Priyanka Chopra: ఇన్‌స్టాలో భర్త `జోనాస్‌` పేరు తీసేసిన ప్రియాంక.. షాక్‌లో ఫ్యాన్స్.. నెక్ట్స్ డైవర్సేనా?

First Published | Nov 22, 2021, 10:37 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా అభిమానులకు షాకిచ్చింది. నాగచైతన్యతో విడాకులకు ముందు సమంత చేసిందే ఇప్పుడు ప్రియాంక చోప్రా చేసింది. దీంతో విడాకులు తీసుకోబోతున్నారా? అనే వార్తలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

ప్రియాంక చోప్రా(Priyanka Chopra) బాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగింది. అంతర్జాతీయ ప్రాజెక్ట్ లు దక్కించుకుంటూ దూసుకుపోతుంది. దీంతో హాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌(Nick Jonas)తో ప్రేమలో పడింది. 2018లో వీరిద్దరు మ్యారేజ్‌ చేసుకున్నారు. రాజస్థాన్‌లోని హిస్టారికల్‌ ప్యాలెస్‌ జోద్‌పూర్‌ ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. వీరి మ్యారేజ్‌ ఈవెంట్‌ గురించి చాలా రోజుల చర్చ నడిచింది. 

మ్యారేజ్‌ నుంచి వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. తనకంటే ఏజ్‌లో చిన్న వాడైనా నిక్‌ జోనాస్‌తో మ్యారేజ్‌ చేసుకోవడంపై ప్రియాంక చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. చిన్నవాడైనా ప్రేమని పంచే విషయంలో, తనని ప్రేమగా చూసుకునే విషయంలో ఎంతో గొప్పవాడని తెలిపింది. అంతేకాదు చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ ప్రియాంక తనకి అత్యంత గొప్ప గిఫ్ట్ నిక్‌ జోనాస్‌ ఇచ్చిన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అని వెల్లడించింది. మరోవైపు దీపావళి సందర్భంగా అమెరికాలోని కొత్తింట్లోకి వెళ్లారు ప్రియాంక, నిక్‌ జోనాస్‌ జోడి. 


అన్ని విషయాల్లోనూ వీరిద్దరు ఎంతో ప్రేమగా, ఆదర్శ జంటగా రాణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక చోప్రాకి సంబంధించిన ఓ న్యూస్‌ ఇప్పుడు ట్రెండ్‌ అవుతుంది. సోషల్‌ మీడియాలో దుమారం రేపుతుంది. ట్రెండ్‌ అవుతుంది. ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ నుంచి తన పేరులోని `జోనాస్‌` ని తొలగించడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. ప్రియాంక.. నిక్‌ని పెళ్లి చేసుకున్నాక ఇన్‌స్టాగ్రామ్‌ లో తన పేరులో చివర `జోనాస్‌`ని యాడ్‌ చేసింది. తాజాగా ఆ పేరుని తొలగించడం హాట్‌ టాపిక్‌గా మారింది.  ప్రియాంక చోప్రా అకౌంట్‌ నేమ్‌ స్క్రీన్‌ షాట్లని సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు నెటిజన్లు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రియాంక అభిమానులు ఆందోళన చెందుతున్నారు. 

ప్రియాంక, నిక్‌ విడిపోతున్నారా? అనే వార్తలు ఊపందుకున్నాయి. టాలీవుడ్‌లో నాగచైతన్యతో విడిపోవడానికి రెండు నెలల ముందు సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి అక్కినేని పేరుని తీసింది. దీంతో అప్పటి నుంచే వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ అక్టోబర్‌ 2న విడిపోయారు. అయితే ఇప్పుడు ప్రియాంక చోప్రా విషయంలోనూ ఇలాంటి కామెంట్లే మొదలయ్యాయి. గత నెలలోనే వీరిద్దరు కొత్తింట్లోకి వెళ్లి దీపావళి సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఇంతలో ఇలాంటి వార్తలేంటి? అంటూ ఆందోళన చెందుతున్నారు అభిమానులు.

అయితే సోషల్‌ మీడియాలో వస్తోన్న వార్తలపై, ప్రియాంక చోప్రా, నిక్‌ జోనాస్‌లు విడిపోతున్నారా? అనే కామెంట్లపై ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. ఈ రూమర్స్ లో నిజం లేదని, వాళ్లు హ్యాపీగానే ఉన్నారనే విషయాన్ని ఆమె వెల్లడించారు. ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్‌ చేయొద్దని వెల్లడించారు. 

మరోవైపు బాలీవుడ్‌ నటుడు, క్రిటిక్‌ కమల్‌ ఆర్‌ ఖాన్‌ స్పందించారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన జోస్యం చెప్పారు. ఓ ట్విట్టర్‌ పోస్ట్‌ని కోట్‌ చేస్తూ `మీరు చెబుతున్నది నిజమేనా?. తమాషా చేస్తున్నారా? ప్రియాంక, నిక్‌ మూడేళ్లలే విడిపోతారని నేను ముందే ఊహించాను. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. నా అంచనా తప్పు కాదు. కాబట్టి చిల్‌ అవ్వండి` అంటూ సెటైరికల్‌గా పోస్ట్ పెట్టాడు కమల్‌ ఆర్‌ ఖాన్. దీంతో ప్రియాంక, నిక్‌ విడిపోతున్నారనే వార్తలకు మరింత ఊతమించినట్టయ్యింది. 

అయితే ప్రియాంక.. తన అకౌంట్‌ నుంచి `జోనాస్‌` పేరుని ఎందుకు తీసిందనేది ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది. మొన్నటి వరకు వీరిద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రతి క్షణం తమ ప్రేమని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అంతేకాదు గతంలోనూ ఓ సారి ఇలానే ప్రియాంక తన అకౌంట్‌ నుంచి `జోనాస్‌` పేరుని తీసేసింది. తర్వాత యాడ్‌ చేసింది. ఇప్పుడు అలానే చేసిందా? లేక నిజంగానే వీరిద్దరి మధ్య మనస్పర్థాలు తలెత్తాయా? విడిపోబోతున్నారా? అన్నది సస్పెన్స్ గా మారింది. మొత్తంగా ప్రియాంక-నిక్‌ విడిపోతున్నారనే వార్తలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

గ్లోబల్‌ బ్యూటీ ప్రియాంక చోప్రా చివరగా `ది వైట్‌ టైగర్‌` చిత్రంలో నటించి ప్రశంసలందుకుంది. ఇందులో ఆమె బోల్డ్ రోల్‌ చేసింది. మరోవైపు ప్రస్తుతం ఆమె హాలీవుడ్‌లో `ది మ్యాట్రిక్స్ రిసర్రెక్షన్స్`, `టెక్ట్స్ ఫర్‌ యూ` చిత్రాల్లో నటిస్తుంది. అలాగే `సిటాడెల్‌` అనే టీవీ షో చేస్తుంది ప్రియాంక.

also read: Janhvi Kapoor: ఉబికి వస్తోన్న ఎద సంపదతో జాన్వీ కపూర్‌ మైండ్ బ్లోయింగ్‌ పోజులు.. చూసుకున్నోళ్లకి చూసుకున్నంత

also read: Bheemla Nayak: పవన్‌ ఫ్యాన్స్ కి బిగ్‌ షాక్‌..`భీమ్లా నాయక్‌` రీషూట్‌.. దర్శకుడిగా త్రివిక్రమ్?

Latest Videos

click me!