రిషిపై సెటైర్స్ వేసిన జగతి.. సునామీ సృష్టించేందుకు సిద్దమైన దేవయాని.. కథ మలుపు తిరుగుతుందా?

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 09, 2021, 10:00 AM ISTUpdated : Oct 09, 2021, 10:01 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగులో మొదటి స్థానంలో దూసుకుపోతుంది

PREV
16
రిషిపై సెటైర్స్ వేసిన జగతి.. సునామీ సృష్టించేందుకు సిద్దమైన దేవయాని.. కథ మలుపు తిరుగుతుందా?

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. మంచి కథతో ప్రసారమవుతున్న ఈ సీరియల్ రేటింగులో మొదటి స్థానంలో దూసుకుపోతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

26

ఎడ్యు కల్చర్ ప్రోగ్రాం పూర్తవడంతో మహేంద్ర, ఫణేంద్ర జగతిని పొగుడుతారు. ఇక దేవయాని ఆ మాటలు విని రిషి కంటేనా అంటూ మాట్లాడుతుంది. అప్పుడే రిషి రావడంతో రిషితో ప్రోగ్రాం గురించి మాట్లాడుతుంది.
 

36

ఇక వసుతో దిగిన ఫోటోను రిషి చూసుకుంటూ మురిసిపోతుండగా.. ధరణి వచ్చి చూడటంతో కాస్త కంగారు పడతాడు. మరోవైపు వసు కూడా రిషి ఇచ్చినా నెమలి ఈకను చూస్తూ మురిసిపోతుంది.
 

46

 ఇక నెమలి ఈకను తన దగ్గరున్న నెమలి ఈక తో ఫోటో తీసి రిషి కి పంపిస్తుంది. రిషి ఆ ఫొటో చూసి వసు మాట్లాడిన మాటలు తలుచుకుంటాడు. మళ్లీ అలా ఆలోచిస్తున్నాను ఏంటి అని తనకు గుడ్ నైట్ చెప్పి పడుకుంటాడు.
 

56

వసు ఆ మెసేజ్ చూసి బాగుంది అని పెట్టొచ్చుగా అంటూ అనుకొని పడుకుంటుంది. మరోవైపు ధరణి మహేంద్ర వర్మ తో రిషి, వసుల గురించి మాట్లాడుతుంది. రిషిలో మార్పు వచ్చింది అని అనడంతో మహేంద్ర ఆలోచనలో పడతాడు.
 

66

 ఇదంతా వసు వల్ల జరిగింది అని గురు దక్షిణం అడిగిన విషయం లో తప్పులేదని అనుకుంటాడు. అదే సమయంలో దేవయాని రావడంతో భయపడుతూ మాట మారుస్తూ మాట్లాడతారు.
 

click me!

Recommended Stories