైప్‌ ఇచ్చారు. 

PREV
14
 HariHara VeeraMallu: పవన్‌ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ `హరిహర వీరమల్లు`పై హైప్‌ ఇచ్చిన నిర్మాత, ఏం చెప్పాడంటే?
pawan kalyan , am rathnam

A M Rathanm HariHara VeeraMallu:పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా మూవీ `హరిహర వీరమల్లు` చిత్రీకరణ దశలో ఉంది. మరో వారం, పది రోజుల షూటింగ్‌లో పవన్‌ పాల్గొంటే ఈ మూవీ పూర్తవుతుందట. ఇటీవలే పవన్‌ తెలిపారు. తాజాగా నిర్మాత ఏఎం రత్నం మూవీపై హైప్‌ పెంచారు.

ఆయన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమా ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ లో రూపొందుతుందన్నారు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తోన్న ఈ ఎపిక్ యాక్షన్ డ్రామా, పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఘన విజయం సాధిస్తుందని ఎ.ఎం.రత్నం నమ్మకం వ్యక్తం చేశారు.

24
a m rathnam

ప్రపంచ స్థాయిలో గొప్ప చిత్రంగా `హరిహర వీరమల్లు`..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మొదటి సినిమా కావడంతో పాటు, భారీ బడ్జెట్ పీరియాడిక్ ఫిల్మ్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా, ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందే గొప్ప చిత్రంగా `హరి హర వీరమల్లు ` నిలుస్తుందని నిర్మాత ఎ.ఎం.రత్నం తెలిపారు.

నేడు ఆయన(ఫిబ్రవరి 4) పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా `హరిహర వీరమల్లు` సినిమా గురించి హైప్‌ ఇచ్చే విషయాలను వెల్లడించి ఫ్యాన్స్ ని ఖుషీ చేశారు. ప్రేక్షకుల హృదయాల్లో చిర స్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.

పవన్‌, ఏఎంరత్నం ముచ్చటగా మూడోసారి..

పవన్‌ కళ్యాణ్‌, ఏఎం రత్నం కాంబినేషన్‌లో ఇప్పటికే `ఖుషి`, `బంగారం` లాంటి సినిమాలు వచ్చాయి. `ఖుషి` సినిమా తెలుగు సినీ పరిశ్రమలో ఎవర్ గ్రీన్ చిత్రాలలో ఒకటిగా నిలవగా, `బంగారం ` సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు వీరి కలయికలో ముచ్చటగా మూడో సినిమాగా `హరి హర వీరమల్లు` రూపొందుతోంది.

ఈ మూవీని మార్చి 28న విడుదల చేయాలని టీమ్‌ నిర్ణయించింది. అయితే వాయిదా పడుతుందనే రూమర్స్ వచ్చాయి. కానీ ప్రస్తుతానికి వాయిదా వేసే ఆలోచన లేదని టీమ్‌ వెల్లడించింది. కానీ తాజాగా నిర్మాత ప్రకటనలో రిలీజ్‌ డేట్‌ ని మెన్షన్‌ చేయకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఈ సినిమా వాయిదా పడుతుందని తెలుస్తుంది.  
 

34
a m rathnam

దర్శకుడు, నిర్మాత, రైటర్‌గా ఏ ఎం రత్నం..

భారత దేశం గర్వించదగ్గ నిర్మాతలలో ఒకరు ఎ.ఎం. రత్నం. కేవలం నిర్మాతగానే కాకుండా గీత రచయితగా, రచయితగా, దర్శకుడిగా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలలో తనదైన ముద్ర వేశారు. ఎ.ఎం.రత్నం 1953 ఫిబ్రవరి 4వ తేదీన నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాలెంలో జన్మించారు.

సినిమానే తన జీవితంగా భావించి, అసాధారణ కృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలతో ఒకరిగా నిలిచారు. `కర్తవ్యం` వంటి మహిళా సాధికారత సబ్జెక్ట్‌తో నిర్మాతగా ప్రయాణాన్ని ప్రారంభించిన ఎ.ఎం.రత్నం, తొలి చిత్రంతోనే చరిత్రలో నిలిచిపోయే అడుగు వేశారు.  

చిరంజీవితో `స్నేహం కోసం`..

కుటుంబ విలువలు, ఐక్యత గురించి చెప్పే `పెద్దరికం`, `సంకల్పం` వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు ఎ.ఎం.రత్నం. నిర్మాతగా కూడా నైతికత, సామాజిక బాధ్యతతో `ఇండియన్`, `నట్పుక్కాగ`, `కధలర్ దినం`, `ఖుషి`, `బాయ్స్`, `గిల్లి`, `7/G రెయిన్‌బో కాలనీ `వంటి చిత్రాలను నిర్మించారు.

మెగా బడ్జెట్ చిత్రాల నిర్మాతగా పేరుగాంచిన ఈ దిగ్గజ నిర్మాత, ఎ.ఆర్. రెహమాన్, శంకర్ వంటి భారతీయ సినిమా దిగ్గజాలతో పలు సినిమాలకు చేతులు కలిపారు. అలాగే `స్నేహం కోసం` చిత్రానికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి పనిచేశారు. ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన ఎ.ఎం.రత్నం మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, రెండు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు మరెన్నో ప్రశంసలను గెలుచుకున్నారు.
 

44
a m rathnam

`జీన్స్, బాయ్స్, నాగ` చిత్రాలకు రైటర్‌గా.. 
నిర్మాతగా, దర్శకుడిగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించి ఎన్నో గొప్ప చిత్రాలను ప్రేక్షకులకు చేరువ చేశారు. అలాగే రచయితగా, గీత రచయితగా తనదైన ముద్ర వేశారు. జీన్స్, బాయ్స్ చిత్రాల తెలుగు పాటలను ఎ.ఎం.రత్నం రచించారు. ఆ పాటలు ఎంతటి ఆదరణ పొందాయో తెలిసిందే.

ఇప్పటికీ ఎందరికో అభిమాన గీతాలుగా ఉన్నాయి. అంతేకాదు, కొందరు స్వార్థ రాజకీయ నాయకుల వలన ప్రజలు ఎలా నష్టపోతారో తెలిపే కథగా రూపొందిన నాగ చిత్రానికి, ఎ.ఎం.రత్నం స్క్రీన్ ప్లే అందించడంతో పాటు, గీత రచయితగా వ్యవహరించడం విశేషం. 

read more: ఎన్టీఆర్‌ సంచలన నిర్ణయం, త్వరలో భారీ సభ.. కారణం అదేనా?

also read: సినిమా చూస్తే పదివేలు, కానీ చిన్న కండీషన్‌.. సాయిరామ్‌ శంకర్‌ బంపర్‌ ఆఫర్‌
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories