పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ పై ఇండైరెక్ట్ గా ఆమె సీరియస్ కామెంట్స్ చేశారు. అయితే ఏనాడూ నేరుగా ఓపెన్ అయ్యింది లేదు. తాజాగా పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ పై సెటైర్ వేసింది. బ్రో మూవీలోని శ్యామ్ బాబు పాత్ర వివాదం రాజేసిన విషయం తెలిసిందే. ఏపీ మంత్రి అంబటి రాంబాబును కించపరిచేందుకే ఆ పాత్ర పెట్టారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.