Priyanka Chopra: పారిస్‌లో ప్రియాంక - నిక్ రొమాంటిక్ గ్లామర్ షో, పెళ్లై 7 ఏళ్లైనా తగ్గని ప్రేమ..

Published : Jul 09, 2026, 04:11 PM IST

పారిస్ ఫ్యాషన్ వీక్‌లో ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ తమ గ్లామరస్ లుక్స్‌తో, రొమాంటిక్ కెమిస్ట్రీతో అందరి మనసులు గెలుచుకున్నారు. ఈ జంటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

PREV
15
అందరి దృష్టిని ఆకర్శించిన ప్రియాంక, నిక్

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంక చోప్రా మరోసారి తన స్టైల్‌తో వార్తల్లో నిలిచింది. ఈసారి తన భర్త నిక్ జోనస్‌తో కలిసి పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసింది. ఈ ఈవెంట్‌లో ఈ జంట గ్రాండ్ ఎంట్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. వీరిద్దరి మధ్య ఉన్న అద్భుతమైన కెమిస్ట్రీ అందరి దృష్టిని ఆకర్శించింది.

25
పారిస్ ఫ్యాషన్ షో కోసం..
పారిస్ ఫ్యాషన్ షో కోసం ప్రియాంక చోప్రా చాలా ఎలిగెంట్ లుక్‌ను ఎంచుకుంది. ఆమె ఆరెంజ్, ఎల్లో కలర్ టాసెల్ వర్క్ డ్రెస్ ధరించింది. స్లీవ్‌లెస్ డ్రెస్ కావడంతో పాటు డీప్, వైడ్ నెక్‌లైన్ ఉండటంతో షోల్డర్ ఏరియా హైలైట్ అయింది. ఈ డ్రెస్‌కు తగ్గట్టుగా ఓపెన్ హెయిర్, అదిరిపోయే మేకప్‌తో కనిపించింది.
35
క్లాసిక్ సూట్‌లో నిక్ జోనస్
మరోవైపు, నిక్ జోనస్ క్లాసిక్ సూట్‌లో చాలా డాషింగ్‌గా కనిపించాడు. ఇద్దరూ కెమెరాల ముందు నవ్వుతూ ఎన్నో ఫోజులిచ్చారు. వీరి రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
45
పెళ్లయి ఏడేళ్లు..

ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల పెళ్లయి ఏడేళ్లు పూర్తయ్యాయి. వారిపై ఎన్ని నెగటివ్ కామెంట్లు వచ్చినా, ఈ జంట ఇప్పటికీ ఒకరిపై ఒకరు ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో వారి ప్రేమ అందరినీ ఆకట్టుకుంటుంది. 

55
ప్రియాంక చోప్రా గారాలపట్టి

ప్రియాంక చోప్రా తన గారాలపట్టి మాలతీని కూడా పారిస్‌కు తీసుకెళ్లింది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయగా, అవి చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే, ప్రియాంక ఎస్.ఎస్. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో  'వారణాసి'లో కనిపించనుంది. 'సిటాడెల్ సీజన్ 2'లో యాక్షన్ చేయనుంది. ఇది కాకుండా 'జడ్జ్‌మెంట్ డే, ఓర్లాండో బ్లూమ్' అనే హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories