ఎట్టకేలకు ప్రేమికుడితో ప్రియాంక జైన్‌ పెళ్లి.. ఇక్కడ వర్కౌట్ కాలేదని అక్కడ ప్లాన్‌ చేసిన బిగ్ బాస్‌ నటి

Published : Apr 02, 2024, 04:55 PM ISTUpdated : Apr 02, 2024, 08:36 PM IST

బిగ్‌ బాస్ ఫేమ్‌ ప్రియాంక జైన్‌, శివకుమార్‌ పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు. దీంతో ఎట్టకేలకు ప్రియాంక కోరిక నెరవేరింది. ఇక్కడ కాదు, అక్కడ చేసుకున్నారు.   

PREV
16
ఎట్టకేలకు ప్రేమికుడితో ప్రియాంక జైన్‌ పెళ్లి.. ఇక్కడ వర్కౌట్ కాలేదని అక్కడ ప్లాన్‌ చేసిన బిగ్ బాస్‌ నటి
Priyanka Jain

బిగ్‌ బాస్‌ షోతో పాపులర్‌ అయ్యింది ప్రియాంక జైన్‌. ఇందులో ఆమె తన ప్రేమ విషయాన్ని బయటపెట్టడంతోపాటు ప్రియుడిని పరిచయం చేసి అలరించింది. పెళ్లెప్పుడు అంటూ బిగ్‌ బాస్‌ షోలోనే ప్రియుడిని నిలదీసింది. ఇప్పుడే చేసుకుందాం అనేంతగా ఆరాటపెట్టింది. దీంతో బిగ్‌ బాస్‌ షో నుంచి బయటకు రాగానే మ్యారేజ్‌ చేసుకుందామని చెప్పాడు ప్రియుడు శివ. కానీ ఇప్పటి వరకు ఊరిస్తూనే ఉన్నారు. 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశాలున్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని ఇక్కడ షేర్ చేయండి
 

26

 పాపం తన కోరిక తీరలేదని బాధపడిందో ఏమో, ఆమెలో ఎంత మదనం జరిగిందో, ప్రియుడు శివతో ఎంతగా గొడవ పడిందో, ఏం జరిగిందో ఏంటో.. గానీ ఇప్పుడు ఎట్టకేలకు పెళ్లి పీఠలెక్కింది. కోరుకున్నవాడితో పెళ్లికి రెడీ అయ్యింది. ఏం చేసిన లాభం లేదని భావించిందో ఏమో అక్కడ ప్లాన్‌ చేసింది. ఎట్టకేలకు ప్రియుడిని పెళ్లి చేసుకుంది. 

36

ప్రియాంక జైన్‌, శివ కుమార్‌ పెళ్లిపీఠలెక్కారు. మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అందరి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అయితే ఇదంతా టీవీ షోలో జరగడం విశేషం. బయట వర్కౌట్‌ కాలేదని ప్రియాంక జైన్‌.. ఇలా టీవీ షోలో ప్లాన్‌ చేసినట్టుంది. కోరుకున్నవాడితో, తనని ప్రేమించిన వాడితో, తాను ప్రేమించిన వాడితో పెళ్లి జరిగింది. 
 

46

ఇదంతా స్టార్‌ మాలో జరగడం విశేషం. ఉగాది పండగ స్పెషల్‌గా ఈ టీవీ ఛానెల్‌ వాళ్లు ఓ ప్రత్యేకమైన ప్రోగ్రామ్ ప్లాన్‌ చేశారు. `మా ఇంటి పండగ` అంటూ పది మంది జంటలతో ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్‌ని ప్లాన్‌ చేశారు. ఇందులో తీరని కోరికలను తీర్చడమనేది కాన్సెప్ట్. చిరకాల కోరికలను తీర్చడం, పెద్ద వారి కోరికలను తీర్చడమనేది పెట్టుకున్నారు. అందులో భాగంగా ప్రియాంక జైన్‌, శివ కుమార్‌ల పెళ్లి అనేది కూడా తీరని కోరికలా మిగిలిపోతున్న నేపథ్యంలో ఇలా షోలో ప్లాన్ చేశారు. 
 

56

ఇందులో శివకుమార్‌, ప్రియాంక జైన్‌ పెళ్లి జంటగా ముస్తాబైంది. బయట పెళ్లికి ఎలా రెడీ అవుతారో, ఇందులో కూడా అలానే రెడీ అయ్యారు, ఆ విషయంలో రాజీ లేదని చెప్పొచ్చు. వీరికి ఇతర నటీనటులు, కమెడియన్లు పెళ్లి పెద్దలయ్యారు. యాంకర్‌ శ్రీముఖి సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇలా ప్రియాంక కోరికని తీర్చేసింది స్టార్‌ మా. దీంతో ఆమె కళ్లల్లో ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. 
 

66
Priyanka Jain

ఇక ప్రియాంక జైన్‌, శివ కుమార్‌ టీవీ నటులుగా రాణించారు. అక్కడే వీరి మధ్య ప్రేమ ఏర్పడించింది. సహజీవనం సాగుతుంది. ప్రియాంక జైన్‌ బిగ్‌ బాస్‌కి వెళ్లి టాప్‌ 5 కంటెస్టెంట్ గా నిలిచి మెప్పించింది. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్గా నిలిచింది. ఇక ఇప్పుడు ప్రియాంక, శివ కుమార్‌తో కలిసి యూట్యూబ్‌ ఛానెల్స్ లో వీడియోలు చేస్తూ అలరిస్తున్నారు. ఇద్దరు గొడవపడుతున్నట్టు చేస్తున్న వీడియోలకు మంచి వ్యూస్‌ రావడం విశేషం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories