
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ మూడో వారం హౌజ్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని బిగ్ బాస్ ఈ సీజన్ ప్రారంభం నుంచే చెబుతున్నారు. ఈ సారి షో ట్విస్ట్ లు, టర్న్ ఉంటాయని. అన్నట్టుగానే మూడో వారం నుంచే ట్విస్ట్ లు స్టార్ట్ చేశారు. మొదటి రెండు వారాలు ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. మొదటి వారం శ్రష్టి వర్మ హౌజ్‌ని వీడగా, రెండో వారం మర్యాద మనీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు మూడో వారం ఎవరు హౌజ్‌ని వీడబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో రెండో వారంలో వినిపించిన పేరే ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అంటున్నారు. ఆ సంగతులేంటో చూస్తే.
మూడో వారంలో నామినేషన్‌లో పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, హరిత హరీష్, రీతూ చౌదరీ, ఫ్లోరా సైనీ, రాము రాథోడ్ ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే వీరికి వచ్చిన ఓటింగ్ ప్రకారం చూస్తుంటే రాము రాథోడ్ ఓటింగ్‌లో జోరు మీదున్నారు. ఆయన టాప్‌లో ఉండటం విశేషం. ఆ తర్వాత ఫ్లోరా సైనీ ఉన్నారు. హౌజ్‌లో సైలెంట్, బోరింగ్ అంటూ కామెంట్లు ఫేస్ చేసి ఏకంగా జైల్‌ల్లోకి వెళ్లింది ఫ్లోరా. కానీ ఆమెకి ఆడియెన్స్ నుంచి మంచి ఓటింగ్ పడుతుండటం విశేషం. ఓటింగ్‌లో టాప్ 2 లో ఉండటం ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తోన్న రీతూ చౌదరీ మూడో స్థానంలో ఉంది. ప్రారంభంలో ఆమెపై ఓటింగ్‌పై ప్రభావం చూపించినా నెమ్మదిగా పుంజుకుంటోంది. నాల్గో స్థానంలో హరిత హరీష్, ఐదో స్థానంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. చివరగా ప్రియా శెట్టి ఉన్నారు. అయితే హరీష్, పవన్‌ల మధ్య చిన్నపాటితేడానే ఉంది. ఈ ఓటింగే ఎలిమినేషన్ ఎవరనేది తేల్చేస్తుంది.
మూడో వారం బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్ ను వీడేది ప్రియా శెట్టి అని, ఆమె ఎలిమినేషన్ ఫైనల్ అయినట్టు సమాచారం. ప్రియా శెట్టి మూడో వారం ఎలిమినేట్ అయ్యిందని సోషల్ మీడియా తేల్చేసింది. ఆయా పోస్ట్ లతో ఆ విషయాన్ని కన్ఫమ్ చేస్తోంది. అయితే ప్రియా శెట్టి రెండో వారమే ఎలిమినేట్ కావాల్సింది. ఆమె ఎలిమినేట్ అంటూ ప్రచారం జరిగింది. కానీ చివరి రోజు ఆమెకి ఓటింగ్ పెరిగింది. దీంతో బతికిపోయింది. ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంది. కానీ మూడో వారం మాత్రం తప్పించుకోలేకపోయిందని సమాచారం. ఇది కామనర్స్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా శ్రీజకి, పవన్ కళ్యాణ్‌లకు పెద్ద షాక్ గా చెప్పొచ్చు. ఎందుకంటే వీరే హౌజ్‌లో ఎక్కువగా క్లోజ్‌గా ఉంటారు.
అయితే ప్రియా ఎలిమినేషన్‌కి కారణాలు చూస్తే ఆమె హౌజ్‌లో హడావుడి చేయడం తప్ప, పెద్దగా గేమ్ లు ఆడింది లేదంటున్నారు నెటిజన్లు. శ్రీజతో కూర్చొని ముచ్చట్లు పెట్టడం తప్ప, ఎంటర్‌టైన్ చేసింది లేదంటున్నారు. హౌజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ చాలా ముఖ్యం. సిన్సియర్‌గా టాస్క్ లు ఆడటం ముఖ్యం. ఆ విషయంలో ప్రియా వెనకబడిపోయింది. దీనికితోడు గత వారం కెప్టెన్ నిర్ణయంలో మిస్టేక్స్ చేశారు. ఇమ్మాన్యుయెల్ విషయంలో రాంగ్ జడ్జ్ మెంట్ ఇచ్చారు. ఇవన్నీ ప్రియాకి ఓటింగ్ తగ్గడానికి కారణమని తెలుస్తోంది. పైగా సెలబ్రిటీలకు ఆడియెన్స్ లో ఫాలోయింగ్ ఉంటుంది. వారికి ఓటింగ్ గట్టిగా పడుతుంది. కానీ కామనర్స్ కి అంతటి ఫాలోయింగ్ ఉండదు. ప్రత్యేకంగా పీఆర్ కూడా ఉండదు. వీటి వల్ల కూడా ఓటింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రియా విషయంలో ఇదే జరిగిందని తెలుస్తోంది. ఆమెతోపాటు హరిత హరీష్ కూడా డేంజర్ జోన్‌లో ఉన్నట్టు సమాచారం. మరి ఈ సారి డబుల్ ఎలిమినేషన్ ఉంటే హరిత హరీష్ కి ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పటికే సంజనా సీక్రెట్ రూమ్‌లో ఉన్నారు. ఈ వారం మిడ్‌లో కామనర్ దివ్యని హౌజ్‌లోకి తీసుకొచ్చారు బిగ్ బాస్. ఆమె స్థానంలో ఒకరిని ఎలిమినేట్ చేయాలని చెప్పగా అంతా సంజనా పేరుని సూచించారు. అయితే ఆమెని డైరెక్ట్ ఎలిమినేట్ చేయకుండా సీక్రెట్ రూమ్‌లో ఉంచాడు బిగ్ బాస్. సంజనాని వారం రోజులపాటు హౌజ్‌ని గమనించాలని, తన ఆట మెరుగుపర్చుకోవాలని బిగ్ బాస్ సూచించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమెని హౌజ్‌లోకి పంపించే అవకాశం ఉందని భావించారు. కానీ నాగార్జున షాక్ ఇచ్చాడు. సంజనాని ఎలిమినేట్ చేశారు. శనివారం ఆమెని ఎలిమినేట్ చేసినట్టు ప్రోమోలో చూపించారు. బిగ్ బాస్ తీరు చూస్తుంటే ఎప్పుడు ఏ ట్విస్ట్ ఇస్తారో ఊహించడం కష్టమనే చెప్పాలి. అయితే ట్విస్ట్ లు బాగానే ఉన్నా ఈ సీజన్‌పై పెద్దగా ఇంట్రెస్ట్ కలగకపోవడం గమనార్హం. అయితే ఐదో వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని, మరో ఐదుగురు కంటెస్టెంట్లని హౌజ్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. వీరిలో చాలా వరకు సెలిబ్రిటీలు, అందులోనూ టీవీ ఆర్టిస్ట్ లే ఉండబోతున్నారట. సెప్టెంబర్ 7న 15 మందితో బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభమైన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నారు.