మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే గ్లోబల్ చిత్రానికి గ్లోబల్ బ్యూటీ హీరోయిన్ గా ఫిక్స్ అయింది. హాలీవుడ్ స్థాయిలో క్రేజ్ ఉన్న ప్రియాంక చోప్రాని రాజమౌళి.. మహేష్ చిత్రం కోసం ఫైనల్ చేశారు. పలు చర్చల తర్వాత ప్రియాంక చోప్రా ఈ చిత్రానికి ఓకె చెప్పిందట. ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ తర్వాత హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంది.
నిక్ జోనస్ ని వివాహం చేసుకున్న పీసీ అమెరికాలో సెటిల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా తొలిసారి రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో నటించేందుకు ప్రియాంక చోప్రా రెడీ అవుతోంది. మహేష్ బాబు, రాజమౌళి చిత్రం అంతర్జాతీయ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. హాలీవుడ్ చిత్రాలకు తీసిపోని విధంగా 1000 కోట్ల బడ్జెట్ లో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. కెఎల్ నారాయణ నిర్మాత.
ప్రియాంక చోప్రా లాంటి స్టార్ బ్యూటీ మహేష్ కి జోడిగా నటిస్తుండడం ఫ్యాన్స్ కి సంతోషమే. కానీ ఒక బ్యాడ్ సెంటిమెంట్ మహేష్ అభిమానులని కలవరపెట్టే విధంగా ఉంది. మహేష్ బాబు బాలీవుడ్ హీరోయిన్లతో నటించిన ప్రతి సారీ గొప్ప రిజల్ట్ అయితే రాలేదు. చాలా సందర్భాల్లో మహేష్ కి బాలీవుడ్ హీరోయిన్లతో డిజాస్టర్లు ఎదురయ్యాయి.
అమీషా పటేల్, మహేష్ జంటగా నాని చిత్రంలో నటించారు. ఈ మూవీ కూడా నిరాశ పరిచింది. మహేష్ బాబు, అమృత రావు జంటగా అతిథి చిత్రంలో నటించారు. ఆ సినిమా కూడా గొప్పగా ఆడలేదు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
మహేష్ బాలీవుడ్ హీరోయిన్లతో నటించిన ప్రతి సారీ ట్రాక్ రికార్డ్ బాగాలేదు. ప్రీతి జింతా, కియారా అద్వానీ లతో నటించిన చిత్రాలకు మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు 1000 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం కోసం రాజమౌళి ప్రియాంక చోప్రాని తీసుకుంటున్నారు. మహేష్ బ్యాడ్ సెంటిమెంట్ ని గమనిస్తున్న ఫ్యాన్స్ ఏం జరుగుతుందో అని టెన్షన్ పడుతున్నారు.