ఎన్టీఆర్ తన అభిమానులను ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, గౌరవానికి ధన్యవాదాలు తెలియజేశారు. తనని కలుసుకోవాలని ఎదురు చూస్తున్న అభిమానుల ఆసక్తిని అర్థం చేసుకుని, త్వరలో ఎలాంటి ఇబ్బందులు లేని సమావేశంలో వ్యక్తిగతంగా వారిని కలుసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమానికి అన్ని అనుమతులు పొందుతూ, పోలీస్ డిపార్ట్ మెంట్, సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుని శాంతి భద్రతల సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకుని సమావేశం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామన్నారు.