Priyanka Chopra : సోషల్ మీడియాలో పేరు మార్పుపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 16, 2022, 12:20 PM IST

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా సోషల్ మీడియాలో తన పేరు మార్పు గురించి చాలాసార్లు వివరణ ఇచ్చింది. అయితే తాజాగా ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ‘వ్యానిటీ ఫెయిర్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వూలో తన పేరు మార్పునకు గల కారణాలను తెలిపింది.     

PREV
16
Priyanka Chopra : సోషల్  మీడియాలో పేరు మార్పుపై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

విశ్వ సుందరి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)బాలీవుడ్‌ నుంచి గ్లోబల్‌ స్టార్‌ గా ఎదిగింది. అంతర్జాతీయ ప్రాజెక్ట్ లు దక్కించుకొంది.  ఈ క్రమంలో హాలీవుడ్‌ పాపులర్‌ సింగర్‌ నిక్‌ జోనాస్‌ (Nick Jonas)తో ప్రేమలో పడింది. 2018లో వీరిద్దరూ ఏకమయ్యారు. రాజస్థాన్‌లోని హిస్టారికల్‌ ప్యాలెస్‌ జోద్‌పూర్‌ ఉమైద్‌ భవన్‌ ప్యాలెస్‌లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.  

26

అయితే వివాహాం జరిగినప్పటి నుంచి వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగానే  ఉన్నారు. తనకంటే ఏజ్‌లో చిన్న వాడైనా నిక్‌ జోనాస్‌ను మ్యారేజ్‌ చేసుకోవడంపై ప్రియాంక చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. చిన్నవాడైనా ప్రేమని పంచే విషయంలో, తనని ప్రేమగా చూసుకునే విషయంలో ఎంతో గొప్పవాడని తెలిపింది. 
 

36

అంతేకాకుండా చాలా సందర్భాల్లో ఒకరిపై ఒకరు తమ ప్రేమని వ్యక్తం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలోనూ ప్రియాంక తనకి అత్యంత గొప్ప గిఫ్ట్ నిక్‌ జోనాస్‌ ఇచ్చిన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అని వెల్లడించింది. అయితే సోషల్ మీడియా నుంచి తన ఇంటిపేరు చోప్రా మరియు ఆమె భర్త నిక్ జోనాస్ ఇంటిపేరు జోనాస్‌ను తొలగించిన తర్వాత, ఈ జంట విడిపోవడం గురించి సోషల్ మీడియాలో ఊహాగానాలు మొదలయ్యాయి. 
 

46

అయితే, వారు త్వరలో సోషల్ మీడియాలో థాంక్స్ గివింగ్ అనే అనేక మెత్తని పోస్ట్‌లను పోస్ట్ చేయడం ద్వారా ఊహాగానాలకు తెరదించారు. గతంలో  ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా కూడా వారిద్దరు విడిపోతారనే పుకార్లను కొట్టిపారేసింది. 
 

56

ప్రియాంక మాత్రం తన సోషల్ మీడియా ఇన్ స్టా పేరును తన ట్విట్టర్‌తో సరిపోలా  చూసుకున్నానని తెలిపింది. అంతేకానీ ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం లేదని స్పష్టం చేసింది.  అయితే ఇలాంటి మార్పులు చేయాల్సినప్పుడల్లా ప్రజలకు చాలా పెద్ద నిర్ణయంలా కనిపించడంఆశ్చర్యకరంగా ఉందిన్నారు.  ఇప్పటికైనా ప్రశాంతంగా ఉండాలంటూ కోరింది. 
 

66

కాగా, తన పేరుతో కలిసి ఉన్న ఇంటి పేరు, తన భర్త పేరును గతంలో తొలగించడంతో వారు విడిపోతారే పుకార్లు సోషల్ మీడియాలో వీపరితంగా వ్యాప్తి చెందాయి.  ఈ విషయాన్ని ఎప్పటికఫ్పుడు ప్రియాంక చోప్రా ఖండిస్తూనే వస్తోంది.  లాస్ట్ ఈయర్ రిలీజైన హాలీవుడ్ మూవీ‘మ్యాట్రిక్స్ రిసరెక్షన్స్’లో కీలక పాత్ర పోషించింది.  
 

click me!

Recommended Stories