ఓనమ్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. కొంటెగా కవ్విస్తూ పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ

Published : Sep 10, 2022, 07:02 PM IST

కన్నుగీటుతో ఇండియాని షేక్‌ చేసిన ప్రియా ప్రకాష్‌ వారియర్‌ నయా లుక్‌లో మెస్మరైజ్‌ చేస్తుంది. సరికొత్త లుక్లో కటిపడేస్తుంది. చాలా గ్యాప్‌తో ఫ్యాన్స్ కి కనువిందు చేస్తుందీ మలయాళ ముద్దుగుమ్మ. 

PREV
16
ఓనమ్‌ లుక్‌లో కట్టిపడేస్తున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌.. కొంటెగా కవ్విస్తూ పిచ్చెక్కిస్తున్న హాట్‌ బ్యూటీ

ప్రియా ప్రకాష్‌ వారియర్‌ మరోసారి సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఓనమ్‌ లుక్‌లో కనిపిస్తూ మెస్మరైజ్‌ చేస్తుంది. కేరళా వారి పండుగ ఓనమ్‌ ఇతాజాగా పూర్తయ్యింది. ఈ సందర్భంగా మలయాళ ఆడపడుచులంతా వైట్‌ పట్టు శారీలో మెరుస్తుంటారు. మరింత అందంగా ముస్తాబై కనువిందు చేస్తుంటారు. అలా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కూడా ఓనమ్‌ డ్రెస్‌లో మతిపోగొడుతుంది. 

26

తాజాగా ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది ప్రియా ప్రకాష్‌ వారియర్‌. ఇవి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. శారీలో ప్రియా ప్రకాష్‌ వారయిర్‌ లుక్‌ పిచ్చెక్కిచేలా ఉంది. పైగా ఆమె కొంటెగా చూస్తూ కుర్రాళ్ల కొంప కొల్లేరు చేస్తుంది.
 

36

ఇప్పుడు సోషల్‌ మీడియాని వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. నాలుగేళ్ల క్రితం ఈ బ్యూటీ ఎంతగా పాపులర్ అయ్యిందో తెలిసిందే. తాను నటించిన సినిమాలోని పాటలో కన్నుగీటుతో ఒక్కసారిగా ఓవర్‌నైట్‌లో స్టార్‌ అయిపోయింది. కుర్రాళ్లు మొత్తం ఈ అమ్మడికి పడిపోవడం విశేషం. 
 

46

దీంతో ఒక్కసారిగా క్రేజ్‌ని సొంతం చేసుకున్న ప్రియా ప్రకాష్‌ వారియర్‌ వరుసగా సినిమా అవకాశాలను దక్కించుకుంది. తొలి సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయినా, ఆమెకి ఆఫర్లు వచ్చాయి. తెలుగులోనూ రెండు సినిమాల్లో మెరిసింది ప్రియా. నితిన్‌తో `చెక్‌`, `ఇష్క్` చిత్రాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు పరాజయం చెందాయి. 
 

56

ఆ తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్లు రాలేదు. కానీ సౌత్‌లో మాత్రం ఫుల్‌ బిజీగా ఉంది. హిందీ నుంచి కూడా ఈ భామకి ఆఫర్లు వస్తుండటం విశేషం. ప్రస్తుతం కన్నడలోకి ఎంట్రీ ఇస్తూ `విష్ణు ప్రియా` చిత్రంలో నటిస్తుంది. హిందీలోకి ఎంట్రీ `శ్రీదేవి బంగ్లా` చిత్రంలో, అలాగే `3మంకీస్‌`, `లవ్‌ హ్యాకర్స్` అనే సినిమాలు చేస్తుంది. 
 

66

ఇంకోవైపు మలయాళంలోనూ ఆఫర్లు వస్ఉతన్నాయి. అక్కడ` కొల్ల`, `4ఇయర్స్`తోపాటు మరో సినిమా చేస్తుంది ప్రియా ప్రకాష్‌ వారియర్. మొత్తంగా ఈ హాట్ బ్యూటీ చేతిలో దాదాపు ఏడు సినిమాలున్నాయి. రెండేళ్ల వరకు బిజీగా ఉంది అందాల భామ. ఈ సినిమాల్లో ఒక్కటి హిట్‌ అయినా ప్రియా ప్రకాష్‌ వారియర్‌ హీరోయిన్‌గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories