సినిమా ఇండస్ట్రీలో తనపై కొందరు కావాలనే ద్వేషపూరిత ప్రచారం చేశారని నటి ప్రియాంక మోహన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన ఈ ఆరోపణలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
డాన్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలతో తమిళంలో ప్రియాంక మోహన్ పాపులర్ అయ్యింది. తన కెరీర్‌లో ఒకానొక దశలో తనపై ద్వేషపూరిత ప్రచారం జరిగిందని ఆమె తాజాగా బయటపెట్టింది. అయితే ఆ గతాన్ని మళ్లీ గుర్తుచేసుకోవడం ఇష్టం లేదని, ఆ అనుభవమే తనను మంచి మనిషిగా మార్చిందని ప్రియాంక చెప్పింది.
24
ద్వేషపూరిత ప్రచారం
ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రియాంక మోహన్ ఈ విషయాలు పంచుకుంది. 'నాపై ద్వేషపూరిత ప్రచారం జరిగింది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ప్రతీ ఒక్కరినీ ట్రోల్ చేస్తున్నారు. లెజెండరీ నటులు, దర్శకులను కూడా వదలడం లేదు. నా విషయంలోనూ ఇలాంటివి చాలా జరిగాయి. కానీ నేను ఆ గతాన్ని తిరిగి గుర్తుచేసుకోవాలనుకోవట్లేదు' అని ప్రియాంక చెప్పింది.
34
అనుభవం నుంచి చాలా నేర్చుకున్నా
ఆ అనుభవమే తనను మంచి మనిషిగా మార్చిందని ప్రియాంక చెప్పింది. 'ఆ అనుభవం నుంచి నేను చాలా నేర్చుకున్నా. సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. ఎవరికైనా ఏదైనా జరగొచ్చు. కానీ ఒక కష్టకాలం వచ్చినప్పుడు, అది మనల్ని మరింత ఎదిగేలా చేస్తుంది' అని ప్రియాంక వివరించింది. సుధీర్ శ్రీనివాసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేసింది.
ప్రస్తుతం ప్రియాంక మోహన్ తెలుగులో బిజీగా ఉంది. చివరిగా పవన్ కళ్యాణ్ సరసన 'ఓజీ' సినిమాలో నటించింది. తమిళంలో ఆమె నటించిన చివరి సినిమా 'బ్రదర్' పెద్ద ఫ్లాప్ అయ్యింది. ప్రస్తుతం ఆమె కవిన్‌కు జోడీగా ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇది కాకుండా, రజినీకాంత్ 'తలైవర్ 173'లో కూడా ప్రియాంకకు అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు 'డాన్' డైరెక్టర్ సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారు.