కార్తీక్ ఇంట్లో పని మనిషిలా తిష్ట వేసిన ప్రియమణి.. ఇకపై డాక్టర్ బాబు ఇంట్లో నిప్పులే!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 09, 2021, 11:14 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మొదటి నుంచి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది.

PREV
110
కార్తీక్ ఇంట్లో పని మనిషిలా తిష్ట వేసిన ప్రియమణి.. ఇకపై డాక్టర్ బాబు ఇంట్లో నిప్పులే!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మొదటి నుంచి మంచి రేటింగ్ తో దూసుకుపోతుంది. తెలుగు ప్రేక్షకులకు ఈ సీరియల్ మంచి అభిమానంగా మారింది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం..
 

210

దీప మోనిత గురించి తలచుకొని ఎలాగైనా మోనిత గురించి రోషిణికి చెప్పి జీవితాంతం జైలు శిక్ష పడేలా చేయాలని అనుకుంటూ రోడ్డుపై నడుచుకుంటూ వస్తుండగా వెనకాల ఓ కారు వేగంగా వచ్చి దీపకు తగులుతున్న సమయంలో ప్రియమణి వచ్చి కాపాడుతుంది.
 

310

వెంటనే దీప ప్రియమణిని చూసి గుర్తుపట్టి మాట్లాడుతుంది. చూడటానికి ప్రియమణిలో చాలా మార్పులు రావడంతో.. ప్రియమణి దీపతో బాగా ఎమోషనల్ గా మాట్లాడుతుంది. మోనిత అలా చేస్తుందని అనుకోలేదు అంటూ తనను కూడా మోసం చేసిందంటూ బాధపడుతుంది.
 

410

క్షమించు అంటూ దీప కాళ్ళపై పడుతుంది.దీపతో అన్నం తిని రెండు రోజులు అయ్యిందని డబ్బులు అడగగానే ఆ సీన్ ఎమోషనల్ గా అనిపించింది. ఎవరినైనా డబ్బులు అడిగితే నీచంగా ప్రవర్తిస్తున్నారని ఏడుస్తుంది. మీ ఇంట్లో పని చేస్తాను అంటూ జీతం ఇవ్వకుండా భోజనం పెట్టమని కోరుకుంటుంది.
 

510

ఇక దీప మా అత్తయ్య గారు ఒప్పుకుంటే చేస్తావని చెబుతుంది. ఇంట్లో హిమ తన తండ్రితో గడిపిన క్షణాలను తలుచుకుని బాధపడుతుంది. అప్పుడే సౌర్య వచ్చి నాన్న పుట్టినరోజు అంటూ నాన్న పుట్టినరోజు ఎలా జరుపుకునే వాళ్ళు అని అడగటంతో హిమ ఆ పుట్టిన రోజు చేసే హడావుడి మొత్తం చెబుతుంది.
 

610

 ఈ రోజు ఇంకా బర్త్ డే విషెస్ చెప్పలేదు అంటూ నాన్న ఫీల్ అవుతాడు కదా చెప్పు హిమ అని సౌర్య అనడంతో హిమ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అంతలోనే కార్తీక్ హిమ వచ్చి బర్త్ డే విషెస్ చెప్పినట్లు కలలో కలవరిస్తాడు. మరోవైపు సౌర్య వెళ్లి హిమతో నాన్నకి విష్ చేద్దాం అంటూ బ్రతిమాలుతుంది.
 

710

అప్పుడే కార్తీక్ వచ్చి పిల్లలను పలకరించి తన బర్త్ డే కదా అని అనడంతో హిమ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో కార్తీక్ బాధపడతాడు. వెంటనే సౌర్య తన తండ్రికి బర్త్డే విషెస్ చెబుతుంది. ఇంట్లో వాళ్ళందరూ కార్తీక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతారు.
 

810

ఇక కార్తీక్ డల్ గా కనిపించడంతో సౌందర్య ప్రశ్నిస్తుంది. ఇక కార్తీక్ హిమ విష్ చేయలేదని చెబుతూ బాధపడతాడు. దీప ఎక్కడ అని అడిగితే నీ పేరు మీద గుడిలో పూజ చేయించడం కోసం వెళ్ళిందని చెబుతుంది సౌందర్య. అంతలోనే దీప రావడంతో వెనకాల నుండి ప్రియమణిని చూసి షాక్ అవుతారు.
 

910

వెంటనే కార్తీక్ ప్రియమణి ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటూ అరుస్తాడు. మెడ పట్టి బయటకు గెంటెయు అంటూ దీపతో అంటాడు. దీప నేనే తీసుకువచ్చాను అని అనడంతో కార్తీక్ కోపంగా అరుస్తాడు. ప్రియమణి సౌందర్య కాళ్ళపై పడటంతో సౌందర్య ఇష్టం లేకున్నా ఒప్పుకుంటుంది.
 

1010

మరోవైపు సుకన్య వచ్చి మోనితతో ప్రియమణి గురించి చెప్పడంతో ఇదంతా మోనిత ప్లాన్ అని అర్థమవుతుంది. మొత్తానికి మళ్లీ కార్తీక్ కుటుంబంలో ప్రియమణి రూపంలో నిప్పులు చల్లింది మోనిత.

click me!

Recommended Stories