Nayanthara: ప్రియుడితో కలిసి భారీ ప్లాన్ వేసిన నయనతార.. అందుకే దుబాయ్ లో అన్ని రోజులు...?

First Published | Jan 16, 2022, 11:53 AM IST

సినిమా స్టార్స్ బిజినెస్ లు చేయడం కొత్తేం కాదు. చాలామంది ఫిల్స్ స్టార్స్ కు కోట్లలో ప్యాపారాలు ఉన్నాయి. విదేశాల్లో భారీ హోటల్స్ ఉన్నాయి. ఇతర సంస్థల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఇఫ్పుడు ఆ లిస్ట్ లోకి చేరింది కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరోయిన్ నయనతార (Nayanthara).

నయనతార(Nayanthara) ఇప్పటికే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో బ్రేకప్ చెప్పింది. ఇక కొన్ని ఏళ్ల నుంచి యంగ్ డైరెక్టర్ విష్నేష్ శివన్(Vignesh Shivan) తో డేటింగ్ లో ఉంది నయన్ తార. ఈ సారి మాత్రం వీరిద్దరి జోడీ గట్టిగానే సెట్ అయినట్టు తెలుస్తుంది. మంచి అండస్ట్రాండింగ్ తో ఇద్దరూ కలిసి నడుస్తున్నారట.

నయనతార(Nayanthara) - విష్నేష్(Vignesh Shivan).. ఈ ప్రేమ జంట సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటారు. ఛాన్స్ దొరికితే ఫారెన్ టూర్లతో హడావిడి చేస్తుంటారు. ఇక ఇప్పటికే ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తో విడిపోయిన నయనతారకు.. విష్నేష్ తో మాత్రం మంచి బాండింగ్ కుదిరినట్టు తెలుస్తోంది. ఇద్దరు ఒకే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు.


నయనతార -విఘ్నేష్ లు కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఒక వైపు సినిమాలు చేస్తూనే.. ఇతర రంగాలపై కూడా దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇప్పటికే విఘ్నేష్ (Vignesh Shivan) డైరెక్షన్ లో నయనతార(Nayanthara)  సినిమాలు చేస్తుంది. రౌడీ పిక్చర్స్ స్థాపించి సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. దాంతో  ఇద్దరి మధ్య మంచి అవగాహన రావడంతో.. ఇద్దరు కలిసి వ్యాపారం కూడా చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

నయనతార(Nayanthara) కు ఇప్పటికే చాలా వ్యాపారాలు ఉన్నాయి. కొన్ని వ్యాపారాలలో పెట్టుబడులు కూడా పెట్టింది. ఇఫ్పుడు విఘ్నేష్ తో కలిసి భారీ పెట్టుబడి పెట్టడానికి రెడీ అయినట్టు తెలుస్తోంది. దుబయ్ కి చెందిన ఓ ఆయిల్ కంపెనీలో విరిద్దరు ఏకంగా 100 కోట్ల పెట్టుబడులు పెట్టారట. ఈ న్యూస్ ఇఫ్పుడు కోలీవుడ్ సర్కిల్ లో వైరల్ అవుతుంది. దాని కోసమే ఈ జటం లాంగ్ దుబాయ్ టూర్ వేసినట్టు చెప్పుకుంటున్నారు. ఎప్పుడో డిసెంబర్ లాస్ట్ వీక్ లో ప్రియుడు విఘ్నేష్(Vignesh Shivan) తో కలిసి దుబాయ్ ట్రిప్పుకు వెళ్ళింది నయన తార.

దుబాయ్ లోనే న్యూ ఇయర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ జంట. బుర్జ్ ఖలీఫ్  దగ్గర కూడా.. ఈ ఇద్దరు సందడి చేశారు. ఫోటోలో దిగి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.. కాని ఆ తరువాత వారు ఇండియాకు రాలేదట. ఏం జరుగుతుంది అని కోలీవుడ్ వర్గాలు ఆరా తియ్యగా.. విరిద్దరి భారీ బిజినెస్ ప్లాన్ బయట పడిందని టాక్.

ఇక విఘ్నేష్(Vignesh Shivan)  డైరెక్షన్ లో కాధువాకుల రెండు కాదల్ అనే సినిమాలో నయన్ తార నటించింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, సమంత కూడా నటించారు. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన గాఢ్ ఫాదర్ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు షారుఖ్ ఖాన్ హీరోగా తమిళ డైరెక్టర్ అట్లీ తీయబోయే సినిమలో కూడా నయన్ హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

Latest Videos

click me!