ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ `క్వాంటికో` ద్వారా హాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి సిరీస్‌తోనే అక్కడి ఆడియెన్స్ ని అలరించింది. దుమ్మురేపింది. దీంతో వరుసగా సినిమాలు, టీవీ సిరీస్‌లు ఊపందుకున్నాయి. పాపులర్ మూవీ `బేవాచ్`లో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత `ఏ కిడ్ లైక్ జేక్`, `ఇజ్ నాట్ ఇట్ రొమాంటిక్`, `హ్యాపీనెస్ కంటిన్యూస్`, `వీ కెన్ బి హీరోస్` `ది వైట్ టైగర్`, `ది మ్యాట్రిక్స్ రెసర్రెక్షన్స్`, `లవ్ ఎగైన్` చిత్రాలు చేసింది.