ఈ మేరకు లేటెస్ట్ ఫొటోలు, రీల్స్ ను అప్ లోడ్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తోంది. ఇటీవలె ప్రియాంక ఇన్ స్టాలో 1 మిలియన్ ఫాలోవర్స్ ను రీచ్ అయ్యింది. ఇందుకు సంతోషం వ్యక్తం చేస్తూ పలు ఫొటోలను షేర్ చేసింది. ఈ మేరకు ఫ్యాన్స్ కు ధన్యవాదాలు తెలుపుతూ నోట్ రాసింది. తాజాగా కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తూ ‘మీరేం చూస్తున్నారు.. వెనక్కి చూస్తే, మీరు ఉన్నారు’ అంటూ నెటిజన్లను ఉద్దేశించి క్యాప్షన్ యాడ్ చేసింది.