‘బబ్లీ బౌన్సర్’ హవా.. స్టైలిష్ వేర్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా.. పిక్స్ వైరల్.!

Published : Sep 10, 2022, 06:40 PM IST

స్టార్ హీరోయిన్ తమన్న భాటియా (Tamannaah Bhatia) స్టైలిష్ వేర్ లో ట్రెండ్ సెట్ చేస్తోంది. తను నటించిన చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ.. స్టన్నింగ్ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేస్తోంది.   

PREV
16
‘బబ్లీ బౌన్సర్’ హవా.. స్టైలిష్ వేర్ లో ట్రెండ్ సెట్ చేస్తున్న మిల్క్ బ్యూటీ తమన్నా.. పిక్స్ వైరల్.!

మిల్క్ బ్యూటీ తమన్నా ఇన్నాళ్లు టాలీవుడ్ లో వెలుగొందిన విషయం తెలిసిందే. ఇప్పటికీ స్టార్ హీరోల సరసన నటిస్తున్న తమన్నా ఫోకస్ ప్రస్తుతం బాలీవుడ్ వైపు మళ్లింది. ఈ సందర్భంగా అక్కడి  నుంచి కూడా మిల్క్ బ్యూటీకి వరుస ఆఫర్లు వస్తున్నాయి. 
 

26

తాజాగా తమన్నా లీడ్ యాక్ట్రెస్ గా నటించిన చిత్రం ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer). ప్రస్తుతం ఈ చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉంది. దీంతో చిత్ర యూనిట్ ఇటీవలనే  ప్రమోషన్ కార్యక్రమాలను  నిర్వహించింది. మూవీ యూనిట్ తమదైన శైలిలో ప్రచార కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. 
 

36

ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా చిత్ర దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్ (Madhur Bhandarkar), హీరోయిన్ తమన్నా భాటియా ముంబైలోని లాల్‌బాగ్‌లోని లాల్ బాగ్చా రాజా గణేష్ మండపాన్ని సందర్శించారు. తాజాగా తమన్నా కూడా క్రేజీగా ఫొటోషూట్ నిర్వహించింది. 
 

46

‘బబ్లీ బౌన్సర్’ను ప్రమోట్ చేస్తూ తమన్నా తాజాగా ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొంది.  ఈ సందర్భంగా అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. బ్లాక్ అండ్ బ్లాక్ ట్రెండీ వేర్ లో స్టన్నింగ్ స్టిల్స్ తో మతిపోగొట్టింది. క్రేజీగా ఫొటోషూట్లు చేస్తూ ట్రెండ్ చేస్తోంది. ప్రస్తుతం తమన్నా భాటియా పోస్ట్ చేసిన  పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
 

56

హీరోయిన్ తమన్నా లీడ్ రోల్ లో నటించగా, దర్శకుడు మధుర్ బండార్కర్ ‘బబ్లీ  బౌన్సర్’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభమైన ఈ చిత్రాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే చిత్రాన్ని పూర్తి చేశారు. దేశంలో మహిళా బౌన్సర్ ఆధారంగా తెరకెక్కిన చిత్రంగా ‘బబ్లీ బౌన్సర్’ రికార్డు  క్రియేట్ చేయనుంది.
 
 

66

స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఓటీటీ ప్లాట్ ఫాం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో సెప్టెంబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది.  ఈక్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఎక్కువ ఆడియెన్స్ కు రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories