తెలుగమ్మాయిగా గర్వంగా చెప్పుకుంటాః పూజా హెగ్డే.. `meb‌` ఈవెంట్‌లో ఈ అమ్మడి రచ్చ మామూలుగా లేదుగా..

Published : Oct 09, 2021, 09:19 AM IST

`నేను ఎక్కడికి వెళ్లినా తెలుగమ్మాయిగా గుర్తిస్తున్నారు. తెలుగు సినిమా అంటే నా కెరీర్‌లో ఓ రెస్పెక్ట్ ఉంటుంది. నేను తెలుగమ్మాయిగా గర్వంగా చెప్పుకుంటా` అని అంటోంది పూజా హెగ్డే. అఖిల్‌తో కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆమె స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 

PREV
110
తెలుగమ్మాయిగా గర్వంగా చెప్పుకుంటాః పూజా హెగ్డే.. `meb‌` ఈవెంట్‌లో ఈ అమ్మడి రచ్చ మామూలుగా లేదుగా..

అఖిల్‌, పూజా హెగ్డే కలిసి నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం ఈ నెల 15న దసరా కానుకగా విడుదల కానుంది. `బొమ్మరిల్లు` భాస్కర్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాని బన్నీవాసు, వాసు వర్మ సంయుక్తంగా నిర్మించగా, అల్లు అరవింద్‌ సమర్పకులుగా వ్యవహరించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేశారు. అందులో భాగంగా శుక్రవారం ఈ చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. 
 

210

నాగచైతన్య గెస్ట్ గా వచ్చిన ఈవెంట్‌లో హీరోయిన్‌ పూజా హెగ్డే స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. అంతేకాదు ఈ అమ్మడు చేసిన రచ్చ మామూలు కాదు. ప్రతి ఒక్కరు గెస్ట్ లు పూజా గురించి స్పెషల్‌గా మాట్లాడటం విశేషం. హరీష్‌ శంకర్‌ అయితే ఆమెని ఆకాశానికి ఎత్తేశాడు. కరోనా టైమ్‌లో అత్యంత బిజీ ఆర్టిస్టు అని తెలిపారు. అంతేకాదు ఆమెపై పలు పంచ్‌లు కూడా వేసి నవ్వించాడు. 
 

310

మరోవైపు అల్లు అరవింద్‌ ఆమెపై ఉన్న ప్రేమని, అభిమానాన్ని చాటుకున్నారు. ఆమె నటనని ప్రశంసించారు. గ్లామర్‌ మాత్రమే కాదు, నటన పరంగానూ మెప్పించగల నటీమణుల్లో పూజా ముందు వరుసలో ఉంటారని ప్రశంసించారు. అలాగే నిర్మాత బన్నీ వాసు సైతం ఆమెని స్పెషల్‌గా మెన్షన్‌ చేయడం విశేషం. 

410

అంతేకాదు అఖిల్‌ అయితే ఆమె ఎదిగిన విధానాన్ని అభినందిస్తూ, ఆమె అనుభవానుంచి ఇన్‌స్పైర్‌ అవుతానని తెలిపారు. నాగచైతన్య పూజాతో కలిసి నటించిన `ఒకలైలాకోసం` చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంకా ఆ సినిమా తన కళ్ల ముందు తిరుగుతున్నట్టే ఉందన్నారు. అద్భుతమైన నటి అని తెలిపారు చైతూ. 

510

ఈ ఈవెంట్‌లో పూజా హెగ్డే మాట్లాడుతూ, టాలీవుడ్‌పై ప్రశంసలు కురిపించింది. ఎక్కడికి వెళ్లినా తనని ఓ తెలుగు గర్ల్ గా చూస్తున్నారని, ఆ రెస్పెక్ట్ ఉందన్నారు. తెలుగమ్మాయిగా చెప్పుకోవడం గర్వంగా ఉందని వెల్లడించింది పూజా. అంతేకాదు ఇందులో తనది చాలా పొటెన్షియల్‌ ఉన్న పాత్ర అని, ఇలాంటి పాత్రని రాసిన దర్శకుడు భాస్కర్‌కి థ్యాంక్స్ చెప్పింది పూజా. 

610

అల్లు అరవింద్‌ నాలుగైదు రోజుల క్రితం మార్నింగ్‌ ఓ మెసేజ్‌ పెట్టాడట. అది చూసి భయమేసిందని తెలిపింది పూజా. దేవుడుని తలచుకుని ఆ మెసేజ్‌ని చూశానని, అందులో తన పర్‌ఫెర్మెన్స్ ని అభినందిస్తూ ఉందని తెలిపింది. అల్లు అరవింద్ తనకు మెసేజ్‌ చేసి ప్రశంసించడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. 

710

`మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` లాఫ్టర్‌ థెరపీ లాంటి సినిమా అని, ఫ్యామిలీ అంతా కలిసి చూసి ఎంజాయ్‌ చేసేలా ఉంటుందని తెలిపింది. కరోనా కారణంగా రెండేళ్లుగా అందరు ఓ ఒత్తిడిలో ఉన్నారని, ఆ రెండేళ్ల ఒత్తిడిని జస్ట్ రెండున్నర గంటల్లో ఈ సినిమా పోగొడుతుందని, హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని తెలిపింది. అంతేకాదు ఇందులో మంచి సందేశం కూడా ఉన్నట్టు పేర్కొంది. 

810

ఈ సినిమాలోని `లెహరాయి` పాట తనని హంట్‌ చేస్తుందని, `సామజవరగమన`(అల వైకుంఠపురములో..) తర్వాత ఆ స్థాయిలో మళ్లీ మళ్లీ ఈ పాట విన్నానని, ఈ సందర్భంగా సంగీత దర్శకుడు గోపీసుందర్‌కి ధన్యవాదాలు తెలిపింది పూజా. 
 

910

ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్‌ శంకర్‌.. పూజా హెగ్డే సినిమాల లైనప్‌ని వెల్లడించిన విషయం తెలిసిందే. మాటల ఫ్లోలో ఆమె నెక్ట్స్ సినిమాలు కూడా కన్ఫమ్‌ చేశాడు. అఖిల్‌, పవన్‌ కళ్యాణ్‌, ప్రభాస్‌, మహేష్‌, బన్నీ అంటూ చెప్పుకుంటూ పోయాడు. దీంతో పవన్‌ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌ సింగ్‌`లో తాను హీరోయిన్‌గా ఎంపికైందనే విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించారు హరీష్‌. 
 

1010

అంతేకాదు బన్నీతోనూ ఎంపికైందనే విషయం వెల్లడించారు. బన్నీ, వేణు శ్రీరామ్‌ కాంబినేషన్‌లో `ఐకాన్‌` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గానూ పూజా ఫైనల్‌ అయ్యిందనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పేశారు.
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories