టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Tollywood Actress Keerthy Suresh) కు బిగ్ ఛాన్స్ దక్కింది. మహానటి కెరీర్ మలుపు తిరిగే అవకాశం అందుకుందని తెలుస్తోంది.
మహానటి కీర్తి సురేష్ (Keerthy Suresh) ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. క్రేజీ ప్రాజెక్ట్స్ ల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది. తన సినిమాలపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
చివరిగా కోలీవుడ్ చిత్రం ‘సైరెన్’తో అలరించింది. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆకట్టుకుంది. నెక్ట్స్ రివాల్వర్ రీటాతో పాటు పలు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ బిజీగా ఉంది.
36
ఇక తెలుగులో చివరిగా ‘సర్కారు వారి పాట’, ‘దసరా’ వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను అందుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
46
ప్రస్తుతం కూడా మరిన్ని ప్రాజెక్ట్స్ కు సైన్ చేస్తూ హాట్ టాపిక్ గ్గా మారింది. ఆ మధ్యలో యంగ్ హీరో సుహాస్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు పుట్టుకొచ్చాయి.
56
ఇక తాజాగా మాత్రం మహానటి కీర్తి సురేష్ కు ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) సరసన నటించే ఛాన్స్ దక్కిందంటున్నారు. దీంతో ఈ ముద్దుగుమ్మ కెరీర్ మరో మలుపు తిరుగుతుందని అంటున్నారు.
66
Actress Keerthy Suresh
ప్రభాస్ ప్రస్తుతం బిగ్ ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తుండగా.. కీర్తి సురేష్ కు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతున్న ‘స్పిరిట్’ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కిందంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.