ఆ టాలీవుడ్ హీరోతో అనుష్క ఒక్క మూవీ కూడా చేయలేదు..రెండేళ్లు చిన్నవాడైనా ఛాన్స్ వస్తే వదిలిపెట్టదట

First Published | Dec 28, 2024, 10:14 AM IST

అనుష్క శెట్టి టాలీవుడ్ లోకి 'సూపర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మాయ చేసిన స్వీటీ తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది. ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.

Anushka Shetty

అనుష్క శెట్టి టాలీవుడ్ లోకి 'సూపర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే మాయ చేసిన స్వీటీ తక్కువ టైంలోనే స్టార్ గా మారిపోయింది. ప్రభాస్, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఏజ్ డిఫరెన్స్ వల్ల కొందరు స్టార్ హీరోలతో అనుష్క నటించలేదు. 

అనుష్క తన కెరీర్ లో విక్రమార్కుడు, అరుంధతి, మిర్చి, సింగం లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. బాహుబలి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనుష్క అందం, నటనతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగింది. బాహుబలి తర్వాత మాత్రం అనుష్క సినిమాల స్పీడు తగ్గించింది అని చెప్పొచ్చు. 


యోగా టీచర్ గా ఉన్న అనుష్కని పూరి జగన్నాధ్ హీరోయిన్ గా సూపర్ చిత్రంతో పరిచయం చేశారు. సూపర్ చిత్రంలో హీరోయిన్ గా ఎంపిక చేశాక.. హీరోకి నీ ఫొటోలు చూపించాలి అని అడిగితే పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చిందట. అంత అమాయకంగా ఉండే అనుష్క ఇప్పుడు టాప్ హీరోయిన్ గా ఎదిగింది. 

Also Read : ఆ సూపర్ హిట్ పాటని చిరుతో నేను చేయాల్సింది, మరో హీరోయిన్ కి మార్చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చేశా

Anushka Shetty

అనుష్క రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలతో నటించలేదు. ఎందుకంటే వాళ్ళు అనుష్క కంటే వయసులో చిన్నవారు. కానీ ఓ ఇంటర్వ్యూలో అనుష్క మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వేళ తారక్ తో నటించే ఛాన్స్ వస్తే వదులుకోను అని తెలిపింది. అనుష్క కంటే ఎన్టీఆర్ రెండేళ్లు చిన్నవాడు. గతంలో కూడా చాలా మంది హీరోయిన్లు తమకంటే వయసు తక్కువ ఉన్న వారితో నటించారు. 

టాలీవుడ్ లో తనకి కంఫర్టబుల్ గా అనిపించే హీరో రవితేజ అని అనుష్క తెలిపింది. విక్రమార్కుడు, బలాదూర్ చిత్రాల్లో అనుష్క రవితేజతో నటించింది. మరి జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలనే అనుష్క కోరిక తీరుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల లైనప్ చూస్తుంటే ఇప్పట్లో సాధ్యం అయ్యేలా లేదు. 

Latest Videos

click me!